సాగుకు సన్నద్ధం ఇలా

Wed,May 30, 2018 11:30 PM

నాలుగు రోజుల కిందట కేరళలోని తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల మీదుగా రాష్ట్రమంతటా విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీన్నిబట్టి ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవనున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యేకించి రాష్ట్రంలో ఈ సంవత్సరం సాగుకు రెండు అంశాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మొదటిది సాధారణ వర్షపాతం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేల రూపాయల నగదు అందించింది. దీంతో ఈ వానకాలం సాగు నూతనోత్సాహంతో సాగనున్నది. రాష్ట్రంలో 86 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వారి తక్కువ పెట్టుబడి సామర్థ్యంతో గడిచిన సంవత్సరాలన్నీ సాగులో మద్దతు ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది పెట్టుబడి సాయంతో ఇప్పటికే రైతుల చేతిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అవసరం మేరకు ముందుగానే కొనుగోలు చేసి, సాగుకు సిద్ధమయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
agriculture-crop
గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల కబంధహస్తాల నుంచి విముక్తి అయి, సాగు స్వేచ్ఛగా సాగబోతున్నది. కాబట్టి ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. దీంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు మార్కెట్‌లో డిమాండు ఎక్కువగానే ఉన్నది. అయితే ఎప్పటికైనా సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటేనే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుం ది. కాబట్టి ప్రతి రైతు ప్రభుత్వ పెట్టుబడి మద్దతు అవసరం మేరకే ఉత్పత్తికారకాల కొనుగోలు కోసం వాడా లి. తమ ప్రాంతానికి సిఫార్సు చేసిన పంటను నిర్ణయించిన రకాన్ని నిపుణుల సలహాల మేరకు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అదనులోపు విత్తనాలు వేసుకోవడం పూర్తిచేయాలి. దీంతో చీడపీడల ఉధృత్తి తగ్గుతుంది. పురుగు మందులపై ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అనధికారిక బోల్‌గార్డ్-3 పత్తి విత్తనాలు కలు పు మందులను తట్టుకునే HT ROUNDUP READY FLEX పత్తి విత్తనాలను రైతులు వాడకూడదు. తాత్కాలికంగా అది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ విచ్చలవిడిగా కలుపు మందు ను వాడ టం వల్ల మొండి కలుపు తయారై భవిష్యత్తులో కలుపు నివారణ అసాధ్యం అవుతుంది.

విత్తటానికి పది రోజుల ముందు పంటను బట్టి 10-100 విత్తనాలను మొలక కట్టి, మొలక శాతం పరీక్షించాలి. దాదాపు అన్ని పంటలలో 80 శాతం పైనే మొలక శాతం ఉంటుంది. అయితే కొన్ని కూరగాయ పంటలలోతక్కువ కూడా ఉన్నది. కూరగాయల పంటలు, వాణిజ్య పంటలలో హైబ్రిడ్లను కేవలం వర్షాధారంగా సాగు చేస్తే దిగుబడులు తగ్గిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పంట కాలనీలను గుర్తించింది. సమాచారం సేకరించి ఆయా ప్రాంతాలలో సిఫార్సు పంటను, రకాన్ని వాడితే దిగుబడులు పెరుగుతాయి.

విత్తన ఎంపిక

పంట సాగులో విత్తనాల ఎంపి క కీలకం. నాణ్యమైన విత్తనం తో దాదాపు 25 శాతం దిగుబడి సాధించవచ్చు. మిగతా ఉత్పత్తి కారకాలై న ఎరువులు, పురుగు మందులు, సాగు నీటి సామర్థ్యం విత్తనాల నాణ్యతపైనే ఆధారపడి ఉంటాయి. నేలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకోవాలి. స్థానికంగా ఎదురవుతున్న చీడ, పీడలను తట్టుకునే రకాలను సాగుకు వాడితే సస్యరక్షణ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో అయితే వరిలో గొట్టాలు తెగులును తట్టుకునే రకాలు, ఆముదంలో అయితే ఎండు తెగులు, కందిని నల్లరేగడి భూములలో సాగు చేసినప్పుడు ఎండు తెగులు తట్టుకునే రకాలే వాడాలి. అలాగే వర్షాధారంగా సాగు చేసేటప్పుడు స్వల్పకాలిక అపరాలను, నల్లరేగడిలో సాగు నీటి ఆధారంగా అయి తే మాత్రమే దీర్ఘకాలిక రకాలను సాగు చేయాలి.

agriculture-crop2

సకాలంలో విత్తటం

సిఫార్సు చేసిన సమయంలోనే విత్తనం పొలాల్లో నాటా లి. ఆలస్యమైతే చీడపీడల సమస్య పెరుగటంతో పాటు ఉత్పాదకత తగ్గిపోతుంది. ఒక్కొక్క పంటకు అనుకూల విత్తన తేదీ ఉంటుంది. నిర్దేశించిన, సిఫార్సు చేసిన మందులు, రసాయనాలతో విత్తనశుద్ధి చేయాలి. ప్రత్యేకించి తెగుళ్లు, రసం పీల్చే పురుగుల నుంచి విత్తిన ఒక నెల కాలం పాటు కాపాడుకోవడానికి కచ్చితంగా విత్తనశుద్ధి చేయాలి. తక్కువ మోతాదు మందుతో, తక్కు వ ఖర్చుతో అధిక లాభాలు విత్తనశుద్ధితో ముడిపడి ఉన్నాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిరపల్లో వైరస్ తెగుళ్ల తాకిడి ఎక్కువ. కాబట్టి కచ్చితంగా సోడియం ట్రై అర్థోఫాస్ఫేట్‌తో విత్తనశుద్ధి చేయాలి. నిర్దేశించిన దూరంలో నాటితే పంటలు ఏపుగా పెరిగి దిగుబడులిస్తాయి. పత్తిలో అయితే సాంద్ర పద్ధతి అధిక సాంద్ర పద్ధతి కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అయితే అందుకు సిఫార్సు చేసిన రకాలే వాడాలి. కూరగాయ లు, పండ్ల తోటలలో కచ్చితంగా బిందు లేదా తుంపర సేద్యానికి పూనుకోవాలి. తక్కువ నీటితో ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో పంట సాగు చేపట్టవచ్చు. దిగుబడు లు పెరుగుతాయి. కలుపు సమస్య తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వీటికి భారీ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. రైతు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

agriculture-crop3

భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు

పంటల సాగులో ఎరువుల వాడకం ప్రధానమైంది. ముమ్మర పంటల సాగు నేపథ్యంలో భూమిలోని పోషకాలను పంటలు ఎప్పటికప్పుడు తీసుకుంటాయి. దీనికితో డు సేంద్రియ ఎరువుల వాడకం, పశువుల పేడ వంటి సంప్రదాయ ఎరువుల వాడకం తగ్గిపోతుండటం తో భూములు భూసారాన్ని కోల్పోతున్నాయి. ఎప్పటికప్పుడు అందించే ఎరువులతోనే పంటల దిగుబడి ఆధారపడి ఉంటుంది. అయితే ఏ భూమిలో ఎంత మోతాదులో ఎరువులు వాడా లి? ఏ పోషకాలు పంటకు అందించాలి? ఆయా భూముల్లో లోపించిన పోషకాలు ఏమిటి? పోషకాల పరిస్థితి ఏమిటి? వంటి అనే క విషయాలు భూసార పరీక్షలతో తెలుస్తాయి. అందుకే ప్రతి రైతు తన వ్యవసాయ భూమిని భూసార పరీక్ష చేయించాలి. తదనుగుణంగా వేసుకోదగిన పంట లు, వాడాల్సిన ఎరువులు, వాటి మోతాదు, దిగుబడులు పెరుగడానికి కావలసిన ఉపాయాలు సంబంధిత అధికారులు భూసార పరీక్ష కార్డుల్లో తెలియజేస్తాయి. అందువల్ల అవసరం మేరకే ఎరువులు వాడి, పెట్టుబ డి ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పటికే ఎరువుల ధరలు ఏటా 5-10 శాతం పెరుగుతున్నాయి. వస్తు, సేవా సుంకం పన్ను అమలుతో ఎరువుల ధరలు మరింత పెరుగనున్నాయి. కాబట్టి నిపుణుల సిఫార్సుల మేరకే ఎరువులు వాడాలి.

అయితే పంట స్వభావాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన ఎరువులు వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు: నూనె గింజలలో సల్ఫర్ ఆధారిత ఎరువులు వాడితే నూనె నాన్యత, మోతాదు, దిగుబడులు పెరుగుతాయి. అపరాలలో సైతం బోరాన్, కాల్షియం అధికంగా ఇచ్చే ఎరువులు వాడాలి. కూరగాయ పంటలలో సూక్ష్మ పోషకాల వాడకంతో దిగుబడులు 10 శాతం కచ్చితంగా పెరుగుతా యి. కాబట్టి సిఫార్సుల మేరకు సంబంధిత పోషకాలనిచ్చే ప్రధాన ఎరువులు, సూక్ష్మ పోషక ఎరువులను సిద్ధం చేసుకోవాలి. ప్రధాన పోషకాలనందించే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని మృత్తికలను పరిశీలిస్తే దాదాపు అన్ని నేలల్లో నత్రజని లోపం కనిపిస్తుం ది. కాబట్టి ఆ మేరకే సంబంధిత ఎరువులను వాడాలి. ముందుగానే పంట ను ఎంపిక చేసుకుని అందు కు అవసరమయ్యే ఎరువులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ పంటకైనా ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వాడితే పంటల దిగుబడులు బాగుంటాయి. మిగతా ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చు.

నీటి సంరక్షణే కీలకం

పంట విత్తనాలు విత్తటంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నేల బాగా తడిసిన తర్వాతే విత్తనం వేయాలి. లేదంటే మొలక శాతం తగ్గిపోతుంది. మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఎర్రనేలల్లో అయితే కనీసం 120 మి.మీ, నల్లరేగడి నేలల్లో అయితే 60- 80 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనం వేయాలి. మొలకెత్తిన తర్వాత ఎకరానికి నిర్దేశించిన మొక్కల సంఖ్య ఉండేలా చూసుకోవాలి. వర్షపాతం విస్తరణను బట్టి కూడా పంటల దిగుబడి ఉంటుంది. వర్షాల మధ్య విరామం 7-15 రోజులు దాటితే మొదటి దశలో మొక్కలు చనిపోతాయి. ఎర్ర నేలల్లో అయితే ఒక వారం, నల్ల రేగడి నేలల్లో అయితే గరిష్ఠంగా రెండు వారాలు విరామం ఏర్పడితే మొక్కలు చనిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా పొలా ల్లో ముఖ్యంగా వర్షాధార పొలాల్లో కందకాలు లేదా చిన్నపాటి నీటి కుంటలు తవ్వుకోవాలి. వర్షం ఎక్కువ మోతాదులో పడినప్పుడు మిగులు జలాలు జాలువారి ఆయా కుంటలలో చేరుతాయి. వర్ష విరామ సమయం లో వీటి నుంచి నీటిని పంటకు వాడుకోవచ్చు. భూగ ర్భ జల మట్టాలు కూడా పెరుగుతాయి. వర్షాధార పంటల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు వీటి ద్వారా ఒక్క తడి ఇచ్చినా దిగుబడులు 10-15 శాతం పెరుగుతాయి. పంట కుంటలు తవ్వుకోవడానికి ప్రభుత్వం పథకాలు కూడా అమల్లో ఉన్నాయి.


crop-insurance

బీమాతో ధీమా

ఈసారి సాధారణ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ చెబుతున్నది. అయితే గత అనుభవాల దృష్ట్యా పెట్టుకుని విధిగా పొలంలోని పంటకు బీమా చేయించుకుంటే మంచిది. అన్ని పంటల్లో మండలం యూనిట్‌గా, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వరి పంటకు గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమల్లో ఉన్నది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పంటల బీమా అమల్లో ఉన్నది. సొంత పెట్టుబడులతో సాగు చేసేటప్పుడు సైతం రైతు బీమా చేయించాలి.స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుని బీమా చేయించుకంటే మేలు.

విత్తన ఎంపికలో జాగ్రత్తలు

-నిపుణుల సిఫార్సు మేరకే తగిన విత్తనాన్ని కొనుగోలు చేయాలి. ప్రైవేటు విత్తన కంపెనీలు లేదా డీలర్ల మాట మీద ఎక్కువగా తీసుకోవ ద్దు. దీంతో పంటల సాగు ఖర్చులు పెరుగుతాయి.
-మార్కెట్లో ధృవీకరణ విత్తనం, ట్రూత్‌ఫుల్లీ లేబు ల్డ్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ధృవీకరణ విత్తనమే కొనాలి. విత్తనం సంచి లేబుల్ మీద ఏ ప్రాంతానికి లేదా రాష్ర్టాల్లో సాగుకు సరిపోతుందో ముద్రిం చి ఉంటుంది. వాటిని చూసి తమ ప్రాంతానికి అనుకూలమో లేదో నిర్ధాంచుకోవాలి,
-విత్తనాన్ని లూజ్‌గా ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. అమ్మటానికి ఉద్దేశించిన విత్తనాలు కచ్చితంగా సంచులు లేదా ప్యాకెట్లలోనే అందుబాటులో ఉంచాలి.
-ముఖ్యంగా హైబ్రిడ్‌లలో రెండో తరం విత్తనా లు కొనుగోలు చేయరాదు. పత్తిలో జిన్నింగ్ చేసిన రెండో తరం విత్తనాలు అమ్ముతున్నారు. విత్తనంపై ముద్రించిన ధరకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించరాదు.
-విత్తన సంచి లాట్ నెం, రకం పేరు కచ్చితంగా ముద్రించి ఉండాలి. అలా లేని సంచులలో విత్తనాలు కొనుగోలు చేయరాదు.
-విత్తనం కొనేటప్పుడు కచ్చితంగా రశీదు తీసుకోవాలి. రశీదులో విత్తనం పరిమాణం, ధర, లాట్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ కచ్చితంగా నమో దు చేయించుకోవాలి.
- సంచిపై ఉత్పత్తిదారుడి చిరునామాను పరిశీలించి, వారి విక్రయ లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
-ప్రతి సంచిలో 10 విత్తనాలు తీసుకుని మొలక శాతం పరీక్షించిన తర్వాతే పొలంలో విత్తాలి.
-రశీదును పంట పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. పూత, కాత రాని సమయంలో ఈ రశీదుతోనే నష్టపరిహారం ముడిపడి ఉంటుంది. కొనుగోలు చేసిన విత్తనం విత్తనశుద్ధి చేయబడకపోతే తర్వాతైనా రైతు విత్తనశుద్ధి చేయాలి.
-సాధారణ విత్తనాన్ని విత్తనశుద్ధి చేసి రంగు మార్చి దళారులు విడిగా, సంచుల్లో కాకుండా విక్రయిస్తున్నారు. వాటిని కొనరాదు.
saidaiah

506
Tags

More News