నెస్ట్-2019


Thu,January 3, 2019 12:56 AM

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
NEST
-పరీక్ష పేరు: నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)
-ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
-సీట్ల సంఖ్య: 249
-ప్రవేశాలు కల్పించే సంస్థలు: భువనేశ్వర్‌లోని నైసర్, ముంబైలోని యూఎం-డీఏఈ సీఈబీఎస్. ఈ రెండు సంస్థలు అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తాయి.
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: ఆగస్టు 1999 తర్వాత జన్మించినవారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-పరీక్ష విధానం: ఆన్‌లైన్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం ఐదు సెక్షన్లు ఉంటాయి. 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. సెక్షన్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండదు. మిగిలిన సెక్షన్లలో కొన్నింటిలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పూర్తి విషయాలు ప్రశ్నపత్రంలో చూడవచ్చు.
-స్కాలర్‌షిప్: ఇన్‌స్పైర్, దిశ ప్రోగ్రామ్ కింద ఏడాదికి రూ.60,000/- స్కాలర్‌షిప్ ఇస్తారు. దీనికి అదనంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ కింద ఏడాదికి రూ.20,000/- ఇస్తారు.
-పరీక్ష తేదీ: 2019, జూన్ 1 (మొదటి సెషన్: ఉదయం 9 నుంచి 12.30 వరకు, రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 నుంచి 6 గంటల వరకు)
-ఫీజు: జనరల్/ఓబీసీ బాలురు-రూ.1,200/-
-ఎస్సీ, ఎస్టీ, అన్ని కేటగిరీలకు చెందిన బాలికలు, పీహెచ్‌సీలకు రూ.600/-
-ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 90కి పైగా పట్టణాలల్లో ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 7 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 11
-ఫలితాల వెల్లడి: జూన్ మూడోవారంలో
-వెబ్‌సైట్: https://www.nestexam.in

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles