ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానున్న ఐఓఎస్ 11


Wed,September 13, 2017 03:03 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న నూత‌న మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఐఓఎస్ 11ను ఇది వ‌రకే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ కొత్త ఓఎస్ ఈ నెల 19వ తేదీ నుంచి ప‌లు ఐఓఎస్ డివైస్‌ల‌కు అందుబాటులోకి రానుంది. కాలిఫోర్నియాలో తాజాగా జ‌రిగిన ఈవెంట్‌లో యాపిల్ ప్ర‌తినిధుల ఐఓఎస్ 11 ల‌భ్య‌మ‌య్యే తేదీని అనౌన్స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను ఐఫోన్‌, ఐప్యాడ్ యూజ‌ర్లు ఈ నెల 19వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 5ఎస్ ఆ త‌రువాత వ‌చ్చిన ఐఫోన్ల‌కు, అన్ని ఐప్యాడ్ ఎయిర్‌, ఐప్యాడ్ ప్రొ మోడ‌ల్ ట్యాబ్లెట్ పీసీల‌కు, 5వ జ‌న‌రేషన్ ఐప్యాడ్‌కు, ఐప్యాడ్ మినీ 2 ఆ త‌రువాత వ‌చ్చిన డివైస్‌ల‌కు, ఐపాడ్ ట‌చ్ 6వ జ‌న‌రేష‌న్ డివైస్‌ల‌కు ఐఓఎస్ 11 అప్‌డేట్ ల‌భిస్తుంది.

1882

More News

VIRAL NEWS