ఈఎస్‌ఐసీలో 2258 పోస్టులు


Fri,March 15, 2019 12:30 AM

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ESIC
-మొత్తం ఖాళీలు: 2258(స్టెనోగ్రాఫర్-486, అప్పర్ డివిజన్ క్లర్క్-1772)
-వీటిలో రాష్ట్రంలోని ఖాళీల సంఖ్య:
-యూడీసీ - 112 ఖాళీలు (జనరల్-45, ఎస్సీ-14, ఎస్టీ-4, ఓబీసీ-38, ఈడబ్ల్యూఎస్-11. పీహెచ్‌సీ-4, ఎక్స్‌సర్వీస్‌మెన్-11)
-స్టెనోగ్రాఫర్-21 ఖాళీలు (జనరల్-10, ఎస్సీ-3, ఎస్టీ-1, ఓబీసీ-5, ఈడబ్ల్యూఎస్-2. ఎక్స్‌సర్వీస్‌మెన్-2).
-పేస్కేల్: రూ.5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-(లెవల్-4) అర్హతలు: స్టెనోగ్రాఫర్- ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. స్టెనోగ్రఫీ ఇంగ్లిష్/హిందీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-యూడీసీ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆఫీస్ సూట్స్, డాటాబేస్, కంప్యూటర్ ఉపయోగించడం వచ్చి ఉండాలి.
-వయస్సు: 2019, ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.


పరీక్ష విధానం: స్టెనోగ్రాఫర్‌కు..

-ఫేజ్-I: ఇంగ్లిష్ లాంగ్వేజ్&కాంప్రహెన్షన్- 100 ప్రశ్నలు- 100 మార్కులు-70 నిమిషాలు.
-రీజనింగ్ ఎబిలిటీ - 50 ప్రశ్నలు-50 మార్కులు- 35 నిమిషాలు.
-జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు- 50 మార్కులు-25 నిమిషాలు.
-ఫేజ్-II: కంప్యూటర్ స్కిల్ టెస్ట్ &స్టెనోగ్రఫీ టెస్ట్ (ఇది అర్హత పరీక్ష మాత్రమే)
-రెండు పవర్ పాయింట్ ైస్లెడ్స్ తయారీ - 10 మార్కులు, ఎంఎస్ వర్డ్‌లో ఇచ్చిన విషయాన్ని టైపింగ్ చేయాలి- 20 మార్కులు. ఎంఎస్ ఎక్సెల్‌ను ఫార్ములా ప్రకారం టేబుల్ ప్రిపరేషన్ చేయాలి -20 మార్కులు.
-మొత్తం 50 మార్కులు - 30 నిమిషాల కాలవ్యవధిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అనంతరం స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. దీనిలో నిమిషానికి 80 పదాల వేగంతో 10 నిమిషాల్లో ఈ టెస్ట్‌ను పూర్తి చేయాలి.

అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు...

-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
-ఇది అర్హత పరీక్ష మాత్రమే
-జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కుల పరీక్ష, కాలవ్యవధి గంట.
-దీనిలో అర్హత సాధించినవారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
-మెయిన్ ఎగ్జామ్- ఇది బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో ఉంటుంది. దీనిలో కూడా ప్రిలిమినరీలో ఇచ్చిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-ఒక్కో సబ్జెక్టు నుంచి 50ప్రశ్నలు-50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకాలవ్యవధి - 2 గంటలు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోతవిధిస్తారు. దీనిలో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
-మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
-స్కిల్‌టెస్ట్ - ఇది 50 మార్కులకు 30 నిమిషాల్లో నిర్వహిస్తారు. పవర్ పాయింట్ ైస్లెడ్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్‌పై పరీక్ష ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 15
-ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ/మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ.250/-ఇతరులకు రూ.500/-
-వెబ్‌సైట్: https://www.esic.nic.in

942
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles