జేఈఈ అడ్వాన్స్‌డ్ -2019


Wed,March 6, 2019 03:29 AM

దేశంలోని ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరొందిన విద్యాసంస్థలే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు. వీటిలో ప్రవేశాల కోసం లక్షలమంది విద్యార్థులు అహర్నిశలు శ్రమిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కులు సాధిస్తే ఐఐటీలో సీటు లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ సంక్షిప్త ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం...
JEE

జేఈఈ అడ్వాన్స్‌డ్:

-ఐఐటీల్లో ప్రవేశాల కోసం మొదట జేఈఈ మెయిన్ రాసి దానిలో అర్హతసాధిస్తే ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపికచేస్తారు. తర్వాత దానిలో సాధించిన మార్కుల (ర్యాంకు) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-జేఈఈ మెయిన్ రాసిన మొత్తం అభ్యర్థుల నుంచి టాప్ 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు. అయితే కొత్తగా పర్సంటైల్ విధానం ప్రవేశపెట్టడంతో సమాన మార్కులు వస్తే ఆ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లను ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇది అమలు అయితే మరికొంతమందికి అవకాశం వస్తుంది.

అర్హతలు:

-జేఈఈ మెయిన్ టాప్ 2,24,000 (అన్ని కేటగిరీలు కలుపుకొని)లో ఉండాలి.
-1994, అక్టోబర్ 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-2017 కంటే ముందు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసి ఉండకూడదు.
-2018 లేదా 2019లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే అర్హులు.
-గతంలో ఏ ఐఐటీలో ప్రవేశం పొంది ఉండకూడదు. ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు 65 శాతం మార్కులు లేదా కేటగిరీల వారీగా ఆయా బోర్డులు ప్రకటించిన టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి.
-ప్రవేశాలు కల్పిస్తున్న సంస్థలు: 23 ఐఐటీలు+ఐఐపీఈ (విశాఖపట్నం), ఐఐఎస్సీ (బెంగళూరు), ఐఐఎస్‌ఈఆర్ (భోపాల్, మొహాలీ, కోల్‌కతా, పుణె, తిరువనంతపురం), ఐఐఎస్‌టీ (తిరువనంతపురం), ఆర్‌జీఐపీటీ (రాయబరేలి).
నోట్: ఐఐటీలు కాకుండా మిగిలిన సంస్థల్లో ప్రవేశాలకు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
-అందించే కోర్సులు: నాలుగేండ్ల బీటెక్, బీఎస్. ఐదేండ్ల బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ బీటెక్-ఎంటెక్, డ్యూయల్ డిగ్రీ బీఎస్-ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ.
-రిజిస్ట్రేషన్ ఫీజు: అన్ని కేటగిరీలకు చెందిన బాలికలకు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.1300+ జీఎస్‌టీ. ఇతరులకు రూ.2600+జీఎస్‌టీ.

jee1

ముఖ్యతేదీలు

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పరీక్షతేదీ: మే 19
-పేపర్-1 ఉదయం 9 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు.
-పరీక్ష విధానం: కంప్యూటర్ టెస్ట్.
-పరీక్ష నిర్వహిస్తున్న సంస్థ: ఐఐటీ రూర్కీ
-వెబ్‌సైట్: https://jeeadv.ac.in
...?కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles