అసుస్ నుంచి త్వరలో 'పాకెట్ కంప్యూటర్'...


Wed,December 16, 2015 06:21 PM

అసుస్ సంస్థ 'క్రోమ్ బిట్' పేరిట ఓ నూతన పాకెట్ కంప్యూటర్‌ను రానున్న నూతన సంవత్సరంలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఈ డివైస్‌ను ఇప్పటికే పలు దేశాల్లో విడుదల చేయగా భారత్‌లో 2016 జనవరిలో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ కంప్యూటర్ గూగుల్‌కు చెందిన 'క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్' ఆధారంగా పనిచేస్తుంది.

యూఎస్‌బీ డ్రైవ్ సైజ్‌లో ఉండే ఈ పాకెట్ కంప్యూటర్‌ని ఏదైనా మానిటర్ లేదా టీవీ వంటి వాటికి కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. దీంతోపాటు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఎడిటింగ్, పాటలు వినడం, వీడియోలు చూడడం వంటి పనులు కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమోరీ, యూఎస్‌బీ 2.0 పోర్ట్, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.7,999.

12976
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS