ది గైడ్‌ చాలెంజింగ్ కెరీర్


Mon,February 4, 2019 02:12 AM

బిజీబిజీగా జీవితం గడుపుతున్న మనం మనసు ప్రశాంతత కోసం ఏదైనా ప్రాంతాన్ని లేదా చారిత్రక ప్రదేశాన్ని సందర్శిస్తుంటాం. కానీ వాటి గురించి మనకు సరిగా సమాచారం ఉండదు. కాబట్టి వాటి గురించి తెలిసిన గైడ్‌ల అవసరం చాలా ఉంటుంది. ఆ ప్రాంతం, ప్రదేశాన్ని వారు మనకు క్షుణ్ణంగా వివరిస్తారు. టూరిజం పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో టూరిస్ట్ గైడ్‌లకు సంబంధించి కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గైడ్‌కు సంబంధించిన వివరాలు నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం.
guide

గైడ్ అంటే?

-ఏదైనా ప్రాంతం లేదా చారిత్రక ప్రదేశం గురించి, వాటి వివరాలు, కాలాలు, ప్రత్యేకతలు వివరించే వారినే గైడ్‌లు అంటారు. టూరిజం పరిశ్రమకు సంబంధించినది కాబట్టి టూరిస్ట్ గైడ్‌లు అని కూడా అంటారు. సంతోషంతో పాటు సవాలుతో కూడుకుని ఉంటుంది ఈ ఉద్యోగం.
-ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూ సంపాదించాలనుకునేవారు, ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ప్రయాణించాలనుకునేవారు, ప్రపంచంలోని చారిత్రక స్థలాలు, వేర్వేరు సంస్కృతుల గురించి తెలుసుకునేవారు ఈ కోర్సు చదవవచ్చు.

నైపుణ్యాలు

-గైడ్‌కు స్నేహపూర్వక వ్యక్తిత్వంతో పాటు పర్యాటకులకు నచ్చి న భాషలో ఆకట్టుకునేవిధంగా వివరించే నేర్పు, వారిని తమ మాటలతో కంట్రోల్ చేయగల నైపుణ్యం ఉండాలి.
-అంతేకాకుండా పర్యాటకులకు లభించే హాస్పిటాలిటీ, ఇతర సౌకర్యాలు, సేవల గురించి తెలపడంతో పాటు సంస్థాగత నైపుణ్యం కూడా ఉండాలి.
-టైమ్ మేనేజ్‌మెంట్, పరిశోధనలో నైపుణ్యంతో పాటు అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
-వీటితోపాటు వివిధ రకాల మనస్తత్వంగల పర్యాటకులకు నచ్చే విధంగా వివరిచంగల ఓర్పు, సహనం ఉండాలి. వారు అడిగిన ప్రతిదానికి విసుగు చెందకుండా ఉండాలి.

కోర్సులు - సంస్థలు

బీఏ (ఆనర్స్) ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం
-ఈ కోర్సును గార్డెన్ సిటీ యూనివర్సిటీ (బెంగళూరు), జీడీ గోయెంకా యూనివర్సిటీ (గుర్‌గావ్-హర్యానా), క్రిష్‌నాథ్ కాలేజ్ (బెర్హంపూర్-పశ్చిమ బెంగాల్), నలంద ఓపెన్ యూనివర్సిటీ (పాట్నా-బీహార్), ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ) కాలేజీలు అందిస్తున్నాయి.

బీఏ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిజం బిజినెస్

-ఈ కోర్సు ఐఐఎస్ యూనివర్సిటీ-ఇంటర్నేషన్ కాలేజ్ ఫర్ గర్ల్స్ (జైపూర్-రాజస్థాన్) కాలేజీల్లో అందుబాటులో ఉంది.

బీఏ టూరిజం స్టడీస్

-ఈ కోర్సును ఏఈటీ కాలేజ్ (బెంగళూరు), ఆంబిషన్ పాయింట్ అకాడమీ (కోల్‌కతా), అమైటీ యూనివర్సిటీ (ముంబై, నోయిడా), బీఎం రుయా గర్ల్స్ కాలేజ్ (ముంబై), బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ-ఉత్తరప్రదేశ్), డీఎల్‌వీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), డా. బీఆర్ అంబేద్కర్ ఫస్ట్ గ్రేడ్ ఈవినింగ్ కాలేజ్, గార్డెన్ సిటీ కాలేజ్, గార్డెన్ సిటీ యూనివర్సిటీ (బెంగళూరు) కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి.

బీఏ ట్రావెల్ అండ్ టూరిజం

-ఈ కోర్సు కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ (శ్రీకాకుళం-ఏపీ), గవర్నమెంట్ తిలక్ పీజీ కాలేజ్ (కట్ని-మధ్యప్రదేశ్), కస్తూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (కోయంబత్తూర్-తమిళనాడు), కవి కులగురు కాళిదాస్ సంస్కృత వర్సిటీ (నాగ్‌పూర్-మహారాష్ట్ర), మహేంద్ర నారాయణ్ చౌదరి బాలికా మహావిద్యాలయ (నల్‌బరి-అసోం), పోకర్ సాహిబ్ మెమోరియల్ ఆర్ఫనేజ్ కాలేజ్ (మళప్పురం-కేరళ), తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ (చెన్నై), యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ (కేరళ) కాలేజీల్లో అందుబాటులో ఉంది.

బీఎస్సీ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్)

-చండీగఢ్ యూనివర్సిటీ (మొహాలి-పంజాబ్), మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అటామనస్ (చెన్నై), నలంద కాలేజ్ (బీహార్), పటియాలా ఏవియేషన్ క్లబ్ (పంజాబ్), క్వీన్ మేరీస్ కాలేజ్ అటానమస్ (చెన్నై), ఆర్‌ఐఎంటీ యూనివర్సిటీ (గోవింద్‌గర్-పంజాబ్), రాయల్ గ్లోబల్ వర్సిటీ (గువాహటి-అసోం), శ్రీరాం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (తిరువల్లూర్-తమిళనాడు), యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (మొహాలి-పంజాబ్) కాలేజీల్లో ఈ కోర్సు ఉంది.

బీబీఏ (ఆనర్స్) ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్

-బెంగాల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (హుగ్లీ-పశ్చిమ బెంగాల్), సీజడ్ పటేల్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ (వల్లభ్ విద్యానగర్-గుజరాత్), హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (చెన్నై) కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బీ వొకేషనల్ (టూరిజం)

-ఈ కోర్సును సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్ము (జమ్ముకశ్మీర్), చండీగఢ్ యూనివర్సిటీ (మొహాలి-పంజాబ్), జగన్నాథ్ యూనివర్సిటీ (జైపూర్-రాజస్థాన్), కేకే యూనివర్సిటీ (నలంద, బీహార్), సిక్కిం వర్సిటీ (గ్యాంగ్‌టక్-సిక్కిం), సోనాపూర్ కాలేజ్ (గువాహటి-అసోం), సెయింట్ జేవియర్ కాలేజ్ (ముంబై) తదితర కాలేజీలు అందిస్తున్నాయి.

ఎంఏ (టూరిజం అడ్మినిస్ట్రేషన్)

-అలహాబాద్ స్టేట్ వర్సిటీ (అలహాబాద్-ఉత్తరప్రదేశ్), అమైటీ యూనివర్సిటీ (జైపూర్, కోల్‌కతా, నోయిడా), డా.రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ (ఫైజాబాద్-ఉత్తరప్రదేశ్), గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ (కోయంబత్తూర్-తమిళనాడు), క్వీన్ మేరీస్ కాలేజ్ అటానమస్ (చెన్నై), రీజినల్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (భువనేశ్వర్-ఒడిశా), సాయి అకాడమీ (నోయిడా-ఉత్తరప్రదేశ్), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) తదితర కాలేజీల్లో ఈ కోర్సు ఉంది.

ఎంబీఏ (ఎకోటూరిజం)

-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నికల్ స్టడీస్ (నోయిడా-ఉత్తరప్రదేశ్), స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (పటియాలా-పంజాబ్), ది గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ (దిమాపూర్-నాగాలాండ్) తదితర కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

ఎంకాం (టూరిజం అడ్మనిస్ట్రేషన్)

-ఈ కోర్సు బెంగళూరు యూనివర్సిటీలో ఉంది.

ఎమ్మెస్సీ (ఎకోటూరిజం)

-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (న్యూఢిల్లీ), ది గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ (దిమాపూర్-నాగాలాండ్), వీపీజీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చెన్నై) కాలేజీల్లో ఈ కోర్సు ఉంది.

ఎంఫిల్ (టూరిజం)

-అన్నా ఆదర్శ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (చెన్నై), బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ-ఉత్తరప్రదేశ్), సీహెచ్‌ఆర్‌ఐఎస్‌టీ డీమ్డ్ వర్సిటీ (బెంగళూరు), మదర్ థెరిసా ఉమెన్స్ యూనివర్సిటీ (కొడైకెనాల్) తదితర కాలేజీల్లో ఈ కోర్సు ఉంది.

డిప్లొమా ఇన్ టూరిస్ట్ గైడ్

-ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (హైదరాబాద్), ఎఫర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, సాయి ఎడ్యకేషన్ సెల్ (న్యూఢిల్లీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ (ఉదయ్‌పూర్-రాజస్థాన్), కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

సర్టిఫికెట్ ఇన్ టూరిస్ట్ గైడెన్స్

-కమర్‌గావ్ కాలేజ్ (గోళఘాట్-అసోం) ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది.
-హైదరాబాద్‌లోని ఫ్ల్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్, జరో ఎడ్యుకేషన్-వెలింగ్‌కార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, డా. వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ వంటి పలు ప్రైవేట్ సంస్థల్లో టూర్ గైడ్, ట్రావెల్ టూరిజంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉపాధి

-టూర్ గైడ్ వృత్తి విస్తృతమైనది. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో గైడ్‌ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే పర్యాటకులు సందర్శించే ప్రాంతం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి టూరిస్ట్ గైడ్ కోర్సులు చేసినవారికి త్వరగా ఉపాధి లభిస్తుంది.
-ప్రపంచ దేశాలను చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. వారికి ఆ దేశంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలు, సంస్కృతుల గురించి క్షుణ్ణంగా తెలిసిన గైడ్‌ల అవసరం ఉంటుంది. దీంతో టూరిజం శాఖలు, ట్రావెల్ ఏజెన్సీలు గైడ్‌లకు మంచి వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి.
-మధ్యప్రదేశ్, గోవా, ఉత్తరప్రదేశ్, వివిధ రాష్ర్టాల పర్యాటక అభివృద్ధి సంస్థలతో పాటు ఇండియా టూరిజం డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ (ఐఐటీడీ) లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
-ప్రతి దేశం పర్యాటక ఆదాయాన్ని పెంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించాలంటే ముఖ్యంగా వారికి కావాల్సింది భద్రత.
-అందుకే ఆయా దేశాలు, రాష్ర్టాల పర్యాటక మంత్రిత్వ శాఖలు గైడ్‌లకు లైసెన్సులను ఇస్తున్నాయి. అంతేకాకుండా ప్రాంతీయంగా గైడ్ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి.
-ది గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ యాక్ట్-1982 ప్రకారం గైడ్‌లు అక్కడి జోనల్ ఆఫీసుల్లో నమోదు చేసుకోవాలి.

ఉద్యోగ హోదాలు

-గైడ్ కోర్సు పూర్తిచేసినవారు టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, రవాణా సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వెంచర్ అండ్ లీజర్ టూరిజం ప్రొవైడర్స్, టూర్ ఆపరేటర్ ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ, అవుట్‌బాండ్ టూర్ ఎగ్జిక్యూటివ్, ట్రావెల్ ఏజెన్సీ స్టాఫ్, టూర్ కన్సల్టెంట్, ట్రావెల్ కన్సల్టెంట్, ఫ్రీలాన్స్ టూర్ మేనేజర్/టూర్ గైడ్, ఎగ్జిక్యూటివ్ ఇన్‌బౌండ్ టూర్, టూర్ ఆపరేషన్స్ మేనేజర్, టూరిజం ఆఫీసర్, ట్రావెల్ ఏజెంట్స్, ఎయిర్‌లైన్ ఎంప్లాయీ/ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, టూరిజం ప్రమోటర్/మార్కెటర్, టికెటింగ్ స్టాఫ్ వంటి వివిధ హోదాల్లో ఉపాధి లభిస్తుంది.

బ్యాచిలర్ ఆఫ్ టూరిజం స్టడీస్

-అడ్వాన్స్‌డ్ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), అల్ అమీన్ కాలేజ్ ఎదతల (ఎర్నాకుళం-కేరళ), అల్ అజార్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, హోలిక్రాస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, జేపీఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఇడుక్కి-కేరళ), బిషప్ వయలిల్ మెమోరియల్ హోలి క్రాస్ కాలేజ్ (కొట్టాయం-కేరళ), బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ-ఉత్తరప్రదేశ్), హిమాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (నైనిటాల్-ఉత్తరాఖండ్), ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) తదితర కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

guide2

బీబీఏ ఎయిర్ ట్రావెల్ మేనేజ్‌మెంట్

ఏషియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (అహ్మదాబాద్-గుజరాత్) కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స్

పటియాలా ఏవియేషన్ క్లబ్, (పటియాలా-పంజాబ్), టీఎంఐ అకాడమీ ఆఫ్ ట్రావెల్, టూరిజం అండ్ ఏవియేషన్ స్టడీస్ (జైపూర్-రాజస్థాన్), ట్రేడ్ వింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (న్యూఢిల్లీ, ఛతర్‌పూర్-మధ్యప్రదేశ్, కటక్-ఒడిశా, బెంగళూరు, ఔరంగాబాద్-మహారాష్ట్ర, పుణె-మహారాష్ట్ర, జలంధర్-పంజాబ్, జమ్ముకశ్మీర్) కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

బీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్

-ఈ కోర్సును ఏబీఎస్ అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బర్ధమన్-పశ్చిమబెంగాల్), అగర్‌చంద్ మన్ముల్ జైన్ కాలేజ్, అన్నా ఆదర్శ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (చెన్నై), ఏబీ అబ్దురహిమాన్ హాజి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, బైతుల్ ఇజ్జా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (కోజికోడ్-కేరళ), చరణ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (ఈరోడ్-చెన్నై), కొలంబస్ ట్రావెల్ అకాడమీ (ముంబై, పుణె-మహారాష్ట్ర, రాజ్‌కోట్-గుజరాత్) కాలేజీలు అందిస్తున్నాయి.

బీకాం (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్)

-బేసిలియోస్ పౌలోస్ సెకండ్ కాలేజ్, సీఈటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎర్నాకుళం-కేరళ), భోపాల్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్, కెరీర్ కాలేజ్ (భోపాల్), సీహెచ్‌ఎంఎం కాలేజ్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, ఇమ్మాన్యుయేల్ కాలేజ్ (తిరువనంతపురం-కేరళ), సీహెచ్‌ఆర్‌ఐఎస్‌టీ-డీమ్డ్ యూనివర్సిటీ (బెంగళూరు, త్రివేండ్రం-కేరళ), డీఏవీ సెంటినరీ కాలేజ్ (ఫరీదాబాద్-హర్యానా), గవర్నమెంట్ పీజీ కాలేజ్ (భోపాల్-మధ్యప్రదేశ్) ఈ కోర్సును అందిస్తున్నాయి.
-సత్యం చాపల

1504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles