ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ


Tue,February 5, 2019 01:12 AM

INDIAN-ARMY
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం (46వ కోర్సు) కింద ఎన్‌సీసీ సర్టిఫికెట్ కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (46 వ కోర్సు)- అక్టోబర్ 2019
- మొత్తం ఖాళీలు -55 (ఎన్‌సీసీ మెన్ - 50, ఎన్‌సీసీ ఉమెన్ - 5)
- అర్హతలు: ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతోపాటు ఎన్‌సీసీలో సీనియర్ డివిజన్‌లో కనీసం రెండు ఏండ్లపాటు సర్వీస్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బీ లేదా సీ సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
- వయస్సు: 2019 జూలై 1 నాటికి 19 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
- ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపికైన వారిని రెండు అంచెల పద్ధతిలో పరీక్షించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
- చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణను పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఫిబ్రవరి 7
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

843
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles