జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2018


Tue,February 5, 2019 01:18 AM

ssc
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల కోసం నిర్వహించే జేఈ ఎగ్జామినేషన్-2018 ప్రకటన విడుదలైంది.

- పోస్టు: జూనియర్ ఇంజినీర్ (గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్)
- పేస్కేల్:రూ. 35,400-1,12,400/-
- విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్.
- సంస్థల వారీగా పోస్టులు: సెంట్రల్ వాటర్ కమిషన్- జేఈ (సివిల్, మెకానికల్), సీపీడబ్ల్యూడీ-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్-జేఈ (సివిల్), మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్), ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్టు- జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్-జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ), డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్)-జేఈ (ఎలక్ట్రికల్, మెకానికల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్).

నోట్: ఖాళీల సంఖ్యను తర్వాత ప్రకటిస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.
- వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి సీడబ్ల్యూసీ, సీపీడబ్ల్యూడీ శాఖలకు 32 ఏండ్లు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు 27 ఏండ్లు, ఎంఈఎస్, నేవల్, సీడబ్ల్యూపీఆర్, ఎన్‌టీఆర్‌వో శాఖల్లో పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- విద్యార్హతలు: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. క్వాంటిటీ సర్వేయింగ్&కాంట్రాక్ట్స్ పోస్టులకు మూడేండ్ల సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ (ఇండియా) నుంచి బిల్డింగ్స్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్ డివిజన్-2 ఇంటర్ ఎగ్జామ్ ఉత్తీర్ణులు. కొన్ని పోస్టులకు అనుభవం ఉండాలి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పరీక్ష విధానం:
- రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్), పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50, జనరల్ అవేర్‌నెస్-50, జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీ)-100. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు.
- పేపర్-2 జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీ)-300 మార్కులు. కాలవ్యవధి రెండు గంటలు.

ముఖ్యతేదీలు:
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 25
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి

చివరితేదీ: ఫిబ్రవరి 27
- పేపర్-1 ఎగ్జామ్: సెప్టెంబర్ 23-27
- పేపర్-2 ఎగ్జామ్: 2019, డిసెంబర్ 29
- వెబ్‌సైట్: https://ssc.nic.in

1367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles