న్యాయవిద్య @ నయాదిల్లీ నేషనల్ లా యూనిర్సిటీ-అడ్మిషన్స్


Wed,January 9, 2019 02:02 AM

law
న్యాయవిద్య అతిపురాతనమైన శాస్త్రం. మానవుడు అభివృద్ధి చెందుతున్న కొద్ది తన చుట్టూ కొన్ని నియమనిబంధనలు,చట్టాలు, న్యాయం, ధర్మం అనే అంశాలను ఏర్పర్చుకున్నాడు. బలహీనులను బలవంతులు దోచుకోకుండా కాపాడే వ్యవస్థల్లో న్యాయస్థానాలు కీలకం. ఇటీవల కాలంలో జిల్లాస్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు న్యాయస్థానాల పాత్ర పెరుగుతున్నది. అంతేకాకుండా న్యాయశాస్త్ర పట్టబద్రులకు కార్పొరేట్ కంపెనీలు సైతం భారీవేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. లా కోర్సులకు పలు పేరొందిన కాలేజీలు ఉన్నాయి. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ. ఇక్కడ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా...

- ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ: నేషనల్ లా యూనివర్సిటీని ఢిల్లీలో 2008లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభిచారు. 2010లో ఎన్‌ఎల్‌యూ పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది.

law1

పీజీ డిప్లొమాలు

- అర్బన్ ఎన్విరాన్‌మెంటల్ లా & మేనేజ్‌మెంట్
- టూరిజం అండ్ ఎన్విరాన్‌మెంటల్ లా
- సర్టిఫికెట్ & డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ కాంపిటీషన్ & పాలసీ
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) ద్వారా
అర్హతలు: బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) పరీక్షకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత/ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా పరీక్ష రాయవచ్చు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు ఎల్‌ఎల్‌ఎంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు. 150 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
- ఇంగ్లిష్, జీకే, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథ్స్‌పై ప్రశ్నలు ఇస్తారు.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.

ముఖ్యతేదీలు:

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 8
- ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: మే 5 (మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు)
- వెబ్‌సైట్: https://nludelhi.ac.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

719
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles