మ‌రో అతి పెద్ద వైర‌స్ 'ఆదిల్‌కుజ్' వ‌స్తున్న‌ద‌ట‌..?


Thu,May 18, 2017 05:02 PM

వన్నాక్రై దెబ్బ‌కు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎలా వ‌ణికిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో కోట్ల కంప్యూట‌ర్ల‌కు ఆ వైర‌స్ సోకింది. ఎంతో ఆస్తి న‌ష్టం కూడా సంభ‌వించింది. దీన్ని ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అతి పెద్ద సైబ‌ర్ దాడుల్లో పెద్ద‌దిగా నిపుణులు తేల్చి చెప్పేశారు. అయితే తాజాగా మ‌రో విషయం తెలిసింది. అదేమిటంటే... త్వ‌ర‌లో వ‌న్నాక్రై ని మించిన మ‌రో వైర‌స్ అటాక్ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. అమెరికాలోని ప్రూఫ్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ప్రూఫ్ పాయింట్ సంస్థ‌కు చెందిన వైస్ ప్రెసిడెంట్ రాబ‌ర్ట్ హోమ్స్ మాట్లాడుతూ.. త్వ‌ర‌లో వ‌న్నాక్రైని మించిన మ‌రో వైర‌స్ అటాక్ జ‌ర‌గ‌నుంద‌ని హెచ్చ‌రించారు. అయితే అది ఎప్పుడు అటాక్ అవుతుందో చెప్ప‌లేమ‌ని అన్నారు. బిట్‌కాయిన్ క్రిప్టోక‌రెన్సీ మైన‌ర్ అయిన 'Adylkuzz (ఆదిల్‌కుజ్‌)' అనే యూజ‌ర్ ఈ వైర‌స్‌ను సృష్టించిన‌ట్టు తెలిసింద‌ని అన్నారు. అందుకే ఈ వైర‌స్‌ను ఆదిల్‌కుజ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని తెలిపారు. ఈ వైర‌స్ వ‌న్నాక్రై లా ఉండ‌ద‌ట‌. కానీ యూజ‌ర్ కంప్యూట‌ర్‌లోకి చొర‌బ‌డి హ్యాక‌ర్ల కోసం బిట్‌కాయిన్ల‌ను జ‌న‌రేట్ చేస్తుంద‌ట‌.

bitcoins-to-hackers

అయితే ఆదిల్‌కుజ్ వైర‌స్ కంప్యూట‌ర్‌లోకి చొర‌బ‌డిన‌ట్టు యూజ‌ర్‌కు కూడా తెలియ‌ద‌ని రాబ‌ర్ట్ హోమ్స్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కంప్యూట‌ర్ కొంత నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంద‌ని, కానీ ఆ తేడాను సాధార‌ణ పీసీ యూజ‌ర్ గుర్తించ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు. ఒక వేళ ఈ వైర‌స్ గ‌న‌క అటాక్ అయితే అప్పుడు దాన్ని గుర్తించి తొల‌గించ‌డం చాలా క‌ష్ట‌మేన‌ని అన్నారు. ఈ వైర‌స్ కంప్యూట‌ర్‌లో ప్రాసెస‌ర్‌, ఇత‌ర హార్డ్‌వేర్‌ను ఎక్కువ‌గా వినియోగించుకుని హ్యాకర్ల‌కు బిట్‌కాయిన్ల‌ను జ‌న‌రేట్ చేస్తుంద‌ని తెలిపారు. దీనిపై ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తే వైర‌స్ అటాక్‌ను సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థలు విజ‌య‌వంతంగా తిప్పికొట్ట‌వ‌చ్చ‌ని అన్నారు.

2415

More News

VIRAL NEWS