YEAR ROUND UP 2018 APRIL


Wed,January 2, 2019 12:50 AM

Telangana

2018-APRIL-Telangana

హైదరాబాద్ ప్రపంచ నెం.1

-స్వల్ప కాలంలో వృద్ధిపరంగా అంతర్జాతీయ టాప్-30 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు ఉంది.

పంచాయతీరాజ్ బిల్లుకు ఆమోదం

-పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలోనే జరుగుతుంది. పంచాయతీ రిజర్వేషన్లను ఐదేండ్ల నుంచి పదేండ్లకు పెంచారు.

హైదరాబాద్‌లో బస్తీ దవాఖాన

-పేదలకు మెరుగైన వైద్య సేవలకు ఉద్దేశించిన బస్తీ దవాఖాన హైదరాబాద్‌లో ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ దవాఖానను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రంలో ఉజ్వల్ అమలు

-ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని సూర్యాపేటలో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.

రాష్ర్టానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డులు

-కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అత్యున్నత ప్రతిభ చూపిన 13 మంది ఐఏఎస్ అధికారులకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈ అవార్డులు దక్కాయి.

వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ

-ఏప్రిల్ 29న రాష్ట్ర నీటిపారుదల మాజీ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 14ను తెలంగాణ నీటిపారుదల దినోత్సవంగా గుర్తించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రకటించారు.

అంగన్‌వాడీ హెల్ప్‌లైన్

-అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 155209ను ఏర్పాటు చేసింది.

తెలంగాణకు ఈ-పంచాయతీ అవార్డు

-తెలంగాణకు జాతీయ స్థాయిలో ఈ - పంచాయతీ పురస్కారం దక్కింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పథకాల వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి, సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది.

National

2018-APRIL-national

65వ చలనచిత్ర జాతీయ పురస్కారాలు

-ఉత్తమ చిత్రం- విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీ)
-ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (మామ్)
-ఉత్తమ నటి- శ్రీదేవి (మామ్)
-ఉత్తమ నటుడు- రిద్ధి సేన్ (నగర్ కీర్తన్, బెంగాలీ)
-ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం- ఘాజీ
-ఉత్తమ వినోదాత్మక చిత్రం- బాహుబలి- 2
-దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-2018ను సీనియర్ నటుడు వినోద్‌ఖన్నాకు ప్రకటించారు.

మెర్సల్ సినిమాకు బ్రిటన్ ఫిల్మ్ అవార్డు

-తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమాకు విదేశీ చిత్రం కేటగిరీలో బ్రిటన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. మార్చి 30న జరిగిన వేడుకలో ఈ అవార్డును అందజేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో డబ్బింగ్ చేశారు.

కడక్‌నాథ్ కోళ్లకు జీఐ గుర్తింపు

-కడక్‌నాథ్ కోళ్లపై గ్లోబల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు మధ్యప్రదేశ్‌కు దక్కింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల మధ్య 2017 నుంచి ఈ విషయమై వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. చెన్నైలోని జీఐ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

-ఏప్రిల్ 14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాంగ్లాలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం సక్సెస్

-భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్‌ఎస్‌ఎల్‌వీ-సీ41 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో దేశీయంగా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్) సమర్థవంతంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఇస్రో 9 నావిగేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది.

వన్‌ధన్ పథకం ప్రారంభం

-అటవీ ఉత్పత్తులను మెరుగుపరిచి, వాటికి మార్కెట్ సదుపాయం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వన్‌ధన్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందుకోసం వనవికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చిన్నారులపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష

-12 ఏండ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మరణశిక్ష విధించే ఆర్డినెన్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపారు. దీంతోపాటు రుణ ఎగవేతదారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించిన ఆర్డినెన్సుపై కూడా సంతకం చేశారు.

ఇద్దరికి కీర్తిచక్ర

-విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్‌కుమార్, గిరీష్ గురంగ్‌లకు మరణానంతరం కీర్తిచక్ర అవార్డులు లభించాయి. ఘర్వాల్ రైఫిల్స్‌కు చెందిన మేజర్ ప్రీతమ్‌సింగ్ రాష్ట్రపతి సాహస అవార్డు అందుకున్నారు.

మై జర్నీ ఫ్రమ్... పుస్తకావిష్కరణ

-ఏప్రిల్ 26న ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు రాసిన మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం- లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆవిష్కరించారు.

గ్రామ్ స్వరాజ్ అభియాన్ ప్రారంభం

-ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) పథకాన్ని ప్రారంభించారు

International

2018-APRIL-International

నామ్ సదస్సు

-అలీన (నామ్) దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశం అజర్ బైజాన్ రాజధాని బాకులో ఏప్రిల్ 3-6 తేదీల్లో నిర్వహించారు. దీనిలో మంత్రి సుష్మాస్వరాజ్ ఉగ్రవాద నిర్మూలనపై ప్రసంగించారు. 1961లో ఏర్పడిన నామ్‌లో ప్రస్తుతం 120 దేశాలకు సభ్యత్వం ఉంది.

రెండు దేశాలకు కొత్త అధ్యక్షులు

-ఏప్రిల్ 3న జరిగిన ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ ఫతా ఎల్ సిసి రెండో సారి విజయం సాధించారు. కోస్టారికా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి కార్లోస్ అల్వరాడో ఏప్రిల్ 2న ఎన్నికయ్యారు. అత్యంత పిన్న వయస్సున్న (38 ఏండ్లు) అధ్యక్షుడిగా ఆయన రికార్డుల్లో నిలిచారు.

క్యూబా అధ్యక్షుడిగా కనెల్

-క్యూబా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత మిగుల్ డియాజ్ కనెల్ (58) క్యూబా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రౌల్ క్యాస్ట్రో (86) అధ్యక్ష పదవికి ఏప్రిల్ 19న రాజీనామా చేశారు.

2018 పులిట్జర్ బహుమతులు

-అమెరికాలో జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ఇచ్చే అత్యున్నత పులిట్జర్ ప్రైజ్‌లను ఏప్రిల్ 17న ప్రకటించారు. జర్నలిజం విభాగంలో ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలకు సంయుక్తంగా ఈ బహుమతి దక్కింది. సంగీత విభాగంలో పాప్ గాయకుడు కెండ్రిక్ లామర్ డామ్న్ ఆల్బమ్‌కు, సాహిత్యంలో అండ్రూ సీన్ గ్రీర్ కాల్పనిక నవల లెస్‌కు పులిట్జర్ ప్రైజ్ వచ్చింది.

నాసా టెస్ ప్రయోగం విజయవంతం

-అంతుచిక్కని గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏప్రిల్ 18న స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్‌ఎస్-టెస్)ను విజయవంతంగా ప్రయోగించింది.

సౌదీలో 35 ఏండ్ల తర్వాత సినిమా

-సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల సినిమా థియేటర్లపై నిషేధం ఎత్తివేయడంతో ఏప్రిల్ 19న తొలిసారి సినీ ప్రదర్శన జరిగింది. రాజధాని రియాద్‌లో బ్లాక్ పాంథర్ సినిమాను ప్రదర్శించారు.

Sports

2018-APRIL-Sports

కామన్‌వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా నంబర్‌వన్

-ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు స్వర్ణాలు 80, రజతాలు 59, కాంస్య పతకాలు 59 వచ్చాయి. భారత్ 26 స్వర్ణాలు , 20 రజతాలు, 20 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2014 కామన్‌వెల్త్ క్రీడలు గ్లాస్గోలో జరిగాయి.

షూటింగ్‌లో భారత్‌కు 9 స్వర్ణాలు

-సిడ్నీలో జరిగిన జూనియర్స్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. వాటిలో 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. చైనా 25 పతకాలతో మొదటి స్థానంలో ఉంది.

మిథాలి అత్యధిక వన్డేల రికార్డు

-మహిళల విభాగంలో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రికెటర్‌గా మిథాలిరాజ్ రికార్డు సృష్టించింది. 1999లో అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లోకి ప్రవేశించిన మిథాలి వన్డేల్లో 6,295 పరుగులు పూర్తిచేసింది.

ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్

-ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఏప్రిల్ 12న ప్రకటించిన ర్యాంకుల్లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 76,895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.

ఒకే టైటిల్‌ను 11 సార్లు..

-స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ మోంటెకార్లో మాస్టర్ సిరీస్ టైటిల్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాడు.దీంతో 1998 నుంచి ఓపెన్ శకంలో ఒకే టోర్నమెంటును అత్యధికంగా 11 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

విన్నింగ్ లైక్ సచిన్

-భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను తెలుపుతూ విన్నింగ్ లైక్ సచిన్-థింక్ అండ్ సక్సీడ్ లైక్ టెండూల్కర్ పేరుతో దేవేంద్ర ప్రభుదేశాయ్ పుస్తకాన్ని రాశారు.

Persons

2018-APRIL-Persons

ఆయుష్మాన్ భారత్ సీఈవో ఇందు భూషణ్

-కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ సీఈవోగా ఇందు భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న కేంద్రం ప్రకటించింది.

రణ్‌వీర్‌సింగ్, అనుష్కశర్మలకు ఫాల్కే అవార్డులు

-బాలీవుడ్ నటులు రణ్‌వీర్‌సింగ్, అనుష్కశర్మ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు.

నాస్కామ్ చైర్మన్‌గా రిషద్

-నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ చైర్మన్‌గా విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ ఏప్రిల్ 10న నియమితులయ్యారు.

ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా శేఖర్‌గుప్తా

-ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా శేఖర్‌గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కోల్ ఇండియా సీఎండీగా సురేష్‌కుమార్

-సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ 2018, ఏప్రిల్ 20న కోల్ ఇండియా నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

మక్సూసీకి యుధ్‌వీర్ అవార్డు

-ఈ ఏడాది యుధ్‌వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ ఎంపికయ్యారు.

సిక్కిం సీఎంగా పవన్‌చామ్లింగ్ రికార్డు

-దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి గా పాలించిన నేతగా సిక్కిం సీఎం పవన్‌చామ్లింగ్ రికార్డు సృష్టించారు. చామ్లింగ్ అధికారం చేపట్టి ఏప్రిల్ 29 నాటికి 23 ఏండ్ల 4 నెలల 17 రోజులు పూర్తయ్యాయి. ఇది జ్యోతిబసు పదవీకాలం కంటే ఒకరోజు ఎక్కువ.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్ర

-న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్ర. సుప్రీంకోర్టులో ఆమె ఏడో మహిళా న్యాయమూర్తి.

సీతాన్షుకు సరస్వతి సమ్మాన్ పురస్కారం

-గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్రకు సరస్వతి సమ్మాన్ 2017 పురస్కారం దక్కింది. వాఖర్ అనే కవితా సంకలనాన్ని రచించినందుకుగాను ఈ అవార్డు దక్కింది.

1376
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles