0.3 శాతం డివైస్‌లలో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ 8.0 ఓరియో


Tue,November 14, 2017 03:51 PM

ఆండ్రాయిడ్ నూతన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఈ మధ్యే విడుదలైన విషయం విదితమే. కాగా ఈ ఓఎస్ ఇప్పుడు కేవలం కొన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లలో మాత్రమే లభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లలో 0.3 శాతం వాటిలో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ప్రస్తుతం రన్ అవుతున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక దీని ముందు ఓఎస్ అయిన ఆండ్రాయిడ్ నూగట్ మొత్తం డివైస్‌లలో 17.6 శాతం వాటిలో రన్ అవుతున్నది. మొత్తం ఆండ్రాయిడ్ డివైస్‌లలో 30.9 శాతం వాటిలో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో రన్ అవుతుండగా, లాలిపాప్ 27.2 డివైస్‌లలో, కిట్‌క్యాట్ 13.8 శాతం డివైస్‌లలో, జెల్లీ బీన్ 6.2 శాతం వాటిలో, ఐస్ క్రీం శాండ్ విచ్ ఓఎస్ 0.5 శాతం డివైస్‌లలో రన్ అవుతున్నట్టు గూగుల్ తెలిపింది.

1025

More News

VIRAL NEWS