లీకైన యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు..?


Mon,September 10, 2018 04:07 PM

ఈ నెల 12వ తేదీన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఎల్లుండి భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇదే ఈవెంట్‌లో యాపిల్ తన నూతన ఉత్పత్తులను విడుదల చేయనుంది. అయితే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు ప్రస్తుతం లీకయ్యాయి.

యాపిల్ తన గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌లో మూడు ఐఫోన్లను విడుదల చేయవచ్చని తెలిసింది. ఐఫోన్ 10ఎస్, 10ఎస్ ప్లస్, 10సి ఫోన్లను విడుదల చేయవచ్చని సమాచారం. ఐఫోన్ 10సి ఫోన్ ప్రారంభ ధర రూ.61వేలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే 10ఎస్ ప్రారంభ ధర రూ.77వేలు, 10ఎస్ ప్లస్ ప్రారంభ ధర రూ.88వేలుగా ఉండనుందని తెలిసింది. ఇక ఈ మూడు ఫోన్లు 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్నాయని సమాచారం. అదేవిధంగా ఐఫోఎన్ 10ఎస్, 10ఎస్ ప్లస్ ఫోన్లకు గాను 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను విడుదల చేయవచ్చని తెలిసింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇంటర్నెట్‌లో వస్తున్న ఊహాగానాలే. వీటిలో నిజం ఎంతో తెలియాలంటే.. మరికొద్ది గంటలు ఆగక తప్పదు..!

3920

More News

VIRAL NEWS