పదసంపదపై పట్టు


Wed,January 9, 2019 01:22 AM

ప్రస్తుతం ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ప్రతి ప్రొఫెషనల్‌కు అత్యంత ఆవశ్యకమైనది. అయితే భాషలో అనర్గలంగా మాట్లాడాలంటే ఆ భాషలోని పదసంపదపై పట్టు చాలా అవసరం. అందుకోసమే నిపుణ పాటకులకు ఈ వ్యాసం అందిస్తున్నాం...
- Boycott (బహిష్కరణ): భారత జాతీయవాదం (Indian nationalism) క్రమంగా బలపడుతున్నవేళ బ్రిటిష్ పాలకులు విభజించు, పాలించు (divide and rule) సూత్రాన్ని అవలంభించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాన్ని తూర్పు బెంగాల్ (East Bengal) అని, హిందువులు అధికంగా ఉండే ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ (West Bengal) అని, 1905లో బెంగాల్‌ను విభజించారు.
- బెంగాల్ విభజన (partition of Bengal)కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం మొదలైంది. అందులో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ (Baycott of foreign goods)కు జాతీయవాదులు పిలుపినిచ్చారు. బహిష్కరణకు Boycott అనే పేరు రావడం వెనుక బక ఘటన ఉంది.
- ఐర్లాండ్‌లో Captain Charles Cumringhan Boycott ఎస్టేట్‌లకు land agentగా ఉండేవాడు. 1880లో కౌలుదారుల (tenants) శిస్తు (rents)ను పెంచాడు. దీనికి వ్యతిరేకంగా Irish Land League ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు అతన్ని వెలివేశారు. దీంతో అతనికి ఎవరూ ఏమీ అమ్మేవారు కాదు. అతనికి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార పదార్థాలు కూడా అందకుండా దిగ్బంధనం చేశారు. చివరికి అతను ఆ ప్రదేశాన్ని వదిలి ఇంగ్లండ్‌కు పారిపోయాడు. దీంతో అతని పేరు మీదుగా Boycott అంటే బహిష్కరణ అనే అర్థం ఏర్పడింది.
- The opposition leader called for a boycott of the election (ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాడు).
- Lawyers threatened a boycott of the courts (న్యాయస్థానాలను బహిష్కరిస్తామంటూ న్యాయవాదులు బెదిరించారు).

Chauvinism (దురభిమానపూరిత దేశభక్తి)- జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ. కన్నతల్లి పుట్టిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని అర్థం. ఎవరికైనా తమ దేశం గొప్పదే. అయితే హేతువు లేకుండా మొండిగా దూకుడుగా అన్ని దేశాల కంటే తన దేశమే గొప్ప అని భావించడాన్ని దురభిమానపూరిత దేశభక్తి అంటారు (an aggressive and unreasonable belief that your country is better than all others).
- Napolean సైన్యంలోని Nicholas Chauvin అనే సైనికునికి ప్రభుభక్తి ఎక్కువ. వాటర్‌లూ యుద్ధం (Battle of Waterloo)లో ఓడిపోయిన తరువాత కూడా Chauvin ఎక్కడపడితే అక్కడ నెపోలియన్‌ను కీర్తిస్తూ పాటలు పాడేవాడు. హేతువిరుద్ధంగా పరాజితులను పొగడటం చూసి అందరూ అతన్ని ఎగతాళి (ridicule) చేసేవారు. అతని పేరుమీదుగా దురభిమానపూరిత దేశభక్తికి (aggressive or exaggerated patriotism) Chauvinism అనే పదం స్థిరపడింది. అలా దేశంపట్ల దురభిమానం పెంచుకున్న వాళ్లను Chauvinist అంటారు.
- విస్తృతార్థంలో జాతి (race), లింగ (gender) పరంగా దురభిమానం కూడా Chauvinism అయింది. ఉదాహరణకు Male Chauvinism (పురుషాహంకారం). భగవంతుడిని పురుషుడిగా సృష్టించడంతోనే పురుషాహంకారం మొదలైంది (male chauvinism started when they invented that- God was a man) అనుకోవచ్చు.
- Chauvinism లాంటిదే మరోపదం Jingoism. యుద్ధకాముకులు (warmongers), కయ్యపుడేగలు (war hawks) మొదలైన అహంభావ జాతీయతావాదులను (arrogant nationalists) jingoist అంటారు. Patriotism (దేశభక్తి) కొంతమేరకు మంచిదే కాని chauvinism లేదా jingoism మానవాళికి అనర్థదాయం.

Paraprosdokian (పారప్రాస్‌డోకియన్)

- ఉర్దూ కవిత్వంలో గజల్ అనే ప్రక్రియ ఉంది. కొన్ని గజల్‌లలో మనం ఊహించని రీతిలో ఆశ్చర్యకరమైన ముగింపు ఉంటుంది. ఉదాహరణకు మీర్ తాఖీ మీర్ గజల్ చూస్తే...
వో ఆయే బజ్మ్‌మే, బస్ ఇత్‌నా తూ మీర్ నే దేఖా
ఫిర్ ఇస్‌కే బాద్ చిరాగోంమే రోష్‌నీ నా రహీ ఆమె సభలోకి వచ్చింది. ఇంత వరకే మీర్ (కవి పేరు) చూశాడు. ఆ తరువాత... దీపాలలో వెలుగు లేదు. అంటే ఆమె అసమాన సౌందర్య జ్వాల ముందు గదిలో దీపాలు వెలవెలబోయాయి అని కవి అంతరార్ధం.
- ఇంగ్లిష్‌లో అలా ఊహించిన దానికి భిన్నంగా (contrary to expectation), ఆశ్చర్యకరమైన ముగింపుతో కూడిన వాక్యాల వంటి పదచిత్రాల (figures of speech)ను paraprosdokians అంటారు. (Greeks: para-against, prosdokia-expectation)
- Where there is a will, there is a way (మనసుంటే మార్గం ఉంటుంది) అనే నానుడి (saying) అందరికీ తెలిసిందే. will అంటే మనసు/ఇచ్ఛతో పాటు వీలునామా అనే అర్థం కూడా ఉంది.
- రెండో అర్థంలో Mark Twain అనే ప్రసిద్ధ అమెరికన్ రచయిత ఆ నానుడిని సరదాగా Where there is a will, I want to be in it అని మార్చాడు. దాని అర్థం ఎక్కడ వీలునామా ఉంటే అందులో నేను ఉండాలని కోరుకుంటాను. వీలునామాలో తన తదనంతరం ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో రాస్తారు.
- వీలునామా అనే పదం will అనే ఇంగ్లిష్ పదం, నామా (పత్రం/leaf) అనే ఉర్దూ/అరబిక్ పదం సంకరం (hybrid)తో ఏర్పడింది.
gordian

Gordian Knot (చిక్కుముడి)

- Gordian అనే రాజు తన రథాని (charriot)కి అత్యంత క్లిష్టతరమైన చిక్కుముడి (extremely intricate knot)ని బిగించాడు. ఆ ముడి విప్పడం ఎవరికీ సాధ్యంకాలేదు. స్థానిక భవిష్యవాణి (Oracle) ఆ ముడిని విప్పినవాడు ఆసియా (Asia)ను పాలిస్తాడని జోస్యం (prephecy) పలుకుతుంది. చివరికి Alexandar తన ఖడ్గం (sword)తో ముడిని ఖండిస్తాడు.
- కాలక్రమంలో Gordian Knot అంటే చాలా కష్టతరమైన, అసాధ్యమైన పని లేదా సమస్య (a Very difficult or impossible tasks orproblem) అని అర్థం ఏర్పడింది.
- ఆ సమస్యలను కఠినమైన చర్యల ద్వారా పరిష్కరించడాన్ని to cut or untie the Gordian knot అంటారు. (to solve the problem by taking sterm action)
- Heavy traffic already become a Gordian knot in all major cities (అన్ని ముఖ్యనగరాల్లో ట్రాఫిక్ ముడి విప్పలేని చిక్కు సమస్యగా మారిపోయింది).

- Paraprosdokians చాలామటుకు నాటకీయంగా (dramatic), హాస్యస్ఫోరకంగా (humorous), సరదా గా (funny) ఉంటాయి. భావగర్భితంగా ఉండి భాషకు సొగసును (beauty) జోడిస్తాయి.
- Right అంటే ఒప్పు, కుడివైపు అని అర్ధాలు ఉన్నాయి. Left అంటే ఎడమవైపు, మిగిలిపోయిన అని అర్థ్ధాలు ఉన్నాయి. ఈ అర్థ భేదంతో యుద్ధం వల్ల కలిగే అనర్థం గురించి.. War doesnt determine who is right - only who is left యుద్ధం నిర్ణయించేది ఎవరు ఒప్పో అని కాదు. ఎవరు మిగులుతారని (చనిపోయినవారు పోగా).
father-and-daughter
- She got her good looks from her father; hes a plastic surgeon. సాధారణంగా పిల్లల అందచందాలు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. She got her good looks from her father అనగానే మనం ఏమనుకుంటాం? తండ్రి అందగాడు. అమ్మాయికి తండ్రి పోలికలు వచ్చాయని. కానీ తరువాత భాగం చూస్తే.. He is a plastic surgeon అన్నారు. అంటే వాళ్ల నాన్న ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి surgery ద్వారా ఆమె శరీరాన్ని సరిచేసి అందంగా తీర్చిదిద్దాడు.

- కోపాన్ని శాంతం ద్వారానే కాని కోపంతో జయించలేము. ఎట్లాగంటే When tempted to fight fire with fire, remember that Fire Department usually uses water మంటను మంటతో ఆర్పివేయాలని ఆవేశపడ్డప్పుడు, అగ్నిమాపక శాఖ నీటిని వాడుతుందని గుర్తుకు తెచ్చుకోండి.
- పరిశోధనా గ్రంథాల్లో ఆ రచయితలోంచి కొంత, ఈ రచయితలోంచి కొంత సంగ్రహించి రాసినవే ఎక్కువ ఉంటున్నాయి. కొత్తదనం, మౌళికత (originality) తక్కువ. అందుకే... If you steal from one author, its plagiarism; If you steal from many, its research (ఒక రచయితలోంచి దొంగతనం చేస్తే అది గ్రంథచౌర్యం (plagiarism), చాలా మంది నుంచి తస్కరిస్తే అది పరిశోధన (research) అంటారు.
- Behind every successful man is his woman. Behind the fall of a successful man is usually another woman. ప్రతి విజేత వెనుక ఒక స్త్రీ ఉంటుంది. అలాగే ప్రతి విజేత పతనం వెనుక కూడా మరో స్త్రీ ఉంటుంది. మొదటిది నిజమైనప్పుడు రెండోది మాత్రం ఎందుకు కాదు?
OXYMORON
- శ్రీశ్రీ గారు ఆరాధన చిత్రంలో నా హృదయంలో నిదురించే చెలీ, కలలలోనే కవ్వించే సఖీ అనే పాట రాశారు. మీరు అభ్యుదయ (Progressive) కవి కదా.. చెలీ, సఖీ అంటూ ప్రేమ గీతం రాశారేమిటి? అని ఎవరో శ్రీశ్రీ గారిని ప్రశ్నించారు. అందుకు బదులుగా శ్రీశ్రీ గారు నా హృదయంలో నిదురించే చెలి సోషలిజం. కలలలోనే కవ్వించే సఖి కమ్యూనిజం. అలా అన్వయించుకుంటూ పాటను వినండి. అప్పుడు అర్థమవుతుంది ఇది అభ్యదయ గీతమని అన్నారట.
- నా హృదయంలో నిదురించే చెలీ పాట చరణంలో ఒకచోట నీ వెచ్చని నీడలో వెలసెను నా వలపుల మేడ అని ఉంటుంది. ఒక విద్యార్థి నీడ చల్లగా ఉంటుంది కదా, వెచ్చని నీడ అన్నారేమిటి అని శ్రీశ్రీని ప్రశ్నించాడట. అందుకు శ్రీశ్రీ గారు నువ్వు ఇంకా చిన్నవాడివి. ఇప్పుడే తెలియదు. ప్రియురాలి నీడ వెచ్చగానే ఉంటుంది అని చెప్పారట
.
- జ్ఞానం (Knowledge) వేరు, వివేకం (wisdom) వేరు. జ్ఞానులంతా తెలివైనవారు అవ్వాలనే నియమం లేదు. వీటి మధ్య తేడా.. Knowledge is knowing tomato is a fruit, wisdom is not putting in a fruit salad. టమాటా ఒక పండు అని తెలుసుకోవడం జ్ఞానం అయితే, దాన్ని ఫ్రూట్ సలాడ్‌లో వేయకపోవడం విజ్ఞత (wisdom).

- ఉపోద్ఘాతానికి కారణం వెచ్చని నీడ అనేది పదచిత్రం (figure of speech). ఇందులో వెచ్చని, నీడ అనే రెండు విరుద్ధమైన (contradictory) పదాలు పక్కపక్కనే ఉన్నాయి. అలాంటి విరుద్ధమైన పదాల కలయికతో ఏర్పడిన పదచిత్రాన్ని OXYMORON అంటారు.
- Oxymoron is a figure of speech in which two contradictory terms are used together. రెండు వ్యతిరేకమైన పదాలు లేదా భావనల (two opposile words or ideas) కలయికతో పేర్చిన పదచిత్రం ఒక్కోసారి నాటకీయంగా (darmastic) ఉంటుంది.
ఉదా: భార్య మరణం తర్వాత అతను జీవచ్ఛవంలా మిగిలిపోయాడు అనే వాక్యాన్ని చూద్దాం. ఒక వ్యక్తి ఏకకాలంలో.. అయితే జీవించి లేదంటే మరణించి ఉంటాడు. జీవచ్ఛవం (Living dead) అనడంలో జీవించి ఉన్నా శవంతో సమానం అనే నాటకీయ అభివ్యక్తి (dramastic expression) కనిపిస్తుంది.
- Oxymoron అనే పదమే తమాషాగా నిష్పన్నమైనది. ఇది స్వయం తార్కిక (autological) పదం. గ్రీక్ భాషలో oxy అంటే sharp, moron అంటే dull అర్థం. Oxymoron అంటే కుశాగ్ర బుద్ధిహీనత లేదా చురుకైన మొద్దు అని భావం. Oxymoron నాడిని గ్రహించడానికి కొన్ని విశదీకరణలు చూద్దాం.
- ఒకాయన ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. గుత్తేదారును కలిసి ఎంత ఖర్చవుతుందో కచ్చితమైన అంచనా (exact estimation) ఇవ్వమని అడిగాడు. అంచనా అంటేనే ఉజ్జాయింపు. కచ్చితంగా ఇంత అని చెప్పగలిగితే అది అంచనా కాదు. అందుకే exact estimate ఒక Oxymoron.
- The contracter was asked to give the exact estimate of the project.
- వార్త (news) అంటేనే కొత్తది. అట్లా అని newకు బహువచనం news కాదు. North, East, West, South నాలుగు దిక్కుల నుంచి సేకరిస్తారు కాబట్టి వాటి మొదటి అక్షరాలతో News అనే పదం వచ్చింది. వార్తలు తాజాగా ఉండాలి. అందుకే నిన్నటి న్యూస్ పేపర్‌ను ఈ రోజుకు వేస్ట్ పేపర్ అన్నారు. అయినా సరే పాతవార్త (old news) అనే Oxymoron నిత్యనూతనంగా ఉంది.

- The channel was repeating the old news again and again.
- స్వచ్ఛందం (Voluntary)గా పనిచేసే వాళ్లకు చెల్లింపులు (payments) ఉండవు. Paid volunteer ఒక Oxymoron.
- Paid volunteers are working for the company
- విరహము కూడా సుఖమే కదా అన్నాడో సినీ కవి. Parting is a sweet sorrow. వియోగం లేదా ఎడబాటు (Parting) ఒక తీయని బాధ. sweet sorrow అనేది ఒక Oxymoron.
- ఇప్పుడు మీకు Oxymoron అంటే ఎంతోకొంత అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాడుకలో ఉన్న కొన్ని Oxymora (Oxymoron కు బహువచనం Oxymora) లను కింది ఇస్తున్నాం.
- Original copy - నకలు (copy) ఎప్పుడూ మాతృక (Original) కానేరదు.
- larger half - half అంటే సగం. ఎక్కువ సగం, తక్కువ సగం ఉండవు.
madhusudan-reddy

485
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles