బిట్‌శాట్-2019


Mon,February 4, 2019 02:12 AM

ఐఐటీ, నిట్‌ల తర్వాత అంత క్రేజ్ ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జామ్ బిట్‌శాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ&సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్). ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ టెస్ట్ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో బీఈ/బీటెక్, బీఫార్మా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రామాణికమైన విద్య, పక్కా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తో బిట్స్ పేరుగాంచింది.
bits
-జేఈఈ మెయిన్ పర్సంటైల్ స్కోర్ ప్రకటించారు. విద్యార్థులకు వారి స్థితి గురించి ఒక ఐడియా వచ్చింది. 90 పర్సంటైల్ కంటే ఎక్కువ వచ్చినవారికి బిట్‌శాట్‌లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బిట్‌శాట్ ఎగ్జామ్‌కు ఇంకా మూడున్నర నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పక బిట్స్‌లో సీటు సాధించవచ్చు.
-నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత విధిస్తారు.
-బోనస్ ప్రశ్నలు: మొత్తం 150 ప్రశ్నలకు సమాధానం గుర్తించినవారికి 12 ప్రశ్నలు అదనంగా ఇస్తారు. ఇది అభ్యర్థికి ఆప్షన్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథ్స్ నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున ఇస్తారు. ఈ ఆప్షన్ ఎన్నుకున్న తర్వాత మొద ట గుర్తించిన 150 ప్రశ్నల కరెక్షన్ చేసుకునే వీలు ఉండదు.
-సిలబస్: ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ప్రకారం ఉంటుంది.
-పరీక్ష తేదీలు: మే 16 నుంచి 26 మధ్య ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
బిట్‌శాట్-జేఈఈ మెయిన్ మధ్య తేడా
-బిట్‌శాట్‌లో 150 ప్రశ్నలు - 180 నిమిషాల్లో పూర్తిచేయాలి. అదే జేఈఈ మెయిన్‌లో కేవలం 90 ప్రశ్నలు -180 నిమిషాలు. చిన్నప్రశ్నలు, సులభంగా ఉండేవాటిని త్వరత్వరగా గుర్తించుకుంటూ వెళ్లితేనే ఎక్కువ మార్కులు సాధించగలరు.

టైం మేనేజ్‌మెంట్

-2018 కటాఫ్ ప్రకారం చాలా తక్కువ కటాఫ్ 260 మార్కులు. అంటే మీరు కనీసం 100 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తిస్తేనే పిలానీ క్యాంపస్‌లో మంచి బ్రాంచీ సాధించగలరు. కాబట్టి విద్యార్థులకు తప్పనిసరిగా టైం మేనేజ్‌మెంట్ అనేది చాలా కీలకం. ఎవరైతే వేగంగా, కచ్చితమైన జవాబులను గుర్తిస్తారో వారే విజయం సాధిస్తారు.

No time to go back

-ప్రశ్నలకు సమాధానం గుర్తించి వాటిని తిరిగి రివ్యూ లేదా కొన్ని ప్రశ్నలకు తర్వాత సమాధానం గుర్తించాలనుకుంటే కష్టమే. మొదటిసారే మీకు సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలో సమస్యను సాల్వ్ చేయండి. రెండోసారి ఆ ప్రశ్న దగ్గరకు వచ్చే అవకాశం దాదాపుగా ఉండదు. అదేవిధంగా జవాబులను తిరిగి చెక్ చేసుకునే అవకాశం కూడా ఉండదు.

కచ్చితత్వం తప్పనిసరి

-జవాబులను గుర్తించేటప్పుడు నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్న విషయాన్ని మరువద్దు. కచ్చితమైన సమాధానాలను మాత్రమే గుర్తించండి.

bits2

ఇంగ్లిష్, లాజికల్ రీజినింగ్

-ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. మీరు ఇంగ్లిష్ మీడియం నుంచి వచ్చిన వారైతే ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎక్కువ ప్రశ్నలకు ఎటువంటి కష్టం లేకుండా సమాధానాలు గుర్తించగలరు. ఇక లాజికల్ రీజనింగ్ కోసం పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డైరక్షన్ టెస్ట్‌లు, కోడింగ్, డికోడింగ్, నంబర్ సిరీస్ , ప్యాట్రన్ రికగ్నైజేషన్ తదితర అంశాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ రెండు అంశాల జవాబులను ఎంత వేగంగా, కచ్చితంగా గుర్తిస్తారో అంతగా మీరు విజయం దిశగా అడుగువేసినట్లే. ఇక్కడ ఆదా అయిన సమయం మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది.

ఏ విధంగా ప్రిపేర్ కావాలి?

-మార్చి 14 వరకు మీరు ఇంటర్ పరీక్షలతో బిజీగా ఉంటారు. మార్చి 14 నుంచి మే బిట్‌శాట్ వరకు సుమారు రెండునెలల సమయం ఉంటుంది. ఐపీఈ ప్రిపేరయ్యే సమయంలో సెకండియర్ సబ్జెక్టులు రివిజన్ అయినట్లే. అయితే వీటికోసం కొంచెం కష్టపడితే చాలు. కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కొంత ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు భవిష్యత్‌లో సమయం ఆదా అవుతుంది.

మార్చి 15 నుంచి

-మార్చి 15 నుంచి సుమారు మూడువారాలు మీరు జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటారు. అయితే బిట్‌శాట్, జేఈఈ సిలబస్ దాదాపుగా ఒక్కటే కాబట్టి మీకు కలిసి వస్తుంది. రెండు ఆన్‌లైన్ పరీక్షలే కాకపోతే పరీక్ష విధానంలో మార్పులు ఉన్నాయి.

జేఈఈ మెయిన్ తర్వాత

-జేఈఈ మెయిన్ తర్వాత సుమారు ఐదువారాల సమయం ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రాక్టీస్ వేగాన్ని పెంచుకోవాలి. చాప్టర్ల వారీగా బిట్‌శాట్ స్టాండర్డ్ టెస్ట్‌లను మొదటి 3-4 వారాలు రాయాలి. ప్రతిరోజు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్‌ల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. చివరి రెండువారాలు గ్రాండ్ టెస్ట్‌లను రాయండి. కనీసం ఐదు గ్రాండ్ టెస్ట్‌లు రాస్తే మంచిది.

చివరివారంలో

-చివరివారంలో మ్యాథ్స్‌లో సినాప్సిస్, ఫార్ములాలను చదువుకోండి. బేసిక్స్ జోలికి వెళ్లకండి. చివరివారంలో కనీసం రెండు గ్రాండ్ టెస్ట్‌లను రాయండి. సబ్జెక్టుల వారీగా టెస్ట్‌లను రాస్తే మంచిది.

చివరగా

-బిట్‌శాట్ చాలా కష్టమైన పరీక్ష కాదు. ప్రశాంతంగా కచ్చితమైన జవాబులను గుర్తించడం ప్రధానమైన విషయం. సరైన దిశలో ప్రాక్టీస్ మిముల్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్తుంది. వేగం, కచ్చితత్వంపై దృష్టి పెట్టండి. విజయం మీ సొంతం అవుతుంది.

స్మార్ట్ ఆన్సరింగ్

-కెమిస్ట్రీకి 30 -35 నిమిషాలు మించి సమయం తీసుకోకూడదు. ఏ ప్రశ్నకైనా 30 సెకండ్లకు మించి క్యాలిక్యులేషన్ చేయకూడదు. మ్యాథ్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. మ్యాథ్స్‌కు కనీసం 60 - 80 నిమిషాలు సమయం పడుతుంది. మిగిలిన సమయాన్ని ఫిజిక్స్, ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్‌లో ఆదా చేసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కాబట్టి చిన్నప్రశ్నలను సాల్వ్ చేయడం తెలివైన పని. పెద్ద (లెంథీ) ప్రశ్నల కోసం సమయం వృథా చేయవద్దు. ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్‌లకు ఎటువంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు కేవలం అనాలసిస్ మాత్రమే అవసరం. ఈ రెండు సబ్జెక్టులకు 30 నిమిషాలు మించకుండా సమాధానాన్ని గుర్తిస్తే సరిపోతుంది.

ఆన్‌లైన్ టెస్ట్ ప్రాక్టీస్ తప్పనిసరి:

-పరీక్షలో విజయం సాధించడానికి ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌ను రాయండి. వీలైనన్ని ఎక్కువ బిట్‌శాట్ మాక్‌టెస్ట్‌లను రాయండి. దీనివల్ల మీ లోటుపాట్లు తెలిసి పరీక్షలో ఆ తప్పులు చేయకుండా సరైనా విధంగా జవాబులు గుర్తించగలరు.
-బోనస్ ప్రశ్నలు: ఇవి చాలా సులభంగా ఉంటాయి. వీటికి సంబంధించి 36 మార్కులను సొంతం చేసుకోవచ్చు. అయితే మొదట 150 ప్రశ్నల జవాబులను సబ్మిట్ చేసిన తర్వాతే బోనస్ ప్రశ్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. వీటికి కూడా నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
bits3
srinivas

1069
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles