అతి తక్కువ కాలం పనిచేసిన ఆర్థికమంత్రి?


Wed,March 6, 2019 01:58 AM

1. బడ్జెట్ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?

1) ఫ్రెంచ్ 2) స్పానిష్
3) ఇంగ్లిష్ 4) అరబిక్

2. ఆర్థిక మంత్రి ఏ ప్రకరణ ప్రకారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు?

1) 101 2) 112 3) 121 4) 211

3. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?

1) గుల్జారీలాల్‌నందా 2) జాన్ మథాయ్
3) జవహర్‌లాల్ నెహ్రూ 4) షణ్ముఖం శెట్టి

4. భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాతతొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?

1) గుల్జారీలాల్ నందా 2) జాన్ మథాయ్
3) షణ్ముఖం శెట్టి 4) జవహర్‌లాల్ నెహ్రూ

5. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నోది?

1) 89 2) 88 3) 90 4) 91

6. ఇప్పటివరకు లోక్‌సభలో ఎంతమంది ఆర్థికమంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు?

1) 25 2) 28 3) 31 4) 38

7. ఇప్పటివరకు లోక్‌సభలో అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి?

1) ప్రణభ్‌ముఖర్జీ 2) చిదంబరం 3) మొరార్జీదేశాయ్ 4) మన్మోహన్‌సింగ్

8. కింది వాటిని జతపర్చండి.

1) యశ్వంత్‌చవాన్ ఎ. బ్లాక్ బడ్జెట్
2) మన్మోహన్‌సింగ్ బి. నవశకానికి నాంది
3) చిదంబరం సి. డ్రీమ్ బడ్జెట్
4) యశ్వంత్ సిన్హా డి. మిలీనియం బడ్జెట్
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

9. 2019-20కి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశ పెట్టారు?

1) రూ. 27.87 లక్షల కోట్లు
2) రూ. 24.84 లక్షల కోట్లు
3) రూ. 28.84 లక్షల కోట్లు
4) రూ. 27.84 లక్షల కోట్లు

10. రక్షణరంగానికి బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?

1) రూ. 3,18,831 కోట్లు 2) రూ. 3,08,931 కోట్లు
3) రూ. 3 లక్షల కోట్లు 4) రూ. 3,81,931 కోట్లు

11. కింది వాటిలో సరైనవి ఏవి?

1) రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
2) 2018, డిసెంబర్ 1 నుంచి అమలు, ఈ పథాకాన్ని ఫిబ్రవరి 24న గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
3) ఈ పథకం తర్వాత 12 కోట్ల మంది సన్నకారు, మధ్యతరహా రైతులకు ప్రయోజనం
4) రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులకు రూ. 6 వేలు మూడు విడతల్లో అందజేయడం
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 2, 4 4) 1, 2, 3, 4

12. ప్రస్తుతం ఎన్ని రకాల పంటలకు మద్దతు ధర

ప్రకటించారు?
1) 18 2) 24 3) 27 4) 22

13. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల స్థూల ఆదాయం ఎంత?

1) రూ. 2,32,705.68 కోట్లు
2) 2,72,705.68 కోట్లు
3) 2,44,705.68 కోట్లు
4) రూ. 2,12,705.68 కోట్లు

14. ఇప్పుడు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ఎన్నోది?

1) 11 2) 12 3) 13 4) 10

15. బడ్జెట్ ప్రవేశపెట్టని ఆర్థికమంత్రులు ఎవరు?

1) హెచ్‌ఎన్ బహుగుణ 2) పియూష్ గోయల్
3) హెచ్‌ఎన్ బహుగుణ, పియూష్ గోయల్
4) నారాయణ్‌దత్ తివారీ

16. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని ఎంత పెంచారు?

1) రూ. 20 లక్షలు 2) రూ. 15 లక్షలు
3) రూ. 10 లక్షలు 4) రూ. 25 లక్షలు

17. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంత?

1) రూ. 22,583 కోట్లు 2) రూ. 26,583 కోట్లు
3) రూ. 20,583 కోట్లు 4) రూ. 28,583 కోట్లు

18. తెలంగాణలో ఐదెకరాల లోపు ఉన్న ఎంతమంది రైతులకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది?

1) 42.08 లక్షలు 2) 48.08 లక్షలు
3) 49.08 లక్షలు 4) 47.08 లక్షలు

19. తెలంగాణలో ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతుంది?


1) రూ. 2,624.59 కోట్లు
2) రూ. 2,334.59 కోట్లు
3) రూ. 2,824.59 కోట్లు
4) రూ. 2,756.59 కోట్లు

20. 2016-17లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?

1) రూ. 1,81,034 2) రూ. 1,18,670
3) రూ. 1,75,068 4) రూ. 1,74,687

21. అతి తక్కువ కాలం పనిచేసిన ఆర్థికమంత్రి?

1) నారాయణ్ దత్ తివారీ 2) వీపీసింగ్
3) హెచ్‌ఎన్ బహుగుణ 4) జశ్వంత్ సింగ్

22. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటా ఎంత ఉండాలని కేంద్రం నిర్ణయించింది?

1) 36 శాతం 2) 39 శాతం
3) 42 శాతం 4) 44 శాతం

23. జీఎస్టీ ద్వారా ప్రతి రూపాయిలో ఎన్ని పైసలు కేంద్రానికి ఆదాయంగా సమకూరుతుంది?

1) 13 పైసలు 2) 21 పైసలు
3) 19 పైసలు 4) 18 పైసలు

24. దేశంలో విద్యుదుత్పత్తి గత ఏడాదితో పోల్చితే ఎంత శాతం పెరిగింది?

1) 2.89 శాతం 2) 4.56 శాతం
3) 3.63 శాతం 4) 6.04 శాతం

25. కింది వాటిలో నూతన భూ కౌలు చట్టం -2016 అమలు చేయని రాష్ట్రం ఏది?

1) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్ 4) తెలంగాణ

26. మన దేశంలో ప్రతిరోజు ఎన్ని కి.మీ.ల మేరకు రహదారులు నిర్మిస్తున్నారు?

1) 23 కి.మీ. 2) 29 కి.మీ.
3) 19 కి.మీ. 4) 26 కి.మీ.

27. రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?

1) గుల్జారీలాల్‌నందా 2) జాన్ మతాయి3) జవహర్‌లాల్ నెహ్రూ 4) షణ్ముఖంశెట్టి

28. ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతులకు కేంద్రం ఎంత శాతం వడ్డీ మినహాయింపు ప్రకటించింది?

1) 3.5 శాతం 2) 1 శాతం 3) 2 శాతం 4) పూర్తి మినహాయింపు

29. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఎంత సమీకరించాలని నిర్ణయించారు?

1) రూ. 85,000 కోట్లు 2) రూ. 1,20,000 కోట్లు3) రూ. 65,000 కోట్లు 4) రూ. 90,000 కోట్లు

30. దేశంలో అసంఘటితరంగంలో పనిచేసే వారు ఎంతమంది ఉన్నారు?

1) 33 కోట్లు 2) 42 కోట్లు 3) 39 కోట్లు 4) 27 కోట్లు

31. కింది వాటిలో సరైనవి ఏవి?

1) మనదేశంలో రైతుల సంఖ్య 26.30 కోట్లు
2) ఒక్కో రైతు కటుంబంపై అప్పు రూ. 1.04 లక్షలు
3) దేశంలో 52 శాతం మంది అప్పులో ఉన్నారు
4) దేశంలో అత్యధికంగా అప్పుల్లో ఉన్న రైతుల్లో ఏపీ ప్రథమ స్థానం, తెలంగాణ ద్వితీయ స్థానం
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 2, 4 4) 1, 2, 3, 4

32. దేశంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి?


1) 100 2) 104 3) 89 4) 98

33. ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సరైనవి?


ఎ. 2018లో బాలబాలికల నిష్పత్తి 1000: 944
బి. అత్యధిక బాలబాలికల నిష్పత్తి గల జిల్లా వనపర్తి 1000: 985
సి. అత్యల్ప బాలబాలికల నిష్పత్తి గల జిల్లా జనగాం 1000: 864
డి. 2018లో జన్మించిన శిశువుల సంఖ్య 6,03,919
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి

34. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం?


1) మార్చి నుంచి ఫిబ్రవరి 2) ఏప్రిల్ నుంచి మార్చి
3) జనవరి నుంచి డిసెంబర్ 4) జూలై నుంచి జూన్

35. రాష్ట్ర జీఎస్‌డీపీలో రాష్ర్టాలు ఎంత శాతానికి మించి అప్పు తీసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది?


1) 3 శాతం 2) 4.5 శాతం
3) 2.2 శాతం 4) 3.8 శాతం


ans

పరిశోధనాత్మక విద్యా కేంద్రం ఐపీఈ


ఏ సమాజమైనా స్థిరంగా ఉండక నిరంతరం పరివర్తన చెందుతూనే ఉంటుంది. ప్రగతిపథంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ నిరంతరం మార్పులకు లోనవుతూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాల విధానాల్లోనూ, పరిశ్రమల పథకాల్లోనూ నిత్యనూతనత్వం అవసరం అవుతుంది. మారుతున్న సమాజ అవసరాలు తీర్చాలంటే నిరంతర పరిశోధన, నూతనంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు చూపుతుండాలి. అలాంటి క్లిష్టమైన, బృహత్తరమైన కార్యాలు నిర్వహించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఆ కోవలోకే వచ్చే ప్రపంచస్థాయి సంస్థ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ) హైదరాబాద్.

R.K-MISHRA
ఐపీఈ హైదరాబాద్ సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ సామాజిక జవాబుదారీతనం, సుస్థిరాభివృద్ధి తదితర విభాగాల్లో కచ్చితమైన పరిశోధనలతో కూడిన అత్యాధునిక విద్యను అందించటంలో పేరెన్నికగన్న సంస్థ. ఐపీఈ హైదరాబాద్‌ను 1964లో నెలకొల్పారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) ఐపీఈని నిర్వహిస్తున్నది. సుధీర్ఘ బోధనానుభవంతో నాయకత్వ అభివృద్ధి శిక్షణ, పరిశోధన, విధాన నిర్ణేతలతో నిరంతరం సంప్రదింపుల విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐపీఈ తనకంటూ అనేక ప్రత్యేకతలను సృష్టించుకొన్నది. పరిశ్రమతో విద్యా బోధనను అనుసంధానం చేయటంలో బలమైన పునాదిని నిర్మించింది.

ఐపీఈకి కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సుస్థిరాభివృద్ధి, పబ్లిక్ పాలసీ, ఎనర్జీ, రెగ్యులేషన్ అంశాలపై జ్ఞాన సముపార్జనలో విద్యార్థులను ముందువరుసలో నిలిపేలా ప్రత్యేక కేంద్రాలున్నాయి. ఏ విద్యా సంస్థ అయినా ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ బోధన బృందం కీలకం ఐపీఈ కూడా ఈ అంశంపైనే దృష్టిపెట్టి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నది. ఐపీఈలో పూర్తిస్థాయి బోధన బృందంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజిటింగ్ ఫ్యాకల్టీ, అనుబంధ బోధకులు సమృద్ధిగా ఉన్నారు. విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షించటంలో, వారి పరిశోధనలకు మార్గదర్శనం చేయటంలో ఐపీఈ బోధనాబృందానికి బలమైన బోధనా విధానాలున్నాయి. పరిశ్రమతో ప్రత్యక్ష అనుభనం ఉండి, అంతర్జాతీయ స్థాయి విద్యార్హతలతో అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించిన ప్రొఫెసర్లు ఐపీఈ సొంతం. పరిశ్రమకు విద్యార్థులకు ఐపీఈ బలమైన వారధిగా పనిచేస్తుండటంతో ఇక్కడ చదివే విద్యార్థులందరికీ కచ్చితంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి.

విద్యార్థులకు అవసరమైన విద్యాపరమైన వనరులను భౌతికంగా, ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ఇక్కడి నాలెడ్జ్ సెంటర్ విశేషంగా కృషి చేస్తూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నది. ఐపీఈకి ఉన్న 22 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దాంతో ఈ క్యాంపస్‌కు జీఆర్‌ఐహెచ్‌ఏ, ఎల్‌ఈఈడీ గుర్తింపు కూడా లభించింది. ఐపీఈ క్యాంపస్‌లో అకడమిక్ భవనంతోపాటు అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు, క్యాంటీన్, క్రీడా సదుపాయాలు ఇలా సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏఐసీటీఈ నిర్దేశించిన పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఐపీఈలో వివిధ పీజీడీఏ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తున్నాయి.

ప్రస్తుతం ఐపీఈలో ఆరు అంశాల్లో పీజీ డిప్లొమా మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నారు. పీజీడీఎం జనరల్, పీజీడీఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, పీజీడీఎం ఇంటర్నేషనల్ బిజినెస్, పీజీడీఎం మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, పీజీడీఎం హ్యూమన్ రిసోస్స్ మేనేజ్‌మెంట్ అనేది రెండేండ్ల కాలవ్యవధి కలిగిన కోర్సులు, పీజీడీఎం ఎగ్జిక్యూటివ్ కోర్సు కాలవ్యవధి 15 నెలల అని ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ కే మిశ్రా తెలిపారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పీజీడీఏం కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు గల్ఫ్ కార్మికుల పిల్లలకు, విదేశీయులకు ఈ డ్లిప్లొమా కోర్సుల్లో ప్రత్యేక కోటాను కేటాయించినట్లు వివరించారు. ఐపీఈ పాలనా మండలిని సుదీర్ఘ అనుభవం ఉన్న పాలనా నిర్వాహకులు, పరిశోధకులు, బోధకులు, ప్రైవేటు, ప్రభుత్వ పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పర్చినట్లు తెలిపారు.
Krishnaiah

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles