1 కోటి 40 లక్షల ఏళ్లుగా 'గడ్డ కట్టే' ఉంది..!


Thu,December 17, 2015 02:47 PM

భూమికి దక్షిణాన ఉన్న ఖండం 'అంటార్కిటికా'. ఇది దక్షిణార్థ గోళంలో ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల తరువాత ఇదే పెద్ద ఖండం. ఇది 98 శాతం వరకు మంచుతో కప్పబడి ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా కూడా పేరుగాంచింది. అయితే ఇక్కడి మంచు ఎన్ని ఏళ్లుగా గడ్డ కట్టి ఉందో మీరు చెప్పగలరా? అవును, దాదాపు 1 కోటి 40 లక్షల ఏళ్లుగా ఈ ఖండంలోని మంచు గడ్డ కట్టే ఉంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా తెలుసుకున్నారు.

ఈస్ట్ అంటార్కిటికా ఐస్ షీట్ (ఈఏఐఎస్) ప్రాంతాన్ని పలు అధునాతన సాంకేతిక పద్ధతులతో విశ్లేషించిన అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన సైంటిస్టులు అంటార్కిటికా మంచు 14 మిలియన్ సంవత్సరాలుగా గడ్డ కట్టి ఉందని గుర్తించారు. ఆదిమ మానవ కాలం నాటి ప్లియోసెన్ సమయంలోనూ ఈ మంచు ఏమాత్రం కరగలేదని తెలిపారు. అదేవిధంగా ఈ అధునాతన పద్ధతులతో 14 మిలియన్ల నుంచి 17.5 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఉన్నప్పటి పరిస్థితులను కూడా విశ్లేషించవచ్చని తెలియజేస్తున్నారు.

కాగా ఈ విషయం తెలుసుకున్న మరికొందరు సైంటిస్టులు మాత్రం ఇందులో కొంత మార్పు చేసి చెబుతున్నారు. అదేమిటంటే ప్లియోసెన్ సమయంలో అంటార్కిటికాలోని కొంత మంచు కరిగిందని, కానీ మిగతా మంచంతా 14 మిలియన్ల సంవత్సరాలుగా గడ్డకట్టే ఉందని అంటున్నారు.

13372
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS