ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు


Wed,February 6, 2019 01:59 AM

rfcl
న్యూఢిల్లీలోని ఎన్‌ఎఫ్‌ఎల్-రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్
- మొత్తం పోస్టులు: 53 (జనరల్-28, ఓబీసీ-14, ఎస్సీ-8, ఎస్టీ-3)
- అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచిలో గేట్ స్కోర్ -2016లో అర్హత సాధించాలి.
- సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
- వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- పేస్కేల్: రూ. 9,000-16,400/- డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్, తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
- దరఖాస్తు ఫీజు: రూ. 200/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
- పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, రామగుండం, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 17 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 15
- చివరితేదీ: మార్చి 14
- వెబ్‌సైట్: www.nationalfertilizers.com

741
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles