రైల్వేలో 1937 పారామెడికల్ పోస్టులు


Fri,March 8, 2019 02:02 AM

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే బోర్డుల్లో/ప్రొడక్షన్ యూనిట్లలో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
STAFF-NURSE
-మొత్తం పోస్టులు: 1937 (జనరల్-936, ఈడబ్ల్యూస్-158, ఓబీసీ-419, ఎస్సీ-272, ఎస్టీ-151)

విభాగాల వారీగా ఖాళీలు:

-స్టాఫ్‌నర్స్-1109, డైటీషియన్-4, డెంటల్ హైజనిస్ట్-5, డయాలసిస్ టెక్నీషియన్-20, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్-11, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ (గ్రేడ్2)-289, ల్యాబ్ సూపరింటెండెంట్ (గ్రేడ్3)-25, ఆప్టోమెట్రిస్ట్-6, పర్‌ఫ్యూజనిస్ట్-1, ఫిజియోథెరపిస్ట్-21, ఫార్మసిస్ట్ (గ్రేడ్3) -277, రేడియోగ్రాఫర్-61, స్పీచ్ థెరపిస్ట్-1, ఈసీజీ టెక్నీషియన్-23, లేడీ హెల్త్ విజిటర్-2, ల్యాబ్ అసిస్టెంట్ (గ్రేడ్2)-82 ఖాళీలు ఉన్నాయి.
-కోల్‌కతా-236, ముంబై-232, చండీగఢ్-197, అలహాబాద్-176, చెన్నె-173, సికింద్రాబాద్ -112 తదితర బోర్డుల్లో ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: స్టాఫ్ నర్స్‌కు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో సర్టిఫికెట్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌కు కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుతో బీఎస్సీతోపాటు హెల్త్/శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లో ఏడాది డిప్లొమా/ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. ఫార్మసిస్ట్‌లకు సైన్స్‌లో ఇంటర్+ఫార్మసీలో డిప్లొమా లేదా బీఫార్మసీ ఉత్తీర్ణత. రేడియోగ్రాఫర్లకు ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్+రేడియోగ్రఫీ/ఎక్స్‌రే టెక్నీషియన్ లేదా రేడియోడయాగ్నసిస్ టెక్నాలజీలో డిప్లొమా, ల్యాబ్ అసిస్టెంట్లకు సైన్స్‌లో 10+2 (ఇంటర్)తోపాటు డీఎంఎల్‌టీ లేదా ఎంఎల్‌టీలో సర్టిఫికెట్ ఉండాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: గరిష్ఠంగా 33 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో మార్పులు ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు- రూ. 250/-
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీనిలో సంబంధిత సబ్జెక్టు (ప్రొఫెషనల్ ఎబిలిటీ)-70, జనరల్ అవేర్‌నెస్-10, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్-10, జనరల్ సైన్స్-10 మార్కులు ఇస్తారు. ఇంటర్వ్యూ లేదు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
నోట్: అర్హత కలిగిన అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఏప్రిల్ 2
-వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

985
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles