ఉద్యానపంటల్లో చేపట్టాల్సిన పనులు

Thu,January 3, 2019 01:00 AM

ఉద్యాన పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తయితే.. సరైన సమయంలో సేద్యం పనులు సమగ్రంగా చేయాలి. అప్పుడే రైతులు మంచి ఆదాయం పొందే అవకాశాలుంటాయి. ఉద్యాన పంటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు ఉద్యానశాఖ అధికారులు వివరించారు.
mango

మామిడి

తెల్లపూత సమయంలో తేనెమంచు పురుగు, తామర పురుగు, పూత చుట్టు పురుగుతో పాటు బూడిద తెగు లు కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని వెంటనే నివారించేందుకు తెల్లపూతకు హాని జరుగని మందులు మాత్రమే వాడాలి. అవి ఒక లీటరు నీటికి ఇమిడ్రాక్లోప్రిడ్ 0.3మి.లీ.+డైక్లోరోవాస్ 0.5మి.లీ.+సోఫ్ పొడి 1గ్రా. + ప్లానోఫిక్స్ 0.25 మి.లీ.లు కలిపి పిచికారీ చేయాలి.
-పదేళ్ల వయస్సు దాటిన చెట్టుకు కనీసం 8-10లీ. మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
-రాతి మంగు రాకుండా నల్లపూత దశలో 2మి.లీ.ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
జామ సెర్కోస్పారా ఆకుమచ్చ తెగులు వల్ల జామలో ముదు రు ఆకుల అడుగు భాగంలో గోధుమ రంగు మచ్చలు, పై భాగంలో పసుపు పచ్చ మచ్చలు ఏర్పడుతాయి. ఎక్కువగా ముదురు ఆకుల మీద ఈ తెగులు ఆశిస్తుం ది. ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ముడుచుకొని రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ మందు ను 2.5గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

పందిరి కూరగాయలు

అనప, దోస, కాకరలను జనవరి రెండో పక్షం నుంచి నాటుకోవచ్చు. గుమ్మడి, పొట్లను జనవరి చివరి వర కు నాటుకోవచ్చు. గుమ్మడి పెంకు పురుగుల పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఆకులను కొరికి తింటా యి. నివారణకు మలాథియాన్ 2మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
-ముఖ్యంగా పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5శాతం వేపగింజల కషాయాన్ని 15రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి.

lemon

బత్తాయి, నిమ్మ

ఈ మాసంలో లేత చిగుర్లపై ఆకు ముడుత పురుగులు ఆశిస్తాయి. ఈ ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి, ఆకులు ముడుతలు పడి, గజ్జి తెగులు ఎక్కువగా ఆశించి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా డైమిథోయేట్ 2మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ. లీటరు నీటిని కలిపి లేత చిగుర్ల దశలోనే 10రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

banana

అరటి

చలి వాతావరణం వల్ల ఆకుల ఈనెల వెంబడి తెల్లనిచారలు ప్రారంభమై ఆకులు పాలిపోయినట్లు కనబడుతా యి. ఆకుల అడుగుభాగాన ముదురు ఉదా రంగు మ చ్చలు ఏర్పడుతాయి. దీని నివారణకు ఒక్కొక్క మొక్క కు 10గ్రా. జింకు సల్ఫేట్ భూమిలో వేయాలి. ఆకులపై 2గ్రా. జింకు సల్ఫేట్‌ను లీటరు నీటికి చొప్పు న కలిపి పదిరోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేసుకోవాలి. పుచ్చ 2.5మీ. ఎడంతో, 60సె.మీ.వెడల్పు గల నీటి కాలువలు తయారుచేసుకొని, కాలువలకు ఇరువైపులా 30-50సె.మీ. ఎడంతో విత్తనాలు విత్తుకోవాలి.

goruchikkudu

గోరు చిక్కుడు

వేసవి పంటను జనవరిలో రెండవ పక్షం నుంచి నాటుకోవచ్చు.

మునగ

కాయ తొలుచు ఈగ పూత దశలో ఆశించి, పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. నివారణకు, పూత దశలో, లీట రు నీటికి ఫాసలోన్ 2మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో 1మి.లీ. డైక్లోరోవాస్‌ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

chikkudu

చిక్కుడు

వేసమి చిక్కుడును ఈ మాసంలో విత్తుకోవచ్చు. ఎకరాకు తీగ రకాలకు 1కిలో, పొద రకాలకు 12-16 కిలోల విత్తనం విత్తుకోవాలి. విత్తనాన్ని థైరమ్ 3గ్రా. కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా వేరుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు.

మిరప

ఈ మాసంలో పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన, లేత కొమ్మల నుంచి రసాన్ని పీల్చటం వల్ల మొక్కలు గిడసబారుతాయి. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయామిథాక్సామ్ 0.5గ్రా. లేదా అసిటామిప్రిడ్ 0.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బెండ

బెండ పంటను జనవరి రెండవ పక్షం నుంచి విత్తుకోవచ్చు. ఒక ఎకరాకు 100 కిలోల చొప్పున వేప పిండి ని దుక్కిలో వేసుకోవాలి.

ఉసిరి

కాయలపై గోధుమ వర్ణం మచ్చలు ఏర్పడుతాయి. దీన్ని తుప్పు తెగులు అంటారు. కాయలు కోతకు ముందే రాలిపోతాయి. నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా.లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

boppai

బొప్పాయి

బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులపైన, కాడలపైన, తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగుదల కనిపిస్తుంది. నివారణకు 1మి.లీ. డినోకాప్ లేదా 1మి.లీ. కెరాథేన్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

వంకాయ

వేసవి పంట నారు కోసం జనవరి రెండవ పక్షం నుంచి విత్తనంను నారుమడిలో విత్తుకోవచ్చు.

టమాటా

వేసవి పంటను ఈ మాసం నుంచి నా టుకోవచ్చు. 21-25రోజుల వయస్సు ఉండి, 3-4 ఆకులు గల మొక్కలను 45X 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30రోజులు మించిన ముదురు నారు నాటరాదు.

అల్లం

సాధారణంగా అల్లం దుంపలు ఈ మాసంలో తవ్వకానికి వస్తాయి, ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం, కాండం ఎండిపోవడాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లు గుర్తించి తవ్వుకోవచ్చు.
kakara
- గుండెల రాజు,72889 85757
మహబూబాబాద్

ఈ దశ కీలకం

ఉద్యాన పంటలకు ఈ దశ ఎంతో కీలకం. సరైన సమాయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేయడం ఉపయోగం. పెట్టుబడి తగ్గడమే కాకుండా ఆశించిన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
surya-narayana
జిల్లా ఉద్యానశాఖ అధికారి
మహబూబాబాద్, 79977 25108

1377
Tags

More News