YEAR ROUND UP 2018 JUNE


Wed,January 2, 2019 12:45 AM

Telangana

2018-JUNE-Telangana

ఉపాధి కూలీ పెంపు

-మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు అందించే రోజువారీ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.197 నుంచి రూ.205కు పెంచింది.

బాలల రక్షణకు హెల్ప్‌లైన్

-రాష్ట్రంలో బాలల రక్షణకోసం పోలీస్ శాఖ జూన్ 5న 1098 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. చిన్నారులపై హింస, అఘాయిత్యం, బాల్య వివాహాలు వంటివి జరిగినప్పుడు, చిన్నారులు తప్పిపోయినప్పుడు, అనాథ బాలలు ఎదురైనప్పుడు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు మృతి

-ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు ఆనారోగ్యం కారణంగా జూన్ 14న మృతిచెందారు. ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన విశిష్ఠ పురస్కారం అందుకున్నారు.

టీ వెబ్ డిక్షనరీ

-పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ వెబ్ వెబ్ డిక్షనరీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రొఫెసర్ కేశరావు జాదవ్ మృతి

-తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ శ్వాసకోశ సంబంధ వ్యాధి కారణంగా జూన్ 16న మృతిచెందారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు.

కాప్-కనెక్ట్ యాప్ ఆవిష్కరణ

-పోలీసుల మధ్య సమాచార మార్పిడి కోసం పోలీస్ శాఖ రూపొందించిన కాప్-కనెక్ట్ అనే యాప్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి జూన్ 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా అప్పటికప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సూచనలు, సందేశాలు, ఆదేశాలను డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు 63 వేలమంది ఒకేసారి చూడవచ్చు.

నేరెళ్ల వేణుమాధవ్ మృతి

-ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా జూన్ 19న మృతిచెందారు. ఆయన 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన

-సీఎం కే చంద్రశేఖర్‌రావు జూన్ 29న జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.553 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టువల్ల 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు, 41 చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది.

టీఎస్ వెదర్ యాప్

-జూన్ 29న టీఎస్ వెదర్ యాప్‌ను ఆవిష్కరించారు. ఎన్‌ఐసీ సహకారంతో రూపొందించిన ఈ యాప్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పనిచేస్తుంది.

National

2018-June-national

సేవాభోజ్ యోజన పథకం

-అన్నదానం చేస్తున్న అధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని తిరిగి చెల్లించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 2న సేవాభోజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ రూ.325 కోట్ల ఖర్చుతో రెండేండ్లపాటు అమలు చేయనున్న ఈ పథకం కనీసం ఐదేండ్లుగా అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలకు వర్తిస్తుంది.

పీఎంబీజేపీ ప్రోగ్రామ్

-మహిళలు, బాలికల సౌకర్యార్థం అతితక్కువ ధరకే శానిటరీ నాప్‌కిన్లను అందించే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన్ (పీఎంబీజేపీ) కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం జూన్ 4న ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.2.50కే శానిటరీ నాప్‌కిన్ అందిస్తారు.

కొత్త గ్రహం కె2-236బి

-భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో కె2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని ఇస్రోకు చెందిన ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి బృందం కనుగొన్నది. ఈ గ్రహానికి కె2-236బి అని నామాకరణం చేశారు. దీంతో కొత్తగా గ్రహాలను కనుగొన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.

జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం

-దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ జూన్ 24న జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఈ ఫెడరేషన్ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రపంచ శాంతి సూచీలో భారత్ @136

-ప్రపంచ శాంతి సూచీ - 2018ని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) విడుదల చేసింది. మొత్తం 163 దేశాల జాబితాలో భారత్ 136వ స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు ఉన్నాయి. భారత్ 2016లో 141వ స్థానంలో నిలిచింది.

ఎం పాస్‌పోర్టు సేవా యాప్

-స్మార్ట్‌ఫోన్ నుంచే పాస్‌పోర్టు సేవలను పొందడానికి వీలుగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ జూన్ 26న ఎం పాస్‌పోర్టు సేవా పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ పుస్తకావిష్కరణ

-ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ పుస్తకాన్ని దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్జ్‌బర్గ్‌లో జూన్ 7న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆవిష్కరించారు. పీటర్ మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.

International

2018-June-International

ఈజిప్టు అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతెహ్

-అబ్దెల్ ఫతెహ్ అల్-సిసీ ఈజిప్టు అధ్యక్షుడిగా జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయన 97 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా

-ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోసగార్సెస్ జూన్ 5న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దీంతో ఐరాస సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన నాలుగో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్‌కు చెందిన విజయలక్ష్మీ పండిట్, లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, బహ్రెయిన్‌కు చెందిన షేకాహయా రషెద్ ఖలీఫా ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ముగ్గురు మహిళలు.

సూపర్ కంప్యూటర్ సమిట్ ఆవిష్కరణ

-ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ సమిట్‌ను అమెరికా జూన్ 8న ఆవిష్కరించింది. సెకనుకు 2 లక్షల ట్రిలియన్ల గణన చేసేలా దీన్ని రూపొందించారు. చైనాకు చెందిన సన్‌వే తైహులైట్ రికార్డులను సమిట్‌బద్దలుకొట్టింది. దీని గణన శక్తి సెకనుకు 93,000 ట్రిలియన్లు.

కెనడాలో జీ-7 దేశాల సదస్సు

- కెనడాలోని లామాల్బెలో జూన్ 8, 9 తేదీల్లో జీ-7 దేశాల సదస్సు జరిగింది. సభ్యదేశాలు కెనడా, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే ఈ సదస్సులో పాల్గొన్నాయి.

కజకిస్థాన్‌లో ప్రపంచ మైనింగ్ సదస్సు

-కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జూన్ 19-22 వరకు ప్రపంచ 25వ మైనింగ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 2000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్

-టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ అభ్యర్థి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి విజయం సాధించారు. జూన్ 24న వెలువడిన ఫలితాల్లో ఎర్డోగన్‌కు 52.5 శాతం, ప్రత్యర్థి ముహర్రెమ్ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు వచ్చాయి.

బెర్లిన్‌లో ప్రపంచ ఆహార సదస్సు

-జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జూన్ 26న ప్రపంచ ఆహార సదస్సు నిర్వహించారు.

Sports

2018-June-Sports

బ్యాట్ అధ్యక్షుడిగా కేటీఆర్

-తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎన్నికయ్యారు. ఆయన నాలుగేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

బీసీసీఐ వార్షిక అవార్డులు

-బీసీసీఐ జూన్ 7న 2016-17, 2017-18 సీజన్లకు సంబంధించిన వార్షిక అవార్డులను ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడికి ఇచ్చే పాలి ఉమ్రిగర్ అవార్డును 2016-17, 2017-18 సీజన్‌లకుగాను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. వుమన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలను 2016-17 సీజన్‌కు హర్మన్‌ప్రీత్‌కౌర్, 2017-18 సీజన్‌కు స్మృతి మందన అందుకున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేతలు హలెప్, నాదల్

-ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్‌ను రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ కైవసం చేసుకుంది. పురుషుల టైటిల్‌ను స్పెయిన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. మహిళల ఫైనల్ మ్యాచ్ జూన్ 9న, పురుషుల ఫైనల్ మ్యాచ్ జూన్ 10న జరిగింది.

మహిళల ఆసియాకప్ విజేత బంగ్లా

-మహిళల ఆసియాకప్ టీ-20 క్రికెట్ టోర్నీ విజేతగా బంగ్లాదేశ్ నిలిచింది. జూన్ 10న కౌలాలంపూర్‌లో జరిగిన పైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చారిత్రక టెస్టులో భారత్ విజయం

-ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫ్గానిస్థాన్‌కు టెస్టు హోదా ఇచ్చిన తర్వాత భారత్‌తో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. భారత్ ఐదు రోజుల మ్యాచ్‌ను కేవలం రెండు రోజుల్లోనే ముగించింది.

ఫెదరర్ ఖాతాలో 98వ టైటిల్

-స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ జర్మనీలో జరిగిన స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. జూన్ 17న జరిగిన ఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రోనిక్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించి 98వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

వన్డేలో న్యూజిలాండ్ మహిళల రికార్డు స్కోరు

-న్యూజిలాండ్ మహిళల జట్టు 47 ఏండ్ల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదుచేసి రికార్డు సృష్టించింది. జూన్ 9న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 490 పరుగులు చేసింది.

ఆర్చరీలో దీపికకు స్వర్ణం

-భారత మహిళా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి అమెరికాలో జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించింది.

కబడ్డీ మాస్టర్ టోర్నీ విజేత భారత్

-దుబాయిలో జరిగిన ఆరు దేశాల కబడ్డీ మాస్టర్ టోర్నీ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇరాన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

అధికాదాయం ఆర్జించే క్రీడాకారుల జాబితాలో కోహ్లీ

-ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్-100 క్రీడాకారుల జాబితాను జూన్ 6న ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి 83వ స్థానం దక్కింది. తొలి మూడు స్థానాల్లో మేవెదర్ (బాక్సింగ్), మెస్సి (ఫుట్‌బాల్), రొనాల్డో(ఫుట్‌బాల్) ఉన్నారు.

Persons

2018-JUNE-Persons

అందాల రాణిగా లక్ష్మీమేనన్

-కొచ్చిలో జూన్ 4న నిర్వహించిన భారత యువరాణి-2018 పోటీల్లో అందాల రాణిగా కేరళకు చెందిన లక్ష్మీమేనన్ ఎంపికయ్యారు. తొలి రన్నరప్‌గా పంజాబ్‌కు చెందిన సిమ్రాన్ మల్హోత్రా, సెకండ్ రన్నరప్‌గా ఢిల్లీకి చెందిన ఐశ్వర్య సహదేవ్ ఎన్నికయ్యారు.

అతిపిన్న రచయిత అయాన్

-అసోంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాకు చెందిన నాలుగేండ్ల అయాన్ గగోయ్ గోహెయిన్.. జూన్ 5న అతిపిన్న వయసున్న రచయితగా గుర్తింపు పొందాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ అయాన్ చోటు సంపాదించుకున్నాడు. హనీకాంబ్ పేరుతో అయాన్ రాసిన పుస్తకం ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది.

తొలి పార్లమెంటేరియన్ తిలక్ మృతి

-భారత్‌లో ఏర్పడిన మొదటి పార్లమెంట్ సభ్యుల్లో ఒకరైన కందాళ సుబ్రహ్మణ్య తిలక్ జూన్ 8న మృతిచెందారు. 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు.

బంగ్లాలో రచయిత షాజహాన్ బచ్చు హత్య

-బంగ్లాదేశ్‌లో జూన్ 12న ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త షాజహాన్ బచ్చు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. షాజహాన్ రాసిన రోంగ్ ధాంగ్ తమాషా కవితా సంపుటి ప్రాచుర్యం పొందింది.

జమ్ముకశ్మీర్‌లో జర్నలిస్ట్ బుఖారీ హత్య

-రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారిని జూన్ 14న శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని తన కార్యాలయం వద్ద ఉగ్రవాదులు హత్యచేశారు.

మిస్ ఇండియాగా అనుక్రీతి

-మిస్ ఇండియా -2018 కిరీటాన్ని జూన్ 19న తమిళనాడుకు చెందిన అనుక్రీతి వ్యాస్ దక్కించుకున్నారు. రెండోస్థానంలో మీనాక్షి చౌధరి (హర్యానా), మూడోస్థానంలో శ్రేయా (ఏపీ) నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో నెంబర్‌వన్ బెజోస్

-ఫోర్బ్స్ మ్యాగజీన్ జూన్ 19న విడుదలచేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (92.9 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (82.2 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ మొదటి స్థానంలో, అమెజాన్ రెండో స్థానంలో నిలిచాయి.

దేశంలో తొలి హిజ్రా న్యాయవాది షర్మిల

-దేశంలోనే మొదటి హిజ్రా న్యాయవాదిగా తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల గుర్తింపు పొందారు. జూన్ 30న ఆమె బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకున్నారు.

అధిక ఆదాయ క్రీడాకారుల జాబితాలో కోహ్లీ

-ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్-100 క్రీడాకారుల జాబితాను జూన్ 6న ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి 83వ స్థానం దక్కింది. తొలి మూడు స్థానాల్లో మేవెదర్ (బాక్సింగ్), మెస్సి (ఫుట్‌బాల్), రొనాల్డో(ఫుట్‌బాల్) ఉన్నారు.

Awards

2018-June-Awards

అనుపమ్ ఖేర్‌కు ఐఫా అవార్డు

-బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్‌కు ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ (ఐఫా) జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన 500కు పైగా చిత్రాల్లో నటించారు.

జిన్‌పింగ్‌కు పుతిన్ ఫ్రెండ్‌షిప్ మెడల్

-చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూన్ 8న ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ఫ్రెండ్‌షిప్ మెడల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రదానం చేశారు. శాంతియుత ప్రపంచం కోసం పుతిన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.

ఎలిజబెత్-2 జన్మదిన పురస్కారాలు

-బ్రిటన్‌లోని 33 మంది ప్రవాస భారతీయులకు జూన్ 9న మహారాణి ఎలిజబెత్-2 జన్మదిన పురస్కారాలు ప్రకటించారు. రాజకుటుంబ వైద్యుడు సత్యజిత్ భట్టాచార్యకు లెఫ్టినెంట్ ఆఫ్ ద రాయల్ విక్టోరియన్ ఆర్డర్ అవార్డు, మానసిక వైద్యుడు జస్వీందర్‌సింగ్ బుమ్రాకు కమాండ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డు లభించాయి.

బిందేశ్వర్ పాఠక్‌కు నిక్కీ ఏషియా అవార్డు

-సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు జూన్ 13న అంతర్జాతీయ అవార్డు లభించింది. అపరిశుభ్రతను, మహిళలపై వివక్షను రూపుమాపడంలో పాఠక్ చేసిన కృషికి గుర్తింపుగా జపాన్‌కు చెందిన సంస్థ కల్చర్ అండ్ కమ్యూనిటీ విభాగంలో నిక్కీ ఏషియా అవార్డును అందజేసింది.

రాష్ట్ర వ్యవసాయ శాఖకు అగ్రి-2018 అవార్డు

-తెలంగాణ వ్యవసాయ శాఖకు ఇండియా టుడే సంస్థ జూన్ 19న అగ్రి-2018 అవార్డును ప్రకటించింది. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

తెలంగాణ పోలీస్ శాఖకు బెస్ట్ వెరిఫికేషన్ అవార్డు

-పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకుగాను జూన్ 22న తెలంగాణ పోలీస్‌శాఖకు కేంద్ర విదేశాంగశాఖ ది బెస్ట్ వెరిఫికేషన్ 2017-18 అవార్డును అందించింది. పోలీస్‌శాఖ వరుసగా మూడోసారి ఈ అవార్డు అందుకుంది.

మామిడి హరికృష్ణకు స్కోచ్ అవార్డు

-రాష్ట్రంలో ప్రతి కళాకారునికి ఆన్‌లైన్ ద్వారా గుర్తింపుకార్డు అదించినందుకుగాను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు స్కోచ్ అవార్డు లభించింది. జూన్ 23న జరిగిన స్కోచ్ 52వ సమ్మిట్‌లో ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులు

-జియో 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులను జూన్ 16న హైదరాబాద్‌లో ప్రదానం చేశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు జీవితసాఫల్య పురస్కారం దక్కింది. బహుబలి-2కు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు, రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించాయి. ఉత్తమ నటుడుగా విజయ్ దేవరకొండ, ఉత్తమ నటిగా సాయి పల్లవి ఎంపికయ్యారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

-2018 జూన్ 22న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది ఇద్దరు తెలుగువారికి పురస్కారాలు లభించాయి. ఆనందలోకం కవితాసంపుటి రాసిన నారంశెట్టి ఉమామహేశ్వర్‌రావుకు బాలసాహిత్య విభాగంలో, ఆకు కదలని చోటు కవితాసంపుటి రాసిన సుధాకర మౌళికి యువసాహిత్య విభాగంలో పురస్కారాలు లభించాయి.

తెలంగాణకు ర్యాపిడ్ అగ్రికల్చరల్ గ్రోత్ అవార్డు

-వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ప్రగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రముఖ వార్తాసంస్థ ఇండియా టుడే రాష్ర్టానికి జూన్ 23న స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్ పురస్కారాన్ని అందజేసింది. దీంతోపాటు స్కోచ్ సంస్థ కూడా వ్యవసాయశాఖ ప్రగతికి ఒకటి, రైతుబంధు పథకానికి రెండు పురస్కారాలను ఇచ్చింది.
JUNE-BRICS-Summit
2018-June-2
2018-June-1

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles