గ్రూప్-1 మెయిన్స్ జాగ్రఫీ విశ్లేషణ


Wed,January 9, 2019 01:13 AM

image
గ్రూప్-1లో అనేక మార్పులు చేసి విడుదల చేసిన సిలబస్‌లో అన్ని అంశాలు పరిశీలించేవిగా ఉన్నాయి. ఈ సిలబస్‌ను యూపీఎస్సీ పరీక్షకు అనుగుణంగా మార్చారు. ప్రశ్నలు అడిగే తీరు, దాన్ని అవలంబించే తీరులో కచ్చితంగా మార్పులు ఉండవచ్చు. అంటే ఈసారి గ్రూప్-1 ఎంతో ప్రతిష్ఠాత్మకమే కాకుండా ఎంతో వైవిధ్యంగా ఉండనున్నది. ఇలాంటి అత్యున్నత పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి? అత్యంత కష్టమనుకునే జాగ్రఫీ లాంటి సబ్జెక్టును మెయిన్ విషయంలో ఎలా పట్టు సాధించాలి? ఏం చదవాలి? మొదలైన అంశాలన్నింటినీ తెలుసుకుందాం.
- జాగ్రఫీ సబ్జెక్టు ఇతర సబ్జెక్టులను సులభంగా నేర్చుకోడానికి మూలం. జాగ్రఫీ సబ్జెక్టుపై పట్టు ఉండి దానికి డాటా ను చేర్చి చదివితే ఎకానమీ సబ్జెక్టుగా సులభతరమవుతుంది. ప్రాంతాలను, ప్రదేశాలను గుర్తిస్తూ చదివితే చరిత్ర సులభంగా అర్థమవుతుంది.
- జాగ్రఫీ మెయిన్స్‌లో పట్టు సాధించాలంటే ప్రిలిమినరీతో సహా మెయిన్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ చదవాలి.
- సిలబస్‌లో 5 యూనిట్లు పేర్కొన్నప్పటికీ వాటిని టాపిక్‌లవారీగా విభజించి చూద్దాం.

ప్రపంచంలో అత్యంత లోతైన ద్వీప సముదాయం ఏది?

1) సెయింట్‌పాల్
2) సుమత్రా
3) మిండనౌ
4) సుందా
జవాబు: 3,

భూమికి, చంద్రునికి మధ్యదూరం ఎక్కువగా ఉండటాన్ని ఏమంటారు?

1) పరిహేళి
2) పరీజి
3) అపహేళి
4) అపోజి
జవాబు: 4,

గ్రూప్-1 సిలబస్ - జాగ్రఫీ పాత్ర

- 150 మార్కుల ప్రిలిమినరీలో జాగ్రఫీ, దాని సంబంధిత అంశాలైన విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
- ప్రిలిమినరీలో మొత్తం 13 అంశాలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క అంశానికి 10 నుంచి 15 మార్కులు ఉంటాయి (కొన్ని అంశాలకు ఎక్కువ మార్కులు ఉంటాయి). ఈ 13 అంశాల్లో జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నాయి.

ప్రత్యక్ష అంశాలు

1) వరల్డ్ జాగ్రఫీ
2) ఇండియన్ జాగ్రఫీ
3) తెలంగాణ జాగ్రఫీ

- వీటిలో నుంచి గత పరీక్షల సరళిని అనుసరిస్తే సుమారు 15-20 మార్కులు వచ్చే అవకాశం ఉంది.

పరోక్ష అంశాలు

1) విపత్తు నిర్వహణ- ముందస్తు, ఉపశమన వ్యూహాలు
2) పర్యావరణ సమస్యలు
3) కొన్ని తెలంగాణ రాష్ట్ర విధానాలు
- వీటిలో నుంచి గత పరీక్షల సరళిని అనుసరిస్తే 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది.
- పై అంశాలన్నీ జాగ్రఫీకి సంబంధించిన అంశాలే. అంటే దాదాపు 30 నుంచి 35 మార్కులకు జాగ్రఫీకి సంబంధించిన అంశాల గురించి అడిగే అవకాశం ఉంది.
- తెలంగాణ రాష్ట్ర విధానాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ (పశుసంపద), వ్యవసాయ విధానాల పథకాలు, డిజిటల్ తెలంగాణ (ఐటీ పథకాలు) మొదలైనవి జాగ్రఫీకి అనుబంధంగా ఉన్నాయి.

ప్రిలిమినరీ ప్రిపరేషన్

- దీనికి జాగ్రఫీలో ఉన్న మొదటి అంశం వరల్డ్ జాగ్రఫీ. దీనిలో సౌరవ్యవస్థ, భూమి అంతరనిర్మాణం (భూమి పొరలు), శిలలు, భూ ఉపరితల స్వరూపాలు, వాతావరణం, సముద్ర శాస్త్రం మొదలైనవి.
- రెండు (భారతదేశ జాగ్రఫీ), మూడు (తెలంగాణ జాగ్రఫీ) అంశాలను ఒకేసారి టాపిక్స్‌వారీగా చదవాలి.
- దీనివల్ల సబ్జెక్ట్ చదవడం తేలికవుతుంది. దీనిలో ఉనికి, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, నీటిపారుదల సౌకర్యాలు, శీతోష్ణస్థితి, నేలలు, వ్యవసాయం, అడవులు, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, జనాభా మొదలైనవి చదవాలి.
- పరోక్ష అంశాల్లో మొదటి అంశం విపత్తు నిర్వహణలో భాగంగా విపత్తు నిర్వహణకు సంబంధించి నిర్వచనాలు, విపత్తు నిర్వహణ చట్టం-2005, స్థాయీ సంస్థలు (NDMA, SDMA, NDRE, DDMA), నోడల్ మంత్రిత్వ శాఖలు, సహజ విపత్తులు.
- భూకంపాలు, సునామీ, చక్రవాతాలు, వరదలు, అగ్నిప్రపర్వతాలు, కరువులు మొదలైనవి.
- మానవకారక విపత్తులు: రోడ్డు, రైలు, విమాన, సముద్ర ప్రమాదాలు మొదలైనవి చదవాలి. విపత్తులను తగ్గించడానికి, ఎదుర్కోడానికి అనుసరించే వ్యూహాలను చదవాలి.

రెండో అంశం

- పర్యావరణ సమస్యల్లో భాగంగా పర్యావరణ అంశాల నిర్వచనాలు, పర్యావరణ అసమతుల్యతల వల్ల వచ్చే కాలుష్యాలు (పర్యావరణ కాలుష్యాలు), పర్యావరణ ఉద్యమాలు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు చదవాలి.

మూడో అంశం

- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు (పాలసీలు) చదవాలి.
ప్రిలిమినరీకి చదవాల్సిన పుస్తకాలు
- ప్రిలిమినరీ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ నుంచి తక్కువ అంశాలు, భారతదేశ, తెలంగాణ జాగ్రఫీల నుంచి ఎక్కువ అంశాలు ప్రశ్నలుగా వస్తాయి.
books

రిఫరెన్స్ పుస్తకాలు వరల్డ్ జాగ్రఫీ

- తెలుగు అకాడమీ.. 1) ఇంటర్ మొదటి ఏడాది
2) బీఏ/బీఎస్సీ మొదటి ఏడాది భూగోళశాస్త్రం.
3) ఎన్‌సీఈఆర్‌టీ.. 8, 9, 10వ తరగతుల భూగోళశాస్త్రం.

ఇండియన్ జాగ్రఫీ

- 1) తెలుగు అకాడమీ.. ఇంటర్ రెండో ఏడాది
2) మాజిద్ హుస్సేన్.. భారతదేశ భూగోళశాస్త్రం (ఇంగ్లిష్ మీడియం)
3) ఎన్‌సీఈఆర్‌టీ.. 8, 9, 10వ తరగతుల భూగోళశాస్త్రం.

తెలంగాణ జాగ్రఫీ

- తెలుగు అకాడమీ.. తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం.
- భారతదేశ, తెలంగాణ జాగ్రఫీకి వీటితో పాటు భారతదేశ, తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వేలను క్షుణ్ణంగా చదవాలి.
- జనాభాకు సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి 2011 జనాభా లెక్కల ఆధారంగా భారతదేశ-తెలంగాణ అంశాలను చదవాలి.

విపత్తు నిర్వహణ

- తెలుగు అకాడమీ- పోటీపరీక్షల ప్రత్యేకం- సహజవిపత్తుల నిర్వహణ
- ఎన్‌సీఈఆర్‌టీ- 8, 9, 10వ తరగతి, విపత్తు నిర్వహణ పుస్తకాలు.

పర్యావరణ సమస్యలకు

- తెలంగాణ పర్యావరణ వెబ్‌సైట్, భారత పర్యావరణ శాఖ వెబ్‌సైట్
- ప్రస్తుత ఎన్విరాన్‌మెంట్ అంశాలకు వివిధ సోర్సుల నుంచి సేకరించాలి.

మెయిన్స్‌లో జాగ్రఫీ

- గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2లో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. అందులో మూడో సెక్షన్ అనేది భారతదేశ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినది (వరల్డ్ జాగ్రఫీ గురించి ప్రత్యేకంగా మెయిన్స్ సిలబస్‌లో లేదు). ఇది 50 మార్కులకు ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ విశ్లేషణను 2018, డిసెంబర్ 26వ తేదీ నిపుణలో ఇచ్చాం. జాగ్రఫీ మెయిన్స్ సబ్జెక్టు సంబంధించి మార్కులు సాధించాలంటే పటాలతో కూడిన అధ్యయనం చాలా అవసరం. మెయిన్స్‌లో జాగ్రఫీ అనేది గత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో లేదు. ప్రస్తుతం జాగ్రఫీ మెయిన్స్‌కు సంబంధించి సిలబస్‌పై పట్టు సాధించాలంటే సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీ ప్రశ్నపత్రాలను పరిశీలించి అవగాహనను పెంచుకోవాలి.
- జాగ్రఫీ మెయిన్స్‌లో 5 ప్రశ్నలు ఉండి ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి. ఇవి కొంచెం కఠినంగానే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయాలంటే జాగ్రఫీ ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం కీలకం.
- వరల్డ్ జాగ్రఫీని ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ భారతదేశంతో సరిహద్దుగల దేశాలు, అంశాలపై కూడా అవగాహన అవసరం. కారణం హిమాలయాలు, నదులు, జలసంధులు, ప్రాదేశిక జలాలు, సింధుశాఖలు ఉన్నాయి. కాబట్టి కింది ప్రశ్నల తీరును పరిశీలిస్తే వీటిపై అవగాహన కలుగుతుంది.
india-map

I. భారతదేశ పటంలో కింది అంశాలను గుర్తించి వాటి గురించి 30 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి. 1X10= 10

1) పిర్ పంజాల్ పర్వతశ్రేణి
2) నాథులా కనుమ 10) కుద్రేముఖ్
3) N-E రైల్వే ప్రధాన కార్యాలయం
4) ష్యోక్ నది 5) కోరి క్రీక్ 6) గాట్ శిల
7) తవాంగ్ 8) ముల్షిలేక్ 9) నేయార్

II. మొదటి రెండు ప్రశ్నలకు 75 పదాల్లో, తరువాతి మూడు ప్రశ్నలకు 150 పదాల్లో సమాధానాలు రాయండి.

1) హిమాలయాలు పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని లఘుటీక వ్యాఖ్య రాయండి? (75 పదాల్లో)
2) హిమాలయాలవల్ల భారతదేశానికి కలిగే నష్టాన్ని నీవు సమర్థిస్తావా? (75 పదాల్లో)
3) హిమాలయాల్లోని దోపిడీ అయిన నది, నదీ ప్రవాహ మార్గాన్ని మార్చేవాటిని గురించి విశదీకరించండి? (150 పదాల్లో)
4. హైదరాబాద్ రాష్ట్ర నైసర్గిక విస్తరణ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర నైసర్గిక విస్తరణను భౌగోళికపరంగా తెలియజేయండి? (150 పదాల్లో)
5. తెలంగాణలో భౌగోళికపరంగా నూతన జిల్లాల ఆవశ్యకతను వివరించండి? (150 పదాల్లో)

మోడల్ ప్రశ్నలు


1. వులార్ సరస్సు గురించి చదవండి.

ఎ. ఇది ప్లీస్టోసిన్ కాలంలో ఏర్పడింది
బి. జీలం నది ప్రవాహం వల్ల సోపోర్, బండీపోర్ మధ్య ఏర్పడింది
సి. వులార్ సరస్సు ముఖద్వారం వద్ద బాగ్లీహార్ ప్రాజెక్టును నిర్మించారు
డి. ఇది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
1) ఎ, బి, సి
2) ఎ, డి
3) బి, డి
4) సి

2. అండమాన్ నికోబార్ దీవులు అత్యధికవైశాల్యం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. ఇది అనేక దీవుల సముదాయం. ఈ దీవుల్లో ప్రధానమైనవి దక్షిణం నుంచి ఉత్తరానికి వరుసగా ఉన్నాయి.

ఎ. కార్ నికోబార్
బి. గ్రేట్ నికోబార్
సి. లిటిల్ అండమాన్
డి. దక్షిణ అండమాన్
ఇ. ఉత్తర అండమాన్
జి. లిటిల్ నికోబార్
1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి
2) సి, డి, ఎఫ్, ఇ, ఎ, జి, బి
3) ఇ, ఎఫ్, డి, సి, ఎ, జి, బి
4) ఇ, డి, సి, ఎఫ్, జి, ఎ, బి

3. కిందివాటిని జతపర్చండి.

ఎ. కశ్మీర్ హిమాలయాలు
1. సట్లేజ్-కాలి నదుల మధ్య ఉన్నాయి
బి. నేపాల్ హిమాలయాలు
2. సింధు-సట్లేజ్ నదుల మధ్య ఉన్నాయి
సి. అసోం హిమాలయాలు
3. తీస్తా-బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నాయి
డి. కుమయున్ హిమాలయాలు

4. కాలి-తీస్తా నదుల మధ్య ఉన్నాయి

1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3 ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3

4. కపలధార, ధువన్‌ధార, మండార్ జలపాతాలు ఏ నదితో సంబంధం కలిగి ఉన్నాయి?

1) తపతి
2) నర్మద
3) తుంగభద్ర
4) మహానది

5. ప్రతిపాదన (A): ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు నిర్ణీత కాలంలో ఆకులను రాలుస్తాయి కారణం (R): ఆకురాల్చు అరణ్యాల్లో మొక్కలు భాష్పోత్సేకం నుంచి తనను తాను రక్షించుకోవడానికి

1) A, R రెండూ తప్పు కాని Aకు R సరైన వివరణ కాదు
2) A, R రెండూ ఒప్పు, Aకు R సరైన వివరణ
3) A సరైనది, R సరికాదు
4) A తప్పు, R సరైనది

6. కింది వ్యాఖ్యలను చదవండి.

ఎ. బనాస్ చంబల్ నదికి ఎడమవైపు నుంచి కలిసే ఉపనది
బి. అమరావతి కావేరి నదికి కుడివైపు నుంచి కలిసే ఉపనది
సి. రింగిట్ తీస్తా నదికి ఎడమవైపు నుంచి కలిసే ఉపనది
డి. ధన్‌సిరి బ్రహ్మపుత్ర నదికి కుడివైపు నుంచి కలిసే ఉపనది
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, బి
4) బి, సి, డి

జవాబులు

1-4,
2-3,
3-2,
4-2,
5-2,
6-1,
ramesh

672
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles