'ఒక్క కెమెరా' కోసం '800 మంది'..!


Mon,December 21, 2015 03:14 PM

'యాపిల్‌'కు చెందిన ఉత్పత్తులంటే ముందుగా గుర్తుకు వచ్చేవి 'ఐఫోన్లు'. అయితే ఈ ఫోన్లలో అధిక శాతం మంది ఉపయోగిస్తున్నది ఏంటో తెలుసా? అదే 'కెమెరా'. అవును, స్వయంగా 'యాపిలే' ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం పేరుకే కాదు, నిజంగా ఐఫోన్‌లోని కెమెరానే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డివైస్‌లలో ఉత్తమమైందని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే ఈ కెమెరా అంత అద్భుతంగా పనిచేయడానికి అసలు కారణం ఏంటో తెలుసా? '800 మంది' ఇంజినీర్లు!

మీరు విన్నది నిజమే, ఐఫోన్ కెమెరా పనితీరును ఎప్పటికప్పుడు మెరుగు పరిచేందుకు దాని కోసం ఏకంగా '800 మంది హార్డ్‌వేర్ ఇంజినీర్లు' పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో యాపిల్ ప్రతినిధులు స్వయంగా వెల్లడించారు. యూజర్లకు అత్యంత నాణ్యమైన కెమెరా పనితనాన్ని అందించడమే లక్ష్యంగా తమ ఇంజనీర్ల బృందం పనిచేస్తుందని వారు చెబుతున్నారు. కాగా ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన 'ఐఫోన్ 6' మోడల్స్‌లో '4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్' కలిగిన ఫొటోలు, వీడియోలను తీసుకునేందుకు వీలు కల్పించారు. ఇందు కోసం ఆయా కెమెరా మోడల్స్‌లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు.

13165
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS