ఎన్‌పీసీఐఎల్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు


Wed,January 9, 2019 12:11 AM

కాక్రపార గుజరాత్ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
KAPS-NPCILM
-మొత్తం ఖాళీలు : 162 పోస్టులవారీగా ఖాళీలు
-స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్ డిప్లొమా)-51 ఖాళీలు
-విభాగాలు- ఖాళీలు: మెకానికల్-26, ఎలక్ట్రికల్-17, ఎలక్ట్రానిక్స్-5, కెమికల్-3
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో ప్రథమశ్రేణిలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (సైన్స్ గ్రాడ్యుయేట్లు)-6 ఖాళీలు (కెమిస్ట్రీ)
-అర్హత: కెమిస్ట్రీతోపాటు ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌తో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బీఎస్సీ(ఎంపీసీ)లో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా)-7 ఖాళీలు
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండరీ ట్రెయినీ/ టెక్నీషియన్ (ప్లాంట్ ఆపరేటర్)-51 ఖాళీలు
-అర్హత: సైన్స్ సబ్జెక్టులతో హెచ్‌ఎస్‌సీ (10+2) లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌ఎస్‌సీ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-స్టయిఫండరీ ట్రెయినీ/ టెక్నీషియన్(మెయింటైనర్)-47 ఖాళీలు
-విభాగాలు: ఫిట్టర్-17, ఎలక్ట్రీషియన్-6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-7, వెల్డర్-3 మెషినిస్ట్-3, డీజిల్ మెకానిక్-1
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సైన్స్, మ్యాథమెటిక్స్/ఇంగ్లిష్ సబ్జెక్టులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 31 నాటికి సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (సివిల్) పోస్టులకు 18-30 ఏండ్లు, స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18-25 ఏండ్లు, మిగతా పోస్టులకు 18-24 ఏండ్ల మధ్య ఉండాలి.
-గమనిక: సంస్థ నిబంధనల ప్రకారం శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే కనీసం 160 సెం. మీ ఎత్తు, 45.50 కేజీల బరువు ఉండాలి.
-స్టయిఫండ్ : కేటగిరీ-1 పోస్టులకు రూ. 16000/- (మొదటి ఏడాది), 18,000 (రెండో ఏడాది), కేటగిరీ-2 పోస్టులకు రూ. 10,500/-(మొదటి ఏడాది) రూ. 12,500/-(రెండో ఏడాది) ట్రెయినింగ్ పీరియడ్‌లో చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తయిన తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.35, 400/-,
టెక్నీషియన్‌కు రూ. 21,700/- నెలకు జీతం చెల్లిస్తారు. అదనంగా డీఏ, సీడీఏ, సీఈఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: కేటగిరీ1 పోస్టులకు రాతపరీక్ష+ఇంటర్వ్యూ, మిగతా పోస్టులకు ప్రిలిమినరీ, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్‌టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles