ఐఐఎస్సీలో పీజీ ప్రవేశాలు


Fri,February 8, 2019 01:51 AM

బెంగళూరులోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 2019-20 విద్యాసంవత్సరానికి రిసెర్చ్ ప్రోగ్రాం, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
STUDENTS-EMAGE
-రిసెర్చ్ ప్రోగ్రామ్స్ (పీహెచ్‌డీ, ఎంటెక్ రిసెర్చ్)
-విభాగాలు: పీహెచ్‌డీ ఇన్ సైన్స్, ఎంటెక్ రిసెర్చ్ అండ్ పీహెచ్‌డీ ఇన్ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ ఇన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియాలు.
-అర్హత: నాలుగేండ్ల ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషల్ వర్క్, సైకాలజీ, మేనేజ్‌మెంట్, కామర్స్, ఆపరేషన్స్ రిసెర్చ్, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్), పీజీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ సైన్సెస్), ఎంఎస్/ఎంబీఏ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్/ఎండీ, బీఫార్మసీ, బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న గేట్ స్కోర్/నెట్ జేఆర్‌ఎఫ్, జీప్యాట్‌లో అర్హత సాధించాలి.
-మాస్టర్ ప్రోగ్రాం (టెక్నాలజీ, డిజైన్, మేనేజ్‌మెంట్)
-అర్హతలు: ఎంటెక్ (మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ) కోర్సుకు.. బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ (సైన్స్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్), ఎంసీఏతోపాటు గేట్ స్కోర్ ఉండాలి.
-మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం. డిజైన్) కోర్సుకు.. ఇంజినీరింగ్/టెక్నాలజీ, డిజైన్, ఆర్కిటెక్చర్‌లో డిగ్రీతో పాటు గేట్ స్కోర్/సీఈఈడీ స్కోర్ ఉండాలి.
-మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎం.ఎంజీటీ) కోర్సుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న గేట్ స్కోర్/క్యాట్, సీమ్యాట్ స్కోర్ ఉండాలి.
-ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్)
-అర్హత: బీఎస్సీ (బయాలజికల్, కెమికల్, ఫిజికల్ మ్యాథమెటికల్), బ్యాచిలర్ డిగ్రీ (ఫార్మసీ, వెటర్నరీ, అగ్రికల్చర్) ఉత్తీర్ణత. జామ్/జెస్ట్‌లో అర్హత సాధించాలి.
-ఈఆర్‌పీ ప్రోగ్రామ్
-అర్హత: ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ (ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, వెటర్నరీ)
-ఎంపిక: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 800/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400/- , ఈఆర్‌పీ ప్రోగ్రామ్‌కు రూ. 2000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 25
-వెబ్‌సైట్: www.iisc.ac.in

1396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles