అద్భుత సంస్థలు అరుదైన కోర్సులు


Wed,December 5, 2018 01:24 AM

college-students
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎక్కువ మందికి ఇష్టం లేకున్నా ఎంసెట్, నీట్, ఐఐటీ జేఈఈ ఎంట్రెన్స్‌లు తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితి. చాలామంది తమ అభిరుచికి తగ్గ కోర్సులు లేవన్న నిరాశలో ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, సీఏ కోర్సులకు భిన్నంగా ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఎన్నో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందిస్తున్న ఆయా కోర్సులు సైన్స్, ఆర్ట్స్‌ల మిశ్రమం. సొంతంగా ఉపాధి పొందగలిగే కోర్సులు. వాటిలో ప్రకటనలు విడుదలైన కొన్నింటి వివరాలు...

హెచ్‌ఎస్‌ఈఈ-2019

- ఐఐటీ మద్రాస్‌లోని అతి పురాతనమైన విభాగాలైన హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కలిసి అందిస్తున్న ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకోసం నిర్వహించే ఎంట్రెన్స్ హెచ్‌ఎస్‌ఈఈ (హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్).

అందించే కోర్సు

- ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) ప్రోగ్రామ్. మొత్తం 46 సీట్లు. దీనిలో డెలప్‌మెంట్ స్టడీస్, ఇంగ్లిష్ స్టడీస్ అనే రెండు స్ట్రీమ్‌లు ఉంటాయి.
- ఈ కోర్సుల్లో ఎంపిక కోసం హెచ్‌ఎస్‌ఈఈని 2019, ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు. హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. ఈ పరీక్ష రాయడానికి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/తత్సమానకోర్సు ఉత్తీర్ణులు లేదా 2019 మార్చిలో పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. చివరితేదీ 2019 జనవరి 23. పూర్తి వివరాల కోసం http://hsee.iitm.ac.in చూడవచ్చు.

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ

- దేశంలో వినూత్నమైన, విభిన్నమైన కోర్సులను అందించే విశ్వవిద్యాలయాల్లో అజీం ప్రేమ్‌జీ వర్సిటీ ఒకటి. దీనిలో ఎర్లీ అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. రెగ్యులర్ అడ్మిషన్స్ మేలో జరుగుతాయి. వీటికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

- ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా శాట్ స్కోర్ ఆధారంగా చేస్తారు.
- అందించే కోర్సులు: మూడేండ్ల బీఏ (ఎకనామిక్స్/హ్యుమానిటీస్), బీఎస్సీ (ఫిజిక్స్/బయాలజీ/మ్యా థ్స్) వీటితోపాటు ఇంటర్ డిసిప్లినరీ విభాగాల కింద సస్టయినబిలిటీ, డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్, మీడి యా తదితర సబ్జెక్టులు ఉన్నాయి.
- వీటితోపాటు నాలుగేండ్ల బీఎస్సీ, బీఈడీ డ్యూయల్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్
- పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు: రెండేండ్ల ఎంఏ (ఎడ్యుకేషన్)/ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్/పబ్లిక్‌పాలసీ అండ్ గవర్నెన్స్. ఏడాది ఎల్‌ఎల్‌ఎం ఇన్ లా అండ్ డెవలప్‌మెంట్.
- వెబ్‌సైట్: https://azimpremjiuniversity.edu.in

నోట్: డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ కనపర్చినవారికి స్కాలర్‌షిప్స్, ఆర్థిక సహాయాన్ని యూనివర్సిటీ అందిస్తుంది. ఇక్కడ చదివినవారికి గత రికార్డుల ప్రకారం ఉపాధికి భరోసా ఉంటుంది.

ఎయిమ్స్ బీఎస్సీ కోర్సులు

- దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
- బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్), బీఎస్సీ (పారామెడికల్ కోర్సులు)
- బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఇంటర్ బైపీసీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పారామెడికల్ కోర్సులకు ఎంపీసీ/బైపీసీలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులుకావాలి. బీఎస్సీ పోస్ట్ బేసిక్ కోసం ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
- ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం బేసిక్ రిజిస్ట్రేషన్‌ను 2019, జనవరి 3లోగా చేసుకోవాలి. తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. జూన్‌లో పరీక్ష నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలకు https://www.aiimsexams.org చూడవచ్చు.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles