రూ.12,999కే బ్లౌపుంక్ట్ ఆండ్రాయిడ్ టీవీ..!


Tue,September 11, 2018 06:57 PM

జర్మనీకి చెందిన బ్లౌపుంక్ట్ కంపెనీ భారత టీవీ మార్కెట్‌లోకి ఇవాళ ప్రవేశించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ పలు స్మార్ట్‌టీవీలను ఇవాళ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ టీవీలన్నింటిలోనూ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. రూ.12,999 మొదలుకొని రూ.47,999 గరిష్ట ధర వరకు ఈ టీవీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఎక్స్‌టర్నల్ సౌండ్ బార్‌తో కలిపి మరో రూ.4వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టీవీలను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. 32, 43, 50, 49, 55 ఇంచుల మోడల్స్‌లో బ్లౌపుంక్ట్ టీవీలు విడుదలయ్యాయి.

7966

More News

VIRAL NEWS