అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!


Mon,June 19, 2017 03:48 PM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇవాళ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ రాయితీలను అందిస్తోంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ప్రధానంగా లెనోవో జడ్2 ప్లస్, మోటో ఎక్స్ ఫోర్స్, వన్ ప్లస్ 3, ఐఫోన్ 7, హానర్ 6ఎక్స్, మోటో ఎక్స్ ఫోర్స్ తదితర ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది.

యాపిల్ ఐఫోన్ 7 (32జీబీ) రూ.17వేల తగ్గింపుతో రూ.42,999కు లభిస్తున్నది. ఎల్‌జీ జీ6 రూ.39,990 ధరకు, ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.16వేల తగ్గింపుతో రూ.33,999 ధరకు, మోటో జడ్ రూ.5వేల తగ్గింపుతో రూ.29,999 ధరకు లభిస్తున్నది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ సీ7 ప్రొ రూ.25,990, వన్ ప్లస్ 3 (సాఫ్ట్ గోల్డ్ 64జీబీ) రూ.26,999, మోటో ఎక్స్ ఫోర్స్ (64జీబీ) రూ.15,999, లెనోవో ఫ్యాబ్ 2 ప్లస్ రూ.12,999, మోటో ఎక్స్ ఫోర్స్ (32 జీబీ) రూ.12,999, శాంసంగ్ గెలాక్సీ ఆన్8 రూ.12,490, లెనోవో జడ్2 ప్లస్ (64 జీబీ) రూ.10,999, హానర్ 6ఎక్స్ (32 జీబీ) రూ.10,999, లెనోవో జడ్2 ప్లస్ (32 జీబీ) రూ.9,999 ధరలకు లభిస్తున్నాయి. ఇక మొబైల్ యాక్ససరీలపై 79 శాతం వరకు రాయితీని అందిస్తున్నది.

6595

More News

VIRAL NEWS