పీఎన్‌బీలో 325 ఆఫీసర్ పోస్టులు


Sat,February 2, 2019 11:09 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (సీనియర్ మేనేజర్, మేనేజర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ecil-students
-మొత్తం ఖాళీలు: 325 (జనరల్-165, ఓబీసీ-84, ఎస్సీ-51, ఎస్టీ-25)
-విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్, హెచ్‌ఆర్‌డీ/హెచ్‌ఆర్‌ఎం, లేబర్ లా విభాగాల్లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం (పైనాన్స్), బ్యాచిలర్ డిగ్రీ (లా), బీఈ/బీటెక్ (ఈసీఈ, సీఎస్‌ఈ/ఐటీ), ఎంసీఏతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21 నుంచి 28 ఏండ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25 నుంచి 32 ఏండ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: సీనియర్ మేనేజర్ (క్రెడిట్/లా) పోస్టులకు రూ.42,020-51,490/- ఆఫీసర్ (ఐటీ ) పోస్టులకు రూ. 23, 700-42,020 మిగతా పోస్టులకు రూ. 31,705-45,950/-
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ రాతపరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సంబంధిత పోస్టును బట్టి). ప్రతి సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
-ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 17
-వెబ్‌సైట్: www.pnbindia.in

1267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles