సెయిల్‌లో 275 ఖాళీలు


Wed,January 30, 2019 10:53 PM

SAIL
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఆపరేటర్, అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ
- ఖాళీల సంఖ్య -95
- ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-20, మెకానికల్-25, మెటలర్జీ-35, కెమికల్-5, సిరామిక్స్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-5 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల ఫుల్‌టైం ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
- పోస్టు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)
- ఖాళీల సంఖ్య -10
- అర్హతలు: పదోతరగతితోపాటు ఫుల్‌టైం మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు ప్రథమశ్రేణిలో బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉత్తీర్ణత.
- పోస్టు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ
- ఖాళీల సంఖ్య -121
- అర్హతలు: పతోతరగతితోపాటు ఎన్‌సీటీవీ నిర్వహించిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ చేసి ఉండాలి.
- పోస్టు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ

- ఖాళీల సంఖ్య -49 (ఎలక్ట్రీషియన్-12, మెషినిస్ట్-8, వెల్డర్-7, ఫిట్టర్-12, రిగ్గర్-10)
- అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: ఫిబ్రవరి 18 నాటికి అపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు 28 ఏండ్లు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) పోస్టుకు 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- శారీరక ప్రమాణాలు: పురుషులు కనీసం 150 సెం.మీ. ఎత్తు, 45 కేజీల బరువు ఉండాలి. మహిళలు కనీసం 143 సెం.మీ. ఎత్తు, 35 కేజీల బరువు ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. రాతపరీక్షలో జనరల్ అభ్యర్థులకు 50 పర్సంటైల్ స్కోర్, మిగిలిన క్యాటగిరీలకు 40 పర్సంటైల్ స్కోర్ అర్హతగా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి స్కిల్‌టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- ప్రొబేషనరీ పీరియడ్: ట్రెయినీ పోస్టులకు రెండేండ్లు, ఇతర పోస్టులకు ఏడాది ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణిస్తారు.
- స్టయిఫండ్: శిక్షణ సమంయలో మొదటి ఏడాది నెలకు రూ.10,700/, రెండో ఏడాది రూ.12,200/- స్టయిఫండ్ ఇస్తారు. తర్వాత ఆయా పేస్కేల్స్ ప్రకారం జీతభత్యాలు ఇస్తారు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఫీజు: అపరేటర్ పోస్టులకు రూ.250, అటెండెంట్ పోస్టులకు రూ.150/-చెల్లించాలి.
- చివరితేదీ: ఫిబ్రవరి 18
- వెబ్‌సైట్: www.sail.co.in.

1343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles