కంది సాగులో మెళకువలు

Wed,June 6, 2018 10:42 PM

రాష్ట్ర ప్రభుత్వం అపరాల సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులు ముఖ్యంగా కంది సాగుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గి, కంది సాగులో నాణ్యమై న అధిక దిగుబడులు సాధించాలంటే శాస్త్రీయ మెళకువలు పాటించాలి.
Kandi-chenu
-నిల్వ నీరు, మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఎర్రరేగడి నేలలు లేదా ఎర్ర నేలల్లోనే కంది సాగు చేపట్టాలి.
-ఆ నేలలో ప్రతిసారి కంది పంట కాకుండా, మక్కజొన్న లేదా జొన్న పంటతో పంట మార్పిడి చేయాలి. దీంతో కాయతొలిచే పురు గు, ప్యూజేరియం ఎండు తెగులు ఉధృతి తగ్గుతుంది. ఎండు తెగులు తట్టుకునే రకాలు, స్టెరిలిటీ మొజాయిక్ తట్టుకునే రకాలు సాగు చేయడం మంచిది.
-సకాలంలో నాణ్యమైన విత్తనం, సిఫార్సు దూరంలో విత్తుకోవాలి.
-మినుము, పెసర, నువ్వులు, సోయా చిక్కుడు, జొన్నల్లో పంటను ఎంచుకుని అంతర పంటలుగా సాగు చేయాలి.
-తక్కువ కాలంలో పంట పూర్తయ్యే రకాలు కాయ తొలిచే పురుగు తాకిడి నుంచి తప్పించుకుంటాయి.
-అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తప్పకుం డా ఎండు తెగులు తట్టుకునే రకాలనే సాగు చేయాలి.
-కిలో గ్రాము విత్తనాలకు 2.5 మి. గ్రా కార్బండింజం లేదా 3 గ్రాముల థైరమ్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడేతో విత్తనశుద్ధి చేస్తే, మొదటి మూడు నెలల కాలంలో తెగుళ్లు ముఖ్యంగా విత్తనం నుంచి వ్యాపించే తెగుళ్లవ్యాప్తి తగ్గుతుంది.
-కంది చుట్టూ నాలుగు వరుసల జొన్న సాగు చేస్తే కాయతొలిచే పురుగుల ఉధృతి తగ్గించవచ్చు.
-ఎక్కువ ఆకులు ఉంటాయి. కాబట్టి పురుగు మందు పంట మొక్క మొత్తం అందటానికి పవర్ స్ప్రేయర్ లేదా అధిక పీడన పిచికారీ యంత్రాలు వాడాలి.
-అధిక వర్షపాతం ఉన్న నేలలు, ఎక్కువ ఎత్తుపెరిగిన కంది మొక్కలలో చివర్లు తుంచటం లేదా చివర్లలో ఉన్న కొన్ని ఆకులు తొలిగించా లి. మొక్క మొలకెత్తిన 90 నుంచి 100 రోజుల లోపు మొక్కపై నుంచి 10 నుంచి 12 ఇంచుల మేర ఆకులు తీసివేయాలి.
-ఎకరాకు నాలుగు చొప్పున ఫిరమోన్ లింగాకర్షక బుట్టలు, 20 పక్షి స్థావరాల ఏర్పాటు చేసి, కాయతొలిచే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
-వారం వ్యవధిలో హెక్టారుకు 65 వేల ట్రైకోగ్రా మ గుడ్లపరాన్న జీవులను విడుదల చేయాలి.
-కందిరీగలు, అక్షింతల పురుగులు, సాలీడులు పుష్కలంగా ఉంటే పచ్చపురుగు ఉధృతి తగ్గుతుంది.
-50 శాతం పంట పూతదశలో వేప గింజల కషాయం 5 శాతం పిచికారీ చేస్తే పచ్చపురుగు గుడ్లు నిర్వీర్యమవుతాయి.
-పంట పూత దశ, కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
-వర్షాధార పంటలో నేల, తేమ సంరక్షణ పద్ధతులు పాటించాలి.
-వర్షాధార ప్రాంతాల్లో, నీటి ఎద్దడి ఉన్నప్పుడు దిగుబడులు పెరుగడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియా కలిపి తయారుచేసిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

Kandi-chenu2

కంది సాగులో చేయకూడనివి

-ఎట్టి పరిస్థితుల్లో క్షార నేలల్లోకంది సాగు చేయరాదు.
-మురుగు నీటి పారుదల లేని నేలలు వీటి సాగుకు పనికిరావు.
-ఆగస్టు15 తర్వాత కంది సాగు చేయరాదు. ఆలస్యంగా విత్తుకోరాదు.
-అధిక సాగు కాలం ఉండే పంటలు, పోషకాల కోసం పోటీపడే పంటలను కందిలో అంతర పంటలుగా వేసుకోరాదు.
-రసాయన ఎరువులతో జీవన ఎరువులు రైజోబియం, జీవ శిలీంధ్ర నాశకాలు ట్రైకోడెర్మో విరిడిలను కలుపరాదు.
-పాక్షిక మొత్తంలో ఎరువులు, పురుగు మందు లు వాడటం, సింథటిక్ పైరిత్రాయిడ్స్ వాడ టం మేలు కాదు.
-ఎండు తెగులు ఉధృతి ఉన్న నేలలో తట్టుకునే రకాలను సాగు చేయరాదు.
-నేలలో తగినంత తేమ లేనప్పుడు ఆకులు తుంచటం, చివర్ల తొలిగింపు చేపట్టరాదు.


dr-amarapalli-geetha

914
Tags

More News