వరిలో సస్యరక్షణ

Wed,June 27, 2018 11:53 PM

Naru
-150 రోజుల పంట కాలం గల దీర్ఘకాలిక రకాలైన సాంబమషూరి, సిద్ది వంటి రకాలను జూన్ నెల చివరి వరకు నార్లు పోసుకోవచ్చు.
-మధ్యకాలిక రకాలు అనగా 135-140 రోజుల పంట కాలం గల జగిత్యాల మషూరి, కృష్ణ, పొలాస ప్రభ, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, హెచ్.టి.యం.సొన, విజేత వంటి రకాలు జూలై నెల 15 వరకు నార్లు పోసుకోవచ్చు.
-స్వల్పకాలిక రకాలైన (120-125 రోజులు) తెలంగాణ సోన, బతుకమ్మ, కూనారం సన్నాలు, జగిత్యాల సన్నాలు, అంజన, ఐ.ఆర్.64, యం.టి.యు 1010 వంటి రకాలు జూలై చివరి వరకు నార్లు పోసుకునే వీలున్నది.
-నారుమడిలో కాండం తొలిచే పురుగు నివారణకు 2 గుంటలకు 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు లేదా లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును పిచికారీ చేయాలి.
-ముందుగా నాట్లు పూర్తయిన నిజామాబాద్ జిల్లాలో అగ్గితెగులు, పాము పొడ తెగులు గమనించాం. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ తెగుళ్లకు కింద సూచించిన మందులను అవసరం మేరకు పిచికారీ చేయాలి.
-ప్రధాన పొలంలో సిఫార్సుకు మించి ఎరువులు వేయకూడదు. ప్రధాన పొలంలో అగ్గితెగులు నివారణకు ఎకరానికి 120 గ్రా. ట్రైసైక్లజోల్ లేదా 300 మి.లీ. ఐసోప్రొథయోలిన్ లేదా 500 మి.లీ కాసుగామైసిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
-పాముపొడ తెగులు నివారణఖు ఎకరానికి 200 మి.లీ. ప్రొపికోనజోల్ లేదా 400 మి.లీ. హెక్సాకోనజోల్ లేదా 80 గ్రా. టెబుకోనజోల్+ట్రైప్లోక్సిస్ట్రోబిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆర్. జగదీశ్వర్
ప్రధాన శాస్త్రవేత్త (వరి)వరి పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ 8179540261

581
Tags

More News