ఎయిర్‌టెల్ ఆఫర్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్


Fri,January 12, 2018 02:17 PM

ఎయిర్‌టెల్ తమ పోస్ట్ పెయిడ్, వీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే దీని కోసం కస్టమర్లు ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇది కొంత మంది యూజర్లకే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు అందరు అర్హత కలిగిన యూజర్లకు అందిస్తున్నది. జూన్ వరకు తమ ఎయిర్‌టెల్ టీవీ యాప్ ఫ్రీ అని ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ఆఫర్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నది. అయితే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌లో 499, ఆపైన మైఇన్ఫినిటీ ప్లాన్స్..అటు వీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో వెయ్యికిపైగా ప్లాన్స్ ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్రీ డెలివరీ, ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్, అమెజాన్‌లో డీల్స్‌కు మిగతా కస్టమర్ల కంటే ముందుగా యాక్సెస్ ఇస్తారన్న విషయం తెలిసిందే.

ప్రైమ్ మెంబర్‌షిప్ లేని అమెజాన్ యూజర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్నవాళ్లు దాని కాల పరిమితి అయిపోయిన తర్వాత ఈ ఆఫర్‌కు మారవచ్చు. ప్లేస్టోర్ నుంచి ఎయిర్‌టెల్ టీవీని డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మరో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ యాక్టివ్ నౌ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ అమెజాన్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి. మీ వివరాలు వెరిఫై అయిన తర్వాత మీ 365 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మొదలైనట్లే. ఆఫర్ వర్తించాలంటే ఎయిర్‌టెల్ చెప్పినట్లు రూ.499 ప్లాన్‌లోనో లేదా అంతకన్నా పెద్ద ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అయితేనే ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. ఆ ప్లాన్ కన్నా తక్కువ ప్లాన్‌కు మారితే.. సబ్‌స్క్రిప్షన్ ఆటోమెటిగ్గా రద్దవుతుంది.

3160

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles