ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కస్టమర్లకు మరో 3 కొత్త ప్లాన్లు..!


Tue,November 14, 2017 04:44 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 3 కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.3,999, రూ.1,999, రూ.999 పేరిట ఈ ప్లాన్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. రూ.3,999 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే యూజర్లకు 360 రోజుల వాలిడిటీతో కూడిన 300జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి తోడు అన్ని రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

ఇక రూ.1,999 ప్లాన్‌తో కస్టమర్లకు 125 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. అదేవిధంగా రూ.999 ప్లాన్ రీచార్జి చేసుకుంటే యూజర్లకు 60 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. కాగా జియోలో కూడా రూ.999, రూ.1,999 ప్లాన్లకు ఇదే తరహా బెనిఫిట్స్ లభిస్తుండడం విశేషం. కాకపోతే అందులో రూ.3,999 ప్లాన్ లేదు. దానికి బదులుగా రూ.4,999 ప్లాన్ ఉంది. అందులో 350 జీబీ డేటా వస్తుంది. దాని వాలిడిటీ కూడా 360 రోజులు కావడం విశేషం.

5527

More News

VIRAL NEWS