కెనాన్ ఈవోఎస్ 6డి మార్క్ 2 డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా విడుదల


Mon,July 17, 2017 03:27 PM

'ఈవోఎస్ 6డి మార్క్ 2' పేరిట కెనాన్ ఓ నూతన డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను ఇవాళ విడుదల చేసింది. రూ.1,32,995 ధరకు ఈ కెమెరా యూజర్లకు లభిస్తున్నది. Canon EF 24-70mm f/4L IS USM లెన్స్‌తో కలిపి ఈ కెమెరాను కొంటే రూ.1,84,995 అవుతుంది. అదే Canon EF 24-105mm f/4L IS USM II లెన్స్‌తో కలిపి ఈ కెమెరాను కొనుగోలు చేస్తే రూ.2,02,995 వరకు అవుతుంది.

కెనాన్ విడుదల చేసిన ఈవోఎస్ 6డి మార్క్ 2 కెమెరాలో 26.2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెన్సార్ ఉంది. డిజిక్ 7 ఇమేజ్ ప్రాసెసర్ ఉండడం వల్ల వేగంగా ఫొటోలు తీసుకోవచ్చు. వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.1, జీపీఎస్, డస్ట్, వాటర్ రెసిస్టెంట్, 3 ఇంచ్ డిస్‌ప్లే విత్ టచ్ స్క్రీన్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

1205

More News

VIRAL NEWS