వాట్సాప్‌కు పోటీగా వస్తున్న కొత్త యాప్.. ఏంటో తెలుసా..?


Mon,July 17, 2017 04:26 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్‌కు పోటీగా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఓ నూతన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఈ యాప్‌ను Anytime పేరిట విడుదల చేస్తున్నట్టు సమాచారం. కాగా వాట్సాప్‌లోలాగే ఇందులో కూడా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్, ఫొటోలు, వీడియోల షేరింగ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు వంటి ఫీచర్లు ఉండనున్నట్టు తెలిసింది.

అమెజాన్ నూతనంగా అందుబాటులోకి తేనున్న ఎనీటైం యాప్ ద్వారా కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఫీచర్లే కాదు, ఇతర సేవలను ఉపయోగించుకోవచ్చు. అవసరం అనుకుంటే చాటింగ్ యాప్ నుంచే ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చు. ఆర్డర్లు ఇవ్వవచ్చు. టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని తెలిసింది. ప్రస్తుతం అమెజాన్ ఈ యాప్‌ను అంతర్గతంగా టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

కాగా ఈ యాప్ విష‌య‌మై కొందరు యూజర్లను ఇప్పటికే అమెజాన్ సర్వే చేసిందట. కొత్తగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాడితే అందులో ఏమేం ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు..? అన్న విధానంలో ఆ సర్వేలో ప్రశ్నలను అడిగినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగానే అమెజాన్ తన ఎనీటైం యాప్‌ను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ఇక ఈ యాప్ గురించి మనకు తెలిసింది లీకైన సమాచారమే. అమెజాన్ త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ రావచ్చని తెలిసింది.

6802

More News

VIRAL NEWS

Featured Articles