తెలుగు మీడియం అయితేనేం?


Mon,March 4, 2019 01:39 AM

సీఎస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ సక్సెస్ స్టోరీ
పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఇటీవల సీఎస్ ఎగ్జిక్యూటివ్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన మలిశెట్టి సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ తండ్రి రాము సాధారణ ఎలక్ట్రీషియన్. ఇప్పటికే పెద్ద కొడుకును సీఏ చదివించిన రాము.. చిన్న కొడుకు సూర్యప్రకాష్ కోరిక మేరకు అతడిని కూడా సీఏ/సీఎస్ కోర్సుల కోసం మాస్టర్‌మైండ్స్‌లో చేర్పించాడు. తండ్రి అంచనాలకు తగ్గకుండా కొడుకులు ఇద్దరూ విజయాలు సాధిస్తున్నారు.
cs-executive
- సూర్యప్రకాశ్‌కు చిన్నప్పటి నుంచే సైన్స్ గ్రూపులంటే ఇష్టం ఉండేది కాదు. ట్యాక్స్, లా వంటి సబ్జెక్టులంటే చాలా ఇష్టం. అందుకే 10వ తరగతి పూర్తవగానే సీఏ/సీఎస్ కోర్సులో చేర్పించమని తన తండ్రిని అడిగాడు. దాంతో తల్లిదండ్రులు ఆయనను మాస్టర్‌మైండ్స్‌లో చేర్పించారు. పదో తరగతిలో 9.5 గ్రేడ్ పాయింట్లు, ఇంటర్ (MEC)లో 955 మార్కులు సాధించాడు.
- సూర్యప్రకాశ్ సీఏ/సీఎస్ కోర్సులు చదవాలని నిర్ణయించుకున్నప్పుడు.. తెలిసిన వాళ్లు, బంధువులు తెలుగు మీడియం విద్యార్థులకు సీఏ/సీఎస్ కోర్సులు చదవడం చాలా కష్టమని హెచ్చరించారు. అయినాసరే కచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకంతో సీఏ/సీఎస్ కోర్సులో చేరాడు.
- సీఏ/సీఎస్ కోర్సు చదవడంలో మాస్టర్‌మైండ్స్ తనకు 100 శాతం సహకారం అందించిందని చెపుతున్నాడు. సీఏ-సీపీటీలో ఆలిండియా 3వ ర్యాంకు, సీఏ-ఐపీసీసీలో ఆలిండియా 38వ ర్యాంకు, ఇప్పుడు సీఎస్ ఎగ్జిక్యూటివ్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
- సీఏ కోర్సులో రెండో దశ అయిన ఐపీసీసీ పూర్తయ్యాక మూడేండ్లపాటు ఒక సీఏ వద్ద ఆర్టికల్‌షిప్ చేయాలి. సూర్యప్రకాశ్ సీఏ వద్ద ఆర్టికల్‌షిప్ చేస్తూనే సీఎస్ ఎగ్జిక్యూటివ్ కోర్సుకు ప్రిపేర్ అయ్యాడు. సీఏతోపాటు మరో కోర్సు సమాంతరంగా పూర్తిచేయవచ్చు అనే విషయం తెలిసి సీఎస్ కోర్సును ఎంచుకున్నాడు. ఆర్టికల్‌షిప్‌కు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా సీఎస్ కోర్సు చదివాడు.
-సీఏ, సీఎస్ కోర్సుల్లో కొన్ని పేపర్లు కామన్‌గా ఉంటాయి. ఆ పేపర్లు ప్రిపేర్ కావడం తేలికగా జరిగిపోయింది. సీఎస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులోని ఒక్క పేపర్‌ను మాత్రం సీఎస్ ఇన్‌స్టిట్యూట్ వారి సహకారంతో చదివాను. మిగిలిన అన్ని పేపర్ల ప్రిపరేషన్‌కు మాస్టర్‌మైండ్స్‌వారు సహకరించారు. నేను సీఎస్ కోర్సును పాత సిలబస్ ప్రకారం చదివాను అని చెప్తున్నాడు.
-ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ అనేది నేను అస్సలు ఊహించలేదు. నిజానికి నేను పరీక్షల్లో ఒక సబ్జెక్టు సరిగా రాయలేదు. ఆ సబ్జెక్టు పాసైతే ఏదో ఒక ర్యాంకు వస్తుందని భావించానుకానీ ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు. ఫలితాల వెల్లడి రోజు కూడా సీఎస్ ఇన్‌స్టిట్యూట్ వారు ముందుగా మార్కులు విడుదల చేసి, అరగంట తర్వాత ర్యాంకుల జాబితా వెల్లడించారు. సీఎస్ ఎగ్జిక్యూటివ్ పరీక్షలో సాధారణంగా 360 మార్కులు వస్తే పాసైనట్టే. కానీ నాకు 478 మార్కులు వచ్చాయి. మార్కులు ఎక్కువగా రావడంతో మంచి ర్యాంకే వస్తుందనిపించింది. అరగంట తర్వాత వెల్లడైన ర్యాంకుల జాబితాలో నా పేరే మొదట్లో ఉండటం చూసి ఎంత హ్యాప్పీగా ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను ఆనందం వ్యక్తం చేశాడు.
-తను ప్రస్తుతం ఆర్టికల్‌షిప్ చేస్తున్నాడు. సీఏ, సీఎస్ కోర్సులు వీలైనంత త్వరగా పూర్తిచేసి సివిల్స్‌లో రాణించాలనుకుంటున్నానని తెలిపాడు.

సీఎస్ కోర్సు చదవాలనుకునే వారికి సలహాలు

-సీఎస్ చదవాలనుకునే వారు సమయం వృథా చేయకుండా హార్డ్‌వర్క్ చేయాలి. టైమ్ పాస్ చేస్తే ఈ కోర్సు పూర్తిచేయడం కష్టం.
-ఆసక్తితో చదవాలి. లెక్చరర్లు చెప్పే కాన్సెప్ట్స్ ఏకాగ్రతతో వినాలి. లేదంటే ఏదీ అర్థం కాదు.
-కేవలం పరీక్షల కోసం అన్నట్లుగా కాకుండా నాలెడ్జ్ కోసం చదవాలి. ఇది భవిష్యత్తులో ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-సీఎస్ కోర్సును కొంతమంది సొంతంగా ప్రిపేర్ అవుతారు. అలాంటివారు సిలబస్ మొత్తం పూర్తయ్యేలా రోజువారీ ప్రణాళిక తయారు చేసుకుని చదవాలి.
-ఏ రోజు సందేహాలను ఆ రోజే నివృత్తి చేసుకోవాలి. తోటి విద్యార్థులతో డిస్కషన్ చేస్తే ఇంకా మంచిది.
-కోచింగ్ తీసుకునే వారు కోచింగ్ పూర్తికాగానే రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి.

విద్యార్థులు గమనించాల్సిన అంశాలు

-సీఏ/సీఎస్ కోర్సులు చదవాలంటే ముందుగా మనమీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి.
-చదివేటప్పుడుగానీ, పరీక్షలు రాసేటప్పుడుగానీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.
-సీఎస్ ఎగ్జిక్యూటివ్ పరీక్షలు రాయడానికి ముందు మాక్ టెస్టులు, రివిజన్ టెస్టులు రాయడం చాలా అవసరం. రివిజన్ టెస్టులు రాస్తేనే మనం ఎంతవరకు చదివాం, ఎంతమేర సబ్జెక్టులో పట్టు సాధించాం అని తెలుస్తుంది. రివిజన్ సమయంలో థియరీ సబ్జెక్టులకు సంబంధించి కీ పాయింట్స్ అన్నీ ఒక బుక్‌లో నోట్ చేసుకోవాలి. దానివల్ల వాటిని రివైజ్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది.
-కాన్సెప్టువల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. వీలైతే నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఎవరికైనా వివరించాలి. అప్పుడు కాన్సెప్ట్స్ బాగా గుర్తుంటాయి.
-రోజువారీ ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికకు కట్టుబడాలి. ఒకవేళ సీఎస్‌తోపాటు ఇంకో కోర్సుకూడా చదువుతుంటే రెండు కోర్సుల్లో కామన్‌గా ఉండే సబ్జెక్టుల మీద మరింత ఫోకస్ చేయాలి. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాయాలి. పేపర్లన్నీ చక్కగా ప్రజంట్ చేయాలి.
-కొంతమంది విద్యార్థులు పరీక్ష బాగా రాస్తారు. కానీ ప్రశ్నల నంబర్లు కరెక్టుగా వేయక మార్కులు కోల్పోతారు. ఇలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదు.
-ఏదైనా ప్రశ్నకు పూర్తిగా సమాధానం తెలియకపోతే రాయకుండా వదిలేస్తారు. అలాకాకుండా వచ్చినంతవరకు సమాధానం రాస్తే.. కొన్ని మార్కులైనా పొందవచ్చు.

1122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles