ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ 2019


Fri,January 11, 2019 01:05 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) & నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)-2019కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
indian-army
-మొత్తం పోస్టులు: 392
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 342 ఖాళీలు (ఇండియన్ ఆర్మీ-208, ఇండియన్ నేవీ-42, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-92)
-ఇండియన్ నేవల్ అకాడమీ-50 ఖాళీలు (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
-అర్హతలు: ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ) విభాగానికి.. ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్ష. ఎయిర్ ఫోర్స్/నేవల్ (ఎన్‌డీఏ)/ఇండియన్ నేవల్ అకాడమీ విభాగానికి.. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 10+2లో ఉత్తీర్ణత. ఇంటర్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

శారీరక ప్రమాణాలు:

-ఎత్తు: 157.5 సెంటీమీటర్లు, (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 162.5 సెంటీమీటర్లు). ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండాలి.
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో.. 15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి..స్కిప్పింగ్,3-4 మీటర్ల రోప్ ైక్లెంబింగ్, 20 ఫుష్ అప్‌లు, 8 చిన్‌అప్‌లు చేయాలి.
-ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతిఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు.
-వయస్సు: 2 జూలై 2000 నుంచి 1 జూలై 2003 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- జనరల్/ఓబీసీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-జీతభత్యాలు: రూ. 56,100/- శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
-రాతపరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. దీనిలో పేపర్-1 (మ్యాథమెటిక్స్)-300 మార్కు లు, పేపర్-2 (జనరల్ ఎబిలిటీ టెస్ట్)- 600 మార్కులు, ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
-ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూకు 900 మార్కులు.
-మొత్తం (రాతపరీక్ష+ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ) -1800 మార్కులకుగాను అత్యధిక ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రెయినింగ్ ఇస్తారు.
-ఎంపికైన అభ్యర్థులలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన వారికి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంచే ఆర్మీ క్యాడెట్స్-బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్)/ బీఏ, నేవల్ క్యాడెట్స్ - బీటెక్, ఎయిర్ పోర్స్ క్యాడెట్స్ - బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఫిబ్రవరి 4 (సాయంత్రం 6 గంటల వరకు)
-రాతపరీక్ష: ఏప్రిల్ 21
-వెబ్‌సైట్: www.upsc.gov.in

751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles