ఎన్‌టీఆర్‌వోలో టెక్నికల్ అసిస్టెంట్లు


Sun,March 10, 2019 12:20 AM

భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో) ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
studentsNTRO
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య-127(జనరల్-48, ఈడబ్ల్యూఎస్-22, ఓబీసీ-37, ఎస్సీ-12, ఎస్టీ-8)

విభాగాలవారీగా ఖాళీలు:

-ఎలక్ట్రానిక్స్-60 పోస్టులు (జనరల్-20, ఈడబ్ల్యూఎస్-9, ఓబీసీ-15, ఎస్సీ-5, ఎస్టీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేండ్ల డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. డిప్లొమా/టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌తో పాటు కంప్యూటర్ స్కిల్స్‌పైన మంచి పరిజ్ఞానం ఉండాలి.
-కంప్యూటర్ సైన్స్- 75 పోస్టులు (జనరల్-28, ఈడబ్ల్యూఎస్-13, ఓబీసీ-22, ఎస్సీ-7, ఎస్టీ-5)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ, మూడేండ్ల డిప్లొమా (కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ)లో ఉత్తీర్ణత. డిప్లొమా/టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 35,400-1,12,400/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష.
-ఆబ్జెక్టివ్ విధానంలో టైర్1, టైర్2 సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు.
-టైర్1లేదా టైర్2కు మొత్తం 400 మార్కులకుగాను ఉంటుంది.
-సంబంధిత సబ్జెక్టుతోపాటు జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ తదితర అంశాల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒకమార్కు కోత విధిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 15
-చివరితేదీ: ఏప్రిల్ 4
-టైర్1 పరీక్షతేదీ: ఏప్రిల్ 4
-టైర్2 పరీక్షతేదీ: మే 18,19
-వెబ్‌సైట్: http://ntro.gov.in

870
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles