సిద్దిపేటలో ఎయిర్‌మెన్ ర్యాలీ


Sun,December 2, 2018 12:47 AM

indian-airforce
-ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అవకాశం. డిసెంబర్ 22న ప్రారంభం.
ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రకటన విడుదలైంది.
-పోస్టు: ఎయిర్‌మెన్ (గ్రూప్ వై, నాన్ టెక్నికల్) (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
-వయస్సు: 1998, జూలై 14-2002, జూన్ 26 మధ్య జన్మించి ఉండాలి.
-అర్హతలు: ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
-మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్: కనీసం 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, వైద్యపరీక్షల ద్వారా
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ): 6 నిమిషాల 30 సెకండ్లలో కనీసం 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 10 ఫుష్‌అప్స్, 10 సిట్‌అప్స్, 20 స్కాట్స్‌లను నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలి.
-రాతపరీక్ష: పీఎఫ్‌టీలో అర్హత సాధించినవారిని రాతపరీక్షకు అనుమతిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు. ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
-రాతపరీక్షలో అర్హత సాధించినవారికి అడప్టబిలిటీ టెస్ట్-1,2లను నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఎంపిక తేదీలు -
జిల్లాల వారీగా వివరాలు:
-యాక్టివిటీస్: పీఎఫ్‌టీ, రాతపరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్-1,2లు నిర్వహిస్తారు.
-డిసెంబర్ 22, 23న నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హైదరాబాద్.
-డిసెంబర్ 24, 25న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు.
నోట్: డిసెంబర్ 26 రిజర్వ్ డేగా పరిగణిస్తారు. పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య రిపోర్టింగ్ చేయాలి.
-వేదిక: ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు కర్ణాటక బెలగావిలోని బేసిక్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయింట్ బేసిక్ ఫేజ్ ట్రెయినింగ్ ఇస్తారు.
-పే&అలవెన్స్‌లు: శిక్షణ సమయంలో స్టయిఫండ్‌గా నెలకు రూ. 14,600/- చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత ప్రారంభవేతనం సుమారు రూ.26,900+డీఏ ఇస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకావడానికి అభ్యర్థులు తీసుకపోవాల్సిన సర్టిఫికెట్స్, దుస్తులు, ఇతర సామగ్రి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.airmenselections.cdac.in

425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles