రూ.2వేల లోపు లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Mon,January 9, 2017 08:24 PM

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? చాలా తక్కువ ధరలోనే వచ్చే ఏదైనా బేసిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ వివరాలు మీ కోసమే. కింద ఇచ్చిన ఫోన్లు రూ.2వేలు అంతకు లోపే వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ఫోన్లు ఏవో, వాటిలో ఏమేం ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..!

ఇంటెక్స్ ఆక్వా జీ2 - 2.8 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్, 256 ఎంబీ ర్యామ్, కార్టెక్స్ ఎ53 సింగిల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ సిమ్, 2జీ, వైఫై, బ్లూటూత్ 2.1, 1100 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.1949.

జెన్ అల్ట్రాఫోన్ 109 - 3.5 ఇంచెస్ డిస్‌ప్లే, 1 గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2, 0.3 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్, డ్యుయల్ సిమ్, 2జీ, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై. ధర రూ.1781.
budget-2000-phones
కార్బన్ ఎ108 - 3.5 ఇంచ్ డిస్‌ప్లే, 1 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2, 0.3 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్, డ్యుయల్ సిమ్, 2జీ, 1300 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.1960.

పానాసోనిక్ లవ్ టి35 - 4 ఇంచ్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2, 0.3 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, డ్యుయల్ సిమ్, 3జీ, వైఫై, 1400 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.2వేలు.
budget-2000-phones
జోష్ నెస్ట్ - 4 ఇంచెస్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్, 3.2, 1.3 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, డ్యుయల్ సిమ్, 3జీ, వైఫై, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.1999.

2304

More News

మరిన్ని వార్తలు...