సీహెచ్‌ఎస్‌ఎల్-2019


Wed,March 6, 2019 01:19 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎల్‌డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డీఈవో పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2018 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
ssc-exam-students

వివరాలు:

-భారత ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వశాఖల్లో, విభాగాల్లో, కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది.
-పోస్టు: లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ)
-పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.1,900
-పోస్టు: పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)
-పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
-పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్
(డీఈవో)
-పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
-పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ
-పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1992, ఆగస్టు 2 నుంచి 2001,ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: 2019, ఆగస్టు 1 నాటికి ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈవో (కాగ్‌లో డీఈవో పోస్టులకు తప్ప) - గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి ఇంటర్ సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం:

-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్-I, డిస్క్రిప్టివ్ పేపర్ టైర్-II,స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్ టైర్-III.టైర్-I పరీక్ష:ఈ పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నప్రతం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది.
-పరీక్ష తేదీ: 2019, జూలై 1 నుంచి జూలై 26 వరకు నిర్వహిస్తారు.
-పరీక్షలో ఇంగ్లిష్ (బేసిక్ నాలెడ్జ్), జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్), జనరల్ అవేర్‌నెస్.
-ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు, 50 మార్కులు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోత విధిస్తారు.
-టైర్-Iలో నార్మలైజ్డ్ పద్ధతిలో మార్కులను ప్రకటిస్తారు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
టైర్-II పరీక్ష:ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్కులకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు 33 శాతం రావాలి.
-ఈ పరీక్షలో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
టైర్-III పరీక్ష:స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్‌ను కంప్యూటర్స్‌పై నిర్వహిస్తారు.
-ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 5 (5 PM వరకు)
-ఫీజు: రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు)
-చివరితేదీ: ఏప్రిల్ 7
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
-టైర్-I పరీక్ష తేదీలు: జూలై 1 నుంచి జూలై 26 మధ్య
-టైర్-II పరీక్షతేదీ: సెప్టెంబర్ 29
-వెబ్‌సైట్: https://ssc.nic.in.

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles