బీసీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు


Sat,March 2, 2019 11:12 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్లూఆర్‌ఈఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
WOMEN-STUDENTSs
-కోర్సు: ఇంటర్ ప్రథమ సంవత్సరం
-గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.
-ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉంటాయి.
-బోధనా మాధ్యమం: ఇంగ్లిష్

కాలేజీల వివరాలు..

-బాలికల కళాశాలలు: నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, సంగారెడ్డి, జగదేవ్‌పూర్, ఆదిలాబాద్, ఎల్‌ఎండీ కాలనీ (కరీంనగర్), లంకపల్లి (ఖమ్మం).
-బాలుర కళాశాలలు: చిట్యాల (వనపర్తి), కొడంగల్, మహేశ్వరం, దౌలతాబాద్, కౌడిపల్లి, ధర్మారం, లక్సెట్టిపేట (నిజామాబాద్), కమలాపూర్ (వరంగల్ అర్బన్), శాయంపేట (వరంగల్ రూరల్), బోనకల్ (ఖమ్మం), నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టు (నల్లగొండ).
-అర్హతలు: మార్చి 2019లో పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు లేదా తత్సమానకోర్సు చదువుతున్నవారు అర్హులు.
-నోట్: ఈ కళాశాలల్లో 25 శాతం సీట్లను బీసీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, మిగిలిన 75 శాతం ఇతరులకు కేటాయిస్తారు.
-తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000/-, పట్టణాల్లో రూ.2 లక్షలు మించరాదు.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్
-పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది.
-పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. కాలవ్యవధి రెండున్నర గంటలు.
-అన్ని గ్రూపులకు ఇంగ్లిష్ కామన్, మిగిలిన సబ్జెక్టులు గ్రూపుల వారీగా..
-ఎంపీసీ వారికి మ్యాథ్స్, ఫిజిక్స్. బైపీసీ వారికి బయాలజీ, ఫిజికల్ సైన్స్. ఎంఈసీ, సీఈసీ వారికి మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కులు.
-నోట్: గురుకుల కళాశాలల్లో సూపర్-100 ఇంటెన్సివ్ బ్యాచ్ ద్వారా ఐఐటీ, నీట్, ఎంసెట్ కోర్సులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తారు. అదేవిధంగా సీఏ/సీపీటీ, క్లాట్ కోచింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.200/-
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
-ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ: ఏప్రిల్ 21 (ఉదయం 10 నుంచి 12:30 వరకు)
-వెబ్‌సైట్: mjptbcwreis.cgg.gov.in

709
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles