ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్‌లు

Thu,August 16, 2018 12:48 AM

-తెగుళ్ళ నివారణ జీవ శిలీంధ్ర నాశినులు
దేశ ఆహార రంగం సంతృప్తికరమైన సుస్థిర దిగుబడులను సాధించడంలో ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనవి బూజు తెగుళ్ళు. ఇవి పంటలపై సోకడం ఫలితంగా సుమారుగా 20 శాతం వరకు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ బూజు తెగుళ్ళను తగ్గించడంలో టైకోడెర్మా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కాబట్టి వివిధ పంటలను సాగు చేసే రైతులు టైకోడెర్మాను ఉపయోగించి బూజు తెగుళ్ళను నివారించుకోవచ్చునని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి సూచిస్తున్నారు. ట్రైకోడెర్మా హానికరమైన వేరు ఎండు, వేరుకుళ్ళు తెగుళ్ళను కలిగించే శిలీంధ్రాల కణాలను నిర్జీవం చేసే ఆంటీబయోటిక్స్‌ను ఉత్పత్తి చేసి బూజు తెగుళ్ళను నాశ నం చేస్తుందని వివరించారు. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్‌లను గురించి ఆయన తెలిపిన వివరాలు.. వీటికి సంబంధించిన అదనపు సమాచారం కోసం 9440481729 నెంబర్‌ను సంప్రదించవచ్చు.

RAITHUBADI

అవసరమైన అంశాలు

-చాలా బాగా పనిచేయు రకాన్ని ఎంపిక చేసుకుని ఉత్పత్తి చేయాలి. ఈ రకం వేగంగా అభివృద్ధి చెంది ఎక్కువరోజులు భూమిలో నివాసం ఉండి పెరుగుతూ బాగా భూమి పొరల్లోకి చొచ్చుకుని పోతుండాలి. చాలారకాల వ్యాధికారక (ఫంగస్) బూజు తెగుళ్ల వంటి వాటిని నివారించగలుగాలి.
-ఖర్చు తక్కువలో ఉత్పత్తి, తయారీచేసే విధానం కలిగి ఉండాలి. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ బూజు రకం ఎక్కువగా, త్వరగా పెరుగుతూ ఎక్కువ కాలం జీవించేదై ఉండి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగి ఉండాలి.
-ట్రైకోడెర్మా విరిడిని మొక్కలకు వ్యాధి రాక ముందే నిరోధకంగా వాడాలి. ఎందుకంటే వ్యాధికారక జీవులు వేర్లలో ప్రవేశించిన తర్వాత వేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉండదు.

వాడే విధానం

-భూమిలో కల్చర్ చేసి వేయాలి, విత్తనశుద్ధి చేయాలి. మొక్కల సాళ్ళలో వేయా లి, మొక్కల వేర్లను ముంచి నాటడం మొదలగున్నవి.
-దీన్ని భూమిలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి రోగ నిరోధక కణాలను ఉత్పత్తి చేసి విత్తనాల పైపొర మాదిరిగా ఏర్పడి కవచం వలే ఉండి హానికరమైన శిలీంధ్రం నుంచి మొక్కలను రక్షిస్తుంది.
-నిర్ధారించిన తెగుళ్ళు ఉదాహరణ కాయకుళ్ళు, మొదలు కుళ్ళు, మాగుడు తెగు ళ్ళు, వేరుకుళ్ళు, ఎండతెగుళ్ళు, పసుపుకొమ్ము కుళ్ళు అరికడుతుంది.
-వివిధ పంటల్లో శనగ, వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు, చెరు కు, పసుపు, గోధుమ, వరి, ఆవాలు, ఉల్లి, అరటి, టమాటా, వంగ, మిరప, చీని, కాలీప్లవర్, పత్తి ఇతర పంటలపై దీన్ని వాడవచ్చు.
-విత్తనం విత్తే పంటల్లో విత్తనశుద్ధిగా ఒక కిలో విత్తనానికి పది గ్రాములు పొడి మందులో విత్తనశుద్ధి చేసి వెంటనే విత్తుకోవచ్చు.

భూమిలో చల్లే విధానం

-100 కిలోలు బాగా చివికిన మెత్తటి పశువుల ఎరువులో వరుసలు, వరుసలుగా నాలుగు కిలోల ట్రైకోడెర్మా విరిడి పొడి మందు కలిపి బెల్లం నీళ్ళు ప్రతి వరుసకు బెడ్డులాగా పాక్షికంగా నీడ ఉన్న ప్రదేశంలో వేసి గోనె సంచి కప్పి 7-15 రోజుల వరకు నీళ్ళు చిలకరిస్తూ తెల్లటి బూజు వచ్చిన తర్వాత బాగా కలుపుకుని ఒక ఎకరా భూమిలో తేమ ఉన్నప్పుడు చల్లాలి.
-ఉత్పత్తి చేసిన ఆరు మాసాల్లోపు వాడటం శ్రేయస్కరం.

సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్

-ఇది మిత్ర సంబంధ బాక్టీరియా. వ్యాధి నిరోధకారిణియే కాకుండా కాలుష్యరహి త వాతావరణానికి తోడ్పడుతుంది. ఇది ముఖ్యంగా భూమిలో వేర్లపైన, ఆకులపైన వచ్చు అనేక తెగుళ్ళను నివారించడమే కాకుండా మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది భూమి పొరల్లోనూ వాతావరణంలో కూడా పెరుగుతుంది.
-ఇది వరిలో వచ్చు అగ్గితెగుళ్ళను, పాము పొడ తెగుళ్ళను, ఎండుతెగుళ్ళను, నారుమళ్ళ తెగుళ్ళను అరికడుతుంది.
-పత్తి, పసుపు, మిరప, మినుము, పెసర, వేరుశనగ, కంది మొక్కలను పంటల పై వచ్చు ఎండాకు తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళను అరికడుతుంది.

వాడే విధానం

-విత్తనం విత్తే పంటలకు కిలో విత్తనానికి 10గ్రా. చొప్పున కలిపి పట్టించి విత్తాలి. నారు నాటే పంటలైనైట్లెతే నారును, దుంపలను సూడోమోనాస్ ద్రావణంలో ఒక రోజు నానబెట్టి ఆరబెట్టి విత్తుకోవాలి.
-రెండు లేదా మూడు కిలోల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 50 కిలోల చివికిన పశువుల ఎరువులలో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి.
-వరిపంటపై నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 500 గ్రాములు ఒక ఎకరా పంటపై పిచికారీ చేయాలి.
-నట్టె కోటేశ్వర్‌రావు గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,9989944944

573
Tags

More News