కృషితో నాస్తి దుర్భిక్షం


Wed,March 6, 2019 03:19 AM

సీఎంఏ ఫైనల్‌లో ఆలిండియా 4వ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్స్
Behavior
-పట్టుదల, నిబద్ధతతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంక్ సాధించిన విద్యార్థి ముట్టూరి వెంకట అవినాష్. అవినాష్ తండ్రి చంద్రశేఖర్ సాధారణ రైతు. తల్లి చంద్రకళావతి కిరాణ దుకాణం నిర్వహిస్తారు. అవినాష్ 10వ తరగతిలో 9.3 గ్రేడ్ పాయింట్లు సాధించాడు. తర్వాత తన స్నేహితులంతా ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరినప్పటికీ.. కోర్సు ఎంపిక విషయంలో తండ్రి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అవినాష్ ఎంఈసీలో చేరాడు. రొటీన్ కోర్సులు ఎంచుకుని అందరిలో ఒకడిగా ఉండటం ఇష్టంలేకే తాను సీఏ/సీఎంఏ కోర్సులు ఎంచుకున్నట్లు అవినాష్ చెప్పాడు.

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీ యాజమాన్యం సీఏ/సీఎంఏ కోర్సులు కలిపి చదివితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పడంతో అవినాష్ ఆ కోర్సులవైపు మొగ్గుచూపాడు. సీఏతోపాటే సీఎంఏ చదవడం ప్రారంభించాడు. రెండు కోర్సులను ఏకకాలంలో చదువుతూ.. సీపీటీ, సీఏ ఫౌండేషన్, ఐపీసీసీ, సీఎంఏ -ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్ వరుసగా పూర్తిచేశాడు.

-సీఏ/సీఎంఏ కోర్సులు చాలా కష్టంగా ఉంటాయనేది అపోహ అని అవినాష్ కొట్టిపారేశాడు. సిలబస్‌ను 100 శాతం చదివితే ఫైనల్ పరీక్ష సునాయాసంగా రాయవచ్చని, మనం చదివేదాన్నిబట్టే పరీక్షల్లో ఫలితం ఉంటుందని చెబుతున్నాడు. అవినాష్ మాస్టర్‌మైండ్స్‌లో సీఏ ఫైనల్ కోచింగ్ తీసుకుంటూనే సీఎంఏ ఫైనల్ పరీక్షలు రాశాడు. సీఏతోపాటే చదవడంవల్ల సీఎంఏ కోర్సును సులువుగా పూర్తిచేశాడు.

-సీఎంఏ ఇంటర్‌లో ఆలిండియా 40వ ర్యాంకు సాధించాడు. సీఎంఏ ఫైనల్‌లో కూడా ఏదో ఒక ర్యాంక్ వస్తుందని ఊహించాడు. కానీ ఏకంగా ఆలిండియా 4వ ర్యాంకు రావడంతో చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు.
-అవినాష్ చదివినంతసేపు పూర్తి ఏకాగ్రతతో చదివేవాడు. ఏ సమయంలో ఏది చదవాలనే విషయంలో కచ్చితమైన ప్రణాళిక వేసుకుని పాటించేవాడు. మాస్టర్‌మైండ్స్ అకడమిక్ ప్రోగ్రామ్, సమయ ప్రణాళిక.. ఈ రెండూ తన విజయానికి కారణమని అవినాష్ చెబుతున్నాడు.

-సీఏ/సీఎంఏలో తాను సాధించిన ఫలితాలు చూసి తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారని, తనను విజేతగా తీర్చిదిద్దిన మాస్టర్‌మైండ్స్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు అవినాష్.

సీఎంఏ విద్యార్థులు చేసే పొరపాట్లు

-చాలామంది విద్యార్థులకు ప్రాథమిక అంశాలమీద పట్టుండదు. సీఏ, సీఎంఏ లాంటి కోర్సుల్లో రాణించాలంటే ముందుగా ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి.
-పరీక్ష రాసే సమయంలో చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. ఆందోళనవల్ల ఒక్కోసారి బాగా తెలిసిన సమాధానాలు కూడా తప్పుగారాసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆందోళన చెందకూడదు.
-పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. కొంతమంది సరిగా సమాధానాలు తెలియని ప్రశ్నల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేస్తుంటారు. అలా కాకుండా ముందుగా సమాధానం తెలిసిన ప్రశ్నలన్నింటినీ పూర్తిచేసి, ఆ తర్వాత రాని సమాధానాల గురించి ఆలోచించాలి. దీంతో సమయం వృథా కాదు.
-పరీక్షలు జరిగినన్నీ రోజులూ విద్యార్థులు తమమీద తమకుండే నమ్మకాన్ని కోల్పోకూడదు.
-పరీక్షల సన్నద్ధత సమయంలో కొంతమంది వేర్వేరు పుస్తకాలు, మెటీరియల్స్ తిరిగేస్తారు. దీనివల్ల అనవసర ఆందోళన, అయోమయానికి లోనవుతారు. అందుకే సన్నద్ధత సమయంలో మనం ఎలాంటి పుస్తకం/మెటీరియల్ చదువుతున్నాం అనేది కూడా ముఖ్యమే. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్ వారి మెటీరియల్‌లో విద్యార్థికి అవసరమైనంత సమాచారం ఉంది. అది చదివితే సరిపోతుంది.
-కొంతమంది మార్కులు ఎక్కువ వస్తాయన్న అపోహతో పేజీలకు పేజీలు సమాధానాలు రాస్తుంటారు. దీనివల్ల సమయం వృథా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎన్ని పేజీలు రాశామన్న దానికంటే సమాధానం ఎంత సూటిగా రాశామన్నదే ముఖ్యం.
-పరీక్షలో సమాధానాన్ని చక్కగా రాస్తూ అవసరమైన వర్కింగ్ నోట్స్, కాలిక్యులేషన్స్ పక్కనే రాయాలి. చాలామంది విద్యార్థులు కేవలం సమాధానం మాత్రమే రాసి వర్కింగ్ నోట్స్ వేరే ఎక్కడో రాయడంవల్ల అనవసరంగా మార్కులు కోల్పోతున్నారు.

రివిజన్, మాక్ టెస్టులు తప్పక రాయాలి

-సన్నద్ధత సమయంలో రివిజన్ టెస్టులు, మాక్ టెస్టులు రాయడంవల్ల పరీక్షల్లో ఫలితాలు కూడా పాజిటివ్‌గా ఉంటాయి.
-ఒక షెడ్యూల్ ప్రకారం ఈ రివిజన్, మాక్ టెస్టులకు సన్నద్ధమవడంవల్ల ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుని, అవి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. విద్యార్థులకు సబ్జెక్టులో ఎంతమేరకు పట్టు సాధించారో అవగాహన వస్తుంది. తమపై తమకు నమ్మకం పెరుగుతుంది. సమయపాలన కూడా అలవాటు అవుతుంది.
సరైన కోచింగ్ సంస్థ ఎంపిక
-సీఏ/సీఎంఏ కోర్సులు చదివేముందు సరైన కోచింగ్ సంస్థను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంచుకునే సంస్థ కేవలం కోచింగ్ ఇచ్చి వదిలేయకుండా మనం పరీక్షలు రాసేంతవరకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తుండాలి.
-మాస్టర్‌మైండ్స్‌వారు కోచింగ్‌కు చేరిన రోజే ఒక ప్రణాళికను విద్యార్థులకు అందిస్తారు. ఆ ప్రణాళిక ప్రకారమే కోచింగ్ ఇస్తారు. రివిజన్ టెస్టులు, మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మాస్టర్‌మైండ్స్‌లో అన్ని సబ్జెక్టులకు కోచింగ్ అందుబాటులో ఉండటంవల్ల ఒక్కో సబ్జెక్టు కోసం ఒక్కోచోటుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల శారీరక శ్రమ కూడా తగ్గుతుంది.

సీఏ, సీఎంఏ విద్యార్థులకు అవినాష్ సూచనలు


avinash
-సీఏ, సీఎంఏ కోర్సులు చదవాలంటే ఉండాల్సిన లక్షణాలు శ్రమపడే తత్వం, నిబద్ధత, సహనం. ఇవన్నీ ఉంటే ఒక సాధారణ విద్యార్థి కూడా విజయం సాధించగలడు.
-సీఎంఏ ఫైనల్ చదివేటప్పుడు ముందుగా ప్రాథమిక అంశాలపై పట్టుండాలి.
-ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏవైనా అవరోధాలు ఏర్పడితే నిరాశతో వెనుకడుగు వేయకూడదు.
-సన్నద్ధతకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదే

ప్రణాళిక ప్రకారం చదవాలి.

-ప్రాక్టికల్ ట్రైనింగ్/ఆర్టికల్‌షిప్ చేస్తున్న సమయంలోనే ఏ అంశాలు ముఖ్యం, వేటిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి? అనేది బేరీజు వేసుకుని బాగా చదవాలి.
-సన్నద్ధత సమయంలో బాగా కష్టం అనిపించిన, అర్థంకాని అంశాల గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా ఫ్యాకల్టీని, మెంటార్స్‌ను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
-సీఎంఏ పరీక్షల సమయంలో పరీక్షకు పరీక్షకు మధ్య ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. దీంతో పరీక్షలప్పుడు చదవడానికి ఎక్కువ అవకాశం దొరకదు. అందుకే సన్నద్ధత సమయంలోనే అనవసర అంశాలను, బాగా వచ్చిన అంశాలను కొట్టివేయాలి. అవిపోగా మిగిలిన అంశాలను బాగా చదివి, ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలప్పుడు కూడా వాటినే రివైజ్ చేస్తే సరిపోతుంది.
-సన్నద్ధత సమయంలోనే సీఏ, సీఎంఏ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నారు? అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
-సిలబస్‌లోని పూర్తి అంశాలపై అవగాహన తెచ్చుకుని ప్రతి చాప్టర్ వెయిటేజీని చూసుకోవాలి. ఎందుకంటే సీఎంఏ ఇన్‌స్టిట్యూట్ వారు ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు కచ్చితంగా వెయిటేజీని అనుసరిస్తారు.
-గడిచిన రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ప్రశ్నలు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ప్రాక్టికల్, థియరీ, కేర్ లాస్ మొదలైనవి) అడుగుతున్నారో విశ్లేషించుకుని సన్నద్ధం కావాలి.
-ఆర్టీపీ (రివిజన్ టెస్ట్ పేపర్), ఎంటీపీ (మోడల్ టెస్ట్ పేపర్), పీటీపీ (ప్రాక్టీస్ టెస్ట్ పేపర్) లను ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలి. ఈ పేపర్లను ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.icmai.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

716
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles