సూర్యునిలో ప్రస్తుతం మనం చూస్తున్న భాగం


Wed,March 6, 2019 03:08 AM

sun
-భూమి - సౌరకుటుంబం
సౌరకుటుంబం
ఖగోళ పదార్థం - లక్షణాలు
1) నక్షత్రం: స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండి తనలోని శక్తిని కాంతిరూపంలో విడుదల చేసేది.
ఉదా: సూర్యుడు
2) గెలాక్సీ: ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం
3) విశ్వం: ఇది అన్ని గెలాక్సీల సమూహం
(మిలియన్ల కొద్దీ గెలాక్సీలు)
4) తోకచుక్కలు: అతిథి గ్రహాలు
5) ఉల్కలు: భూమి ఉపరితలంపై పడిన శిలాశకలాలు (మిసో స్పియర్ ప్రాంతంలో) పాక్షికంగా మండినప్పుడు వాటి కేంద్రకంలోని శిలాభాగాలు భూ ఉపరితలానికి చేరుతాయి. ఇవే ఉల్కాపాతాలు.
6) లఘుగ్రహాలు: సూర్యుని చుట్టూ తిరిగే కంటికి కనిపించని శిలాశకలాలు (సౌరకుటుంబంలోని చిన్నచిన్న శిలాశకలాలు)
7) ఉపగ్రహాలు: గ్రహాల చుట్టూ తిరుగుతూ సూర్యుని నుంచి వెలుతురు, వేడిమిని పొందుతాయి.
8) గ్రహాలు: స్వయం ప్రకాశక శక్తి లేకుండా ఉండి వాటికి దగ్గరగా ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ నక్షత్రాల నుంచి వెలుతురు, వేడిని పొందేవి.

నక్షత్రం

-స్వయం ప్రకాశక శక్తిని కలిగి ఉండి, తనలో నుంచి శక్తిని కాంతిరూపంలో విడుదల చేసేది. ఉదా: సూర్యుడు (ఇది మధ్యపరిమాణం కలిగిన నక్షత్రం)
-సూర్యుడు మనకు అతిదగ్గరగా ఉన్న నక్షత్రం
-భూమిపై సమస్త జీవరాశులకు కావాల్సిన జీవనాధార శక్తి సూర్యుని నుంచి లభిస్తుంది.
-సూర్యుడు మండుతున్న ఒక మధ్యతరహా వాయుగోళం (మధ్యతరహా నక్షత్రం).

సూర్యునిశక్తి..


1) మొక్కలు ఆహారం తయారు చేసుకోడానికి
2) వాయుపీడనంలో మార్పులకు
3) భూశైథిల్యానికి తోడ్పడుతుంది
-సూర్యగోళం భూమికంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.
-సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత 6000oC ఉంటుంది. (క్రోమోస్పియర్)
-సూర్యుని కేంద్రంలో 10 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. (455X107oC)
-సూర్యునిలో మనం చూసేభాగం ఫొటోస్పియర్. దీని నుంచి వెలుతురు, వేడి ప్రసరిస్తున్నాయి.
-ఫొటోస్పియర్ పైన ఎరుపురంగులో ఉండే భాగాన్ని క్రోమోస్పియర్ అంటారు.
-క్రోమోస్పియర్‌ను ఆనుకుని పై భాగాన ఉండే పొరను కరోనా అని పిలుస్తారు. ఇది సూర్యగ్రహణ సమయాల్లో కనిపిస్తుంది.
-సూర్యుని వయస్సు దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు.
-సూర్యునిలోని ప్రధాన మూలకాలు H- 71 శాతం, He- 26.5 శాతం, మిగిలిన వాయువులు- 2.5 శాతం
-ఇక్కడే హైడ్రోజన్ వాయువు థర్మో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియవల్ల శక్తి అనేది జనిస్తుంది.
-హైడ్రోజన్ అన్ని దిక్కులకు వెదజల్లడాన్ని ప్రామినెన్సెస్ అంటారు.
-సూర్యుని భూమధ్య భాగం పరిభ్రమించడానికి 25 రోజులు పడుతుంది.
-సూర్యుని ధృవభాగం పరిభ్రమించడానికి 30 రోజులు పడుతుంది.
-అరోరా బొరియాలీస్ అనే ధృవపుజ్యోతులు (కాంతులు) ఉత్తర అమెరికాలోని న్యూఅర్లియన్స్ వరకు కనిపిస్తాయి. (ఉత్తరధృవంలో, ఆర్కిటిక్‌ప్రాంతంలో)
-అరోరా ఆస్ట్రాలీస్ అనే కాంతులు (ధృవపు జ్యోతులు) ఆస్ట్రేలియా ఉత్తరభాగం వరకు కనిపిస్తాయి. దక్షిణధృవంలో, అంటార్కిటికాప్రాంతంలో)
-సూర్యుని కాంతికిరణాలు భూమిని చేరడానికి పట్టేకాలం 8.3 నిమిషాలు.
-సూర్యుడు తన కేంద్రం చుట్టూ ఒకసారి తిరగడానికి 250 మిలియన్ ఏండ్లు పడుతుంది. ఈ కాలాన్ని కాస్మిక్ సంత్సరం అంటారు.
-కాస్మిక్ సంవత్సరం = 25X107 సంవత్సరం
-సౌర కుటుంబంలో కేంద్రస్థానంలో ఉన్నది సూర్యుడు.
-సౌరకుటుంబం పాలపుంత/ పాలవెల్లి/ ఆకాశగంగ అనే గెలాక్సీలో ఉంది. (మనం ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత)
-పాలపుంతలో ఉన్న మిలియన్ల కొద్ది నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం
-భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం- ప్రాక్సిమా సెంటారి
-సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్రం- ఆల్ఫా సెంటారి
-భూమికి, ఆల్ఫా సెంటారి నక్షత్రానికి మధ్యగల దూరం 403 కాంతి సంవత్సరాలు
-గ్రహాలకు మాతృక- సూర్యుడు
-సూర్యుని ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి 28 రెట్లు ఉంటుంది.
-సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను కలిపి సౌరకుటుంబం అంటారు.

సూర్యుని అంతర నిర్మాణం

-సూర్యుడు మండుతున్న వాయుగోళం (అగ్నిగోళం).
-సూర్యుని అంతర నిర్మాణాన్ని బట్టి 4 పొరలుగా విభజించవచ్చు. ఇవి బాహ్యగోళం నుంచి అంతరగోళానికి వరుసక్రమం.. 1) కరోనా- పైనున్న మొదటి పొర 2) క్రోమోస్పియర్- దానికింద ఉన్న పొర 3) ఫొటో స్పియర్ 4) కోర్

కరోనా

-ఇది తెల్లగా ఉండి వెండి మాదిరిగా మెరుస్తూ కొన్నివేల కి.మీ. వ్యాపించి ఉంటుంది.
-దీన్ని సూర్యుని బాహ్య వాతావరణంగా పరిగణిస్తారు.

క్రోమోస్పియర్

-ఇది సూర్యునిలో ఉన్న రెండో పొర
-ఇది కరోనా పొరను ఆనుకుని ఉంటుంది.
-ఇది హైడ్రోజన్ (H), హీలియం (He) వాయువులతో ఉంటుంది.
-సూర్యగ్రహణం రోజున కరోనా, క్రోమోస్పియర్ పొరలను చూడవచ్చు.
-ఇక్కడ హైడ్రోజన్ వాయువు న్యూక్లియర్ ఫ్యూజన్ (కేంద్రక సంలీనం) అనే ప్రక్రియవల్ల శక్తి జనిస్తుంది.
-ఇదే సూర్యుని శక్తికి మూలం.

ఫొటోస్పియర్

-ఇది చాలా ముఖ్యమైన పొర.
-దీన్నుంచి వెలుతురు, వేడి ప్రసరిస్తున్నాయి.
-ఇక్కడి నుంచి బయలుదేరిన సూర్యకాంతి భూమిని చేరడానికి దాదాపు 8.3 నిమిషాలు పడుతుంది.
-సూర్యునిలో ఉన్న వాయువులు- హైడ్రోజన్- 71 శాతంహీలియం- 26.5 శాతంఇతర వాయువులు- 2.5 శాతం
-హైడ్రోజన్ వాయువు థర్మో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియవల్ల శక్తి జనిస్తుంది. (1029 జౌల్)

కోర్

-ఇది సూర్యుని లోపలిభాగంలో (కేంద్రం) ఉన్న పొర.
-దీని ఉష్ణోగ్రత సుమారు 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్.
-సూర్యుని ఉపరితలంపై అక్కడక్కడ ఉండే కొన్ని చల్లని ప్రాంతాలను సౌరమచ్చలు (సన్ స్పాట్స్) అంటారు. ఇవి నలుపు రంగులో ఉండి దాదాపు 4000oC ఉష్ణోగ్రత ఉంటుంది.
-వీటి వ్యాసం 10,000 కి.మీ.
-దీనిలో అత్యుష్ణ ప్రాంతాలు కాంతివంతంగా ఉండి 6000oC కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. వీటిని ఫ్లోక్యులే (Flocculae) అంటారు.

నోట్:

1) సూర్యుడు గాని, ఇతర గ్రహాలుగాని ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకునే పరికరం- సిక్సాంట్ (Sixant).
2) సూర్యుని నుంచి బయలుదేరే మొత్తం సౌరశక్తిని సూర్యవికిరణం (Incoming Solar Radiation) అంటారు.
3) అందులో భూమి గ్రహించే సౌరశక్తిని సూర్యపుటం (Insolation) అంటారు.
4) భూమి సగటున నిమిషానికి చ సెం.మీ. 1.94 గ్రా. కేలరీల శక్తిని (సౌరశక్తి) గ్రహిస్తుంది. దీన్నే సౌరస్థిరాంకం అంటారు.
సూర్యుడు, నవగ్రహాలు (ప్రస్తుతం 8), 162 ఉపగ్రహాలు, శిలాశకలాలను కలిపి సౌరకుటుంబం అంటారు.
నోట్: ప్రస్తుతం ఫ్లూటోని గ్రహంగా పరిగణించడంలేదు.
2006, ఆగస్టు 24న I.A.U (International Astronomical Union) సమావేశంలో (చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్) ఫ్లూటోకు గల గ్రహస్థాయి హోదాను తొలగించారు. కాబట్టి ప్రస్తుతం సౌరకుటుంబంలోని గ్రహాల సంఖ్య- 8

ఫ్లూటో గ్రహస్థాయి తొలగింపు-కారణాలు

1. ఫ్లూటో కక్ష్యామార్గం దీర్ఘవృత్తాకారంలో కాకుండా అతిదీర్ఘ వృత్తాకారంలో ఉండటం.
2. ప్లూటోకు తగిన అంతర్గత శక్తి లేకపోవడంతో తన కక్ష్యా మార్గంలోకి ప్రవేశించే ఇతర ఖగోళ వస్తువులను తొలగించలేకపోవడం.
3. ప్లూటోకు తగిన గురుత్వాకర్షణ శక్తి లేనందున పరిపూర్ణ గోళాకారంలో లేకపోవడం.
-ఈ కారణాల వల్ల ప్లూటోకు గ్రహ హోదాను తీసివేసి మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు.
-ఈ విషయాలను క్లియర్డ్ ద నైబర్‌హుడ్ అంటారు.

సౌరకుటుంబంలో మరుగుజ్జు గ్రహాలు..

1. ఏరిస్: మరుగుజ్జు గ్రహాల్లో పెద్దది
2. యముడు (ప్లూటో)- దీని పరిభ్రమణ కాలం 248 ఏండ్లు. దీని ముఖ్య ఉపగ్రహం చారన్. దీన్ని 1930, ఫిబ్రవరి 18న ైక్లెడ్ టామ్‌బాగ్ కనుగొన్నారు.
3. సెరిన్

గ్రహాల వర్గీకరణ

-అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఇవన్నీ అంతర గ్రహాలు.
-బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
-ఇవన్నీ వుచ్ఛ గ్రహాలు (సుపీరియర్ ప్లానెట్స్)
-ఇది ఆస్టరయిడ్ బెల్ట్. ఆస్టరాయిడ్స్ అంటే అంతరిక్షంలో ప్రయాణించే వేలాది శకలాలు.
గమనిక: అంతరాగ్రహాలు (శిలాగ్రహాలు) ఆస్టరాయిడ్ బెల్ట్‌కు లోపలివైపు ఉంటాయి. బాహ్యగ్రహాలు (వాయు గ్రహాలు) ఆస్టరాయిడ్ బెల్ట్‌కు వెలుపలివైపు ఉంటాయి.
-కుజ, గురు గ్రహాలకు మధ్యలో ఆస్టరాయిడ్స్ ఒక వరుసలో విస్తరించి ఉన్నాయి.
-భూమి కక్ష్యను ఆధారంగా చేసుకుని - సౌరకుటుంబంలోని గ్రహాలను రెండు వర్గాలుగా విభజించారు. అవి..
-నిమ్నగ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి
-వుచ్ఛగ్రహాలు: కుజుడు, బృహస్పతి, శని, వరణుడు, నెప్ట్యూన్
-గ్రహాల అవరోహణ క్రమం (పరిమాణం ఆధారంగా).. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, భూమి, శుక్రుడు, కుజుడు, బుధుడు.
ramesh

831
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles