‘ఈడబ్ల్యూఎస్’ అప్‌లోడ్ చేయండి


Tue,March 5, 2019 02:55 AM

జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సూచన
nta-JEE--Mains-2019
జేఈఈ మెయిన్ దరఖాస్తు చేసుకుని జనవరిలో పరీక్ష రాసినవారు, ఏప్రిల్‌లో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వివరాలను తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐటీ, నిట్, ఐఐఐటీ, కేంద్ర నిధులతో నడిచే సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు-ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లును 2019-20 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే జేఈఈ మెయిన్ అభ్యర్థులు మార్చి 11 నుంచి 15 మధ్య ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకు ద్వారా వివరాలను తెలియజేయాలని ఎన్‌టీఏ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల నాటికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఫార్మాట్, కేంద్రం జారీచేసిన కాపీలను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
-వెబ్‌సైట్: www.nta.ac.in

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles