ఆహ్లాదాన్నిచ్చే ‘పీస్ లిల్లీ’

Wed,June 6, 2018 10:37 PM

ప్రశాంతతకు, శుద్ధతకు నిలిచే లిల్లీ మొక్కలను ఇంట్లో పెంచుకునేందుకు ఎక్కువమంది ఇష్టపడుతారు. ఇండ్లలో, కార్యాలయాల్లో నేరుగా సూర్యరశ్మి పడకుండా మెరుగ్గా పెరుగుతుంది పీస్ లిల్లీ. ప్రత్యేకమైన ఆకర్షణ, అందంతో గదులలో ఆహ్లాదంగా ఉంటాయి. ప్రపంచంలో పది ప్రధాన గాలిశుద్ధి మొక్కల్లో మొదటిది.
lilly-flower
స్సాథిఫిల్లమ్ అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క పీస్ లిల్లీ. దీంట్లో అనేక రకాలున్నాయి. అన్ని కూడా చిన్నగా ఎదిగి గరిష్ఠం గా ఎనిమిది అడుగులుంటాయి.
యాజమాన్యం: కిటికీలకు కొన్ని అడుగుల దూరంలో పెడితే తక్కు వ సూర్యకాంతి పడుతుంది. కుండీల్లో పలుచగా, విడిగా ఉన్నమట్టితో తయారుచేసిన మిశ్రమంలో మొక్కలు నాటుకోవాలి. ఎండిపోయిన, చనిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తొలిగించా లి. వారానికోసారి తడి ఉండేలా నీటినివ్వాలి. నీటి తడికి ముందు కొంచెం వాడనివ్వాలి. వారానికోసారి సాధారణ ద్రవ ఎరువుతో పాదులో పోయాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న మట్టి మాధ్యమంలో బాగా పెరుగుతుంది. కాండం చివర ముక్కల నుంచి కొత్త పింకలు తయారుచేసుకొని కొత్తగా నాటుకోవచ్చు.

lilly-flower2
ఫ్లోరోసెంట్ లైట్ కింద సైతం వస్తుంది. ఎక్కువ గాలిలో ఆర్ధ్రత ఉంటే మేలు. దీనికోసం తడిపిన మట్టి ముద్ద ఉంచి తే మంచిది. గది ఉష్ణోగ్రత వద్ద మొక్క బాగా పెరుగుతుంది. 65-80 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. అయితే పీస్ లిల్లీ లో ఉండే ఒక రసాయనం మూతిని చికాకు పరుస్తుంది. కాబట్టి చిన్నపిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా మొక్కలు ఉండాలి.
suram-sindhuja

2300
Tags

More News