ఎల్‌ఐసీలో 590 ఏఏవోలు


Tue,March 5, 2019 03:00 AM

ముంబైలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
lic-aao-posts
-పోస్టు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో)
-మొత్తం పోస్టులు: 590 (జనరల్-237, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-144, ఎస్సీ-92,ఎస్టీ-58)
-విభాగాలవారీగా ఖాళీలు: జనరలిస్ట్-350, ఐటీ-150, చార్టెర్డ్ అకౌంటెంట్-50, అక్చ్యూరియల్-30, రాజభాష-30.
-అర్హతలు: జనరలిస్ట్ విభాగానికి- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఐటీ విభాగానికి-బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), చార్టెడ్ అకౌంటెంట్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ ఫైనల్, అక్చ్యూరియల్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అక్చ్యూరిన్ ఆఫ్ ఇండియా నిర్వహించే సిటి1, సిటి5 ప్లస్ పేపర్లలో ఉత్తీర్ణత. రాజభాష విభాగానికి- ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (హిందీ/ ఇంగ్లిష్) లేదా హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (సంస్కృతం) ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 32795- 62315/- ప్రదేశాన్ని బట్టి ఏ క్లాస్ పట్టణంలో నెలకు సుమారుగా రూ. 56,000/-
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్), పర్సనల్ ఇంటర్వ్యూ
-ప్రిలిమినరీ రాతపరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు. గంట వ్యవధిలో పూర్తిచేయాలి.
-ప్రిలిమినరీలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్- 300 మార్కులు, డిస్క్రిప్టివ్-25 మార్కులకు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 22
-ప్రిలిమినరీ హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్: ఏప్రిల్ 22 నుంచి 30 వరకు
-ప్రిలిమినరీ ఎగ్జామ్: మే 4, 5
-మెయిన్ ఎగ్జామ్: జూన్ 28
-వెబ్‌సైట్: www.licindia.in

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles